Dragon Fruit Benefits : వేసవిలో డ్రాగన్ ఫ్రూట్ తింటే కలిగే లాభాలు మీకు తెలియదు-you dont know the benefits of eating dragon fruit in summer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dragon Fruit Benefits : వేసవిలో డ్రాగన్ ఫ్రూట్ తింటే కలిగే లాభాలు మీకు తెలియదు

Dragon Fruit Benefits : వేసవిలో డ్రాగన్ ఫ్రూట్ తింటే కలిగే లాభాలు మీకు తెలియదు

Anand Sai HT Telugu
Apr 09, 2024 09:30 AM IST

Dragon Fruits In Summer : వేసవిలో వాతావరణ మార్పు జరుగుతుంది. ఈ సమయంలో సరైన ఆహారం తీసుకోవాలి. అందులో ఒకటి డ్రాగన్ ఫ్రూట్. వేసవిలో ఇది తింటే అనేక ప్రయోజనాలు పొందుతారు.

డ్రాగన్ ఫ్రూట్ ప్రయోజనాలు
డ్రాగన్ ఫ్రూట్ ప్రయోజనాలు (Unsplash)

మీరు మార్కెట్‌లో డ్రాగన్ ఫ్రూట్‌ని చూసి ఉండవచ్చు. దీని ధర కాస్త ఎక్కువే. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే అని చెప్పొచ్చు. డ్రాగన్ ఫ్రూట్ రుచి కొందరికి నచ్చితే మరికొందరికి నచ్చదు. అయితే వేసవిలో ఇది మీ ఆరోగ్యానికి అమృతంలా మేలు చేస్తుంది. వేసవిలో మీ శరీరానికి ఎక్కువ నీరు అవసరం. మీరు తినే దాని ఆధారంగా మీ శరీరం చురుకుగా ఉంటుంది. వేసవిలో పండ్లు ఎంత ఎక్కువగా తింటే అంత ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే వేసవిలో ఈ డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరుగుతుందో చూద్దాం.

yearly horoscope entry point

పెద్దపేగు క్యాన్సర్ నివారిస్తుంది

పెద్దపేగు క్యాన్సర్‌ను నివారించడంలో డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పార్కిన్సన్స్, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారించడంలో ఇది సాయపడుతుంది.

జీర్ణక్రియకు ఉపయోగకరం

ఈ డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల జీర్ణక్రియకు చాలా మంచిది. దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బరువు అదుపులో ఉంటుంది. చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చేపలు తినని వారు ఈ పండు తినడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పొందవచ్చు. ఒమేగా 3 కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి.

డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి ముఖ కాంతిని పెంచుతుంది. చర్మ సౌందర్యానికి రోజూ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తాగితే మంచిది.

జుట్టు ఆరోగ్యానికి బాహ్య సంరక్షణ మాత్రమే కాకుండా అంతర్గత సంరక్షణ కూడా అవసరం. అందుకు పౌష్టికాహారం తీసుకోవాలి. జుట్టు ఆరోగ్యానికి కూడా డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచిది.

గర్భిణులకు మంచిది

డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ బి, ఫోలేట్, ఐరన్ ఉంటాయి. గర్భిణులకు దీనిని తింటే తల్లి, బిడ్డ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని మెగ్నీషియం ప్రసవానంతర డిప్రెషన్‌ను నివారించడంలో కూడా సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది, షుగర్ వ్యాధిగ్రస్తులు తింటే షుగర్ లెవెల్ పెరగదు, రోజూ తింటే చాలా ఉపయోగకరం.

డ్రాగన్ ఫ్రూట్ ఎలా తినాలి

నల్ల మచ్చలు లేదా పొడి ఆకులు ఉన్న పండు తినడం మంచిది కాదు. ఇవి అతిగా పండిన లక్షణాలు. మీరు నొక్కినప్పుడు అది గట్టిగా ఉంటే, తినడానికి ముందు కొన్ని రోజులు పండించనివ్వండి. డ్రాగన్ ఫ్రూట్ తినడానికి, మధ్యలో కట్ చేసి, ఆపై ఒక చెంచా, ఐస్ క్రీం స్కూప్ తీసుకొని లోపలి గుజ్జు మాత్రమే తినండి. దీని పై తొక్క తినదగినది కాదు. ఈ పండును వేసవిలో జ్యూస్‌లో కూడా తాగడం మంచిది. పంచదార కలిపి జ్యూస్ తయారు చేసుకోవచ్చు.

Whats_app_banner