Hair porosity Test: మీ జుట్టుకు ఏ నూనె సరిపోతుందో ఇంట్లోనే మీరే టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు.. ఎలాగో ఇక్కడ చూడండి!
Hair porosity Test: మీరు జుట్టు రాలడం వంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారా? ఎన్ని రకాల నూనెలు ఉపయోగించినా సరైన ఫలితం కనిపించడం లేదా? అయితే మీరు మీ జుట్టుకు సరిపడే నూనెను ఎంచుకోవడం లేదని అర్థం. మీ జుట్టుకు ఏ నూనె సరిపోతుందో ఇంట్లోనే మీరే టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు.. ఎలాగో ఇక్కడ చూడండి!
ప్రతి ఒక్కరూ ఒత్తుగా, పొడవుగా అందంగా ఉండే జుట్టును కోరుకుంటారు. కానీ ఈ రోజుల్లో జుట్టు సంబంధిత సమస్యలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండానే వెంట్రుకలు తెల్లబడటం, రాలిపోవడం, బట్టతల రావడం వంటి అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడటానికి రకరకాల హోం రెమెడీస్ తో పాటు ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా వాడుతున్నారు. అయినా ఫలితం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఇక్కడ చాలా మంది చేస్తున్న పొరపాటు ఏమిటంటే.. జుట్టు రకం తెలుసుకోకపోవడం.
నొప్పి తెలిస్తేనే కదా దానికి తగిన మందు ఇచ్చేది. అలాగే మీ జుట్టు రకం, శక్తి తెలిస్తేనే కదా దానికి తగిన ఉత్పత్తులను ఎంచుకునేది. అందుకే మీ జుట్టు అందం చెక్కుచెదరకుండా ఉండాలంటే, వెంట్రుకల శక్తి సామర్థ్యాలు, లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ జుట్టును గుర్తించడానికి హెయిర్ పోరోసిటీ పరీక్ష చేయండి. దీన్ని చాలా సులభమైన పద్ధతిలో ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు. మీరు ఈ పరీక్ష ఫలితాలను పొందిన తర్వాత సరైన హెయిర్ ఆయిల్‌ను ఎంచుకుని ఉపయోగించవచ్చు.
హెయిర్ పొరోసిటీ టెస్ట్( Hair Porosity Test) అంటే ఏంటి?
హెయిర్ పొరోసిటీ టెస్ట్అ అనేది మీ జుట్టు రకం, పరిమాణం, గుచ్చు వంటి వాటిని తెలిపే పరీక్ష. ఈ పరీక్ష ద్వారా మీరు జుట్టు పోరోసిటీ స్థాయిని తెలుసుకోగలుగుతారు, అంటే జుట్టు తడిగా ఉన్నప్పుడు ఎలా స్పందిస్తుందో, ఉత్పత్తులు జుట్టులో ఎంత వరకూ చేరుకుంటాయో తెలుసుకోవచ్చు. అంటే తడిసినప్పుడు మీ వెంట్రుకలు నీరు లేదా నూనె, షాంపూ వంటి ఉత్పత్తులు ఎలా గ్రహిస్తాయో తెలుసుకోవడానికి ఉపయోగపడే పరీక్ష.
హెయిర్ పొరోసిటీ టెస్ట్ చేసుకునే విధానం:
- ఈ పరీక్ష చేయడానికి, ఒక గాజు గ్లాసు లేదా గాజు గిన్నెను తీసుకోవాలి.దాని నిండా నీరు పోయండి.
- ఇప్పుడు మీ వెంట్రుకలను తీసుకుని నీటిలో వేయండి.
- మీ వెంట్రుక పూర్తిగా నీటిలో మునిగితే అది అధిక పొరోసిటికీ సంకేతం.
- వెంట్రుక మునగకుండా పైకి తేలితే తక్కువ పొరొసిటీకి చెందినది అని అర్థం.
- అలాగే పూర్తిగా మునగకుండా, పూర్తిగా తేలకుండా మధ్యలోనే ఉంటే మీడియం పొరోసిటీకి సంకేతం.
రిజల్ట్ ఏంటంటే..
హై పోరోసిటీ హెయిర్(High Porosity):
జుట్టు తక్షణం నీటిలో మునిగిపోతుంది అంటే, మీ జుట్టు అధిక పోరోసిటీతో ఉంటుందని అర్థం. ఈ జుట్టు నీటిని, ఉత్పత్తులను చాలా త్వరగా గ్రహిస్తుంది. ఈ రకమైన జుట్టులో, తేమ సులభంగా చొచ్చుకుపోతుంది. అలాగే త్వరగా బయటకు వస్తుంది. కనుక మీ వెంట్రుకలు తేమను నిలుపుకోవడంలో సహాయపడే ఉత్పత్తులను ఎంచుకోవాలి. ఆముదం నూనె, షియా వెన్న లేదా కొబ్బరి నూనె వంటి భారీ నూనెలను ఎంచుకోండి.
మీడియం పోరోసిటీ హెయిర్(Normal Porosity):
జుట్టు నీటిని కొన్ని క్షణాల పాటు గ్రహించిన తర్వాత క్రమంగా నీటిని పీలుస్తుంది. ఇది సాధారణ పోరోసిటీని సూచిస్తుంది. ఈ రకం జుట్టు మంచిదని భావించవచ్చు. ఎందుకంటే ఇది తేమను బాగా గ్రహించగలదు. ఎవరైనా మీడియం పోరోసిటీ జుట్టు కలిగి ఉంటే వారు ఆలివ్ ఆయిల్, అవోకాడో నూనెను వర్తించవచ్చు. ఇలాంటి వారు తేలికపాటి, భారీ నూనెలను ఉపయోగించవచ్చు.
తక్కువ పోరోసిటీ హెయిర్(Low Porosity):
జుట్టు నీటిలో తేలుతుంది లేదా తేలికగా నీటిని గ్రహిస్తుంది. ఇది తక్కువ పోరోసిటీని సూచిస్తుంది. ఈ జుట్టు నీటిని సమయం తీసుకుని గ్రహిస్తుంది. తక్కువ పోరోసిటీ అంటే జుట్టు క్యూటికల్స్ గట్టిగా మూసివేయబడతాయి. అంటే తేమ లోపలికి రావడం కష్టతరంగా ఉంటుంది. కనుక తేమను నిలుపుకోవడంలో సహాయపడటానికి జోజోబా, ఆర్గాన్ లేదా ద్రాక్ష విత్తనాల నూనె వంటి తేలికపాటి నూనెను ఎంచుకోండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం