Solo Polyamory: ఒకేసారి ఎక్కువ మందితో ప్రేమలో పడొచ్చు, వారితో శారీరక సంబంధం పెట్టుకోవచ్చు, ఇదే సోలో పొల్యామరి ట్రెండ్
Solo Polyamory: మారిపోతున్న డేటింగ్ ట్రెండ్‌లో మరొక కొత్త పద్ధతి వచ్చేసింది. అదే సోలో పొల్యామరి. ఇందులో ఏ వ్యక్తితోనూ కమిట్మెంట్ ఉండదు. నచ్చినంత మంది భాగస్వాములను కలిగి ఉండవచ్చు.
ప్రేమ సంబంధాలు, వివాహాలు అన్నవి ఆధునిక కాలంలో ఎంతగానో మారిపోయాయి. మనం జీవిస్తున్న ఈ కాలంలో వాటి విలువలను కాపాడుకోవడం చాలా సంక్లిష్టంగా మారిపోయింది. ఇప్పుడు కొత్తగా సోలో పొల్యామరి అనే కొత్త డేటింగ్ ట్రెండ్ వచ్చింది. ఇది సాంప్రదాయ అనుబంధానికి పూర్తి విరుద్ధంగా ఉంది. దీనిలో ప్రేమ, నిబద్ధత వంటివి ఏమీ లేవు.
ఒకే సమయంలో ఎక్కువమంది భాగస్వాములను కలిగి ఉండవచ్చు. వారితో ఎవరితోనూ పెళ్లికి కమిట్ అవ్వరు. నచ్చినంత కాలం కలిసి ఉంటారు. తర్వాత విడిపోతారు. ఒకరితో కలిసి ఉంటూ మరొకరితో సినిమాలకు, షికారులకు తిరుగుతారు. అయినా సరే వారి భాగస్వాములు ప్రశ్నించకూడదు. అదే ఈ సోలో పొల్యామరి ట్రెండ్.
నిజాయితీలేని ప్రేమ
సోలో పొల్యామరిని ఆధునిక యువత షరతులు లేని ప్రేమగా చెప్పుకుంటారు. ఈ ప్రేమలో నిబద్ధత అవసరం లేదు. శృంగార సంబంధాలకు ఒక నిజాయితీ కూడా కనిపించదు.
ఎంతో మందికి ఇష్టం
మన దేశంలో నిర్వహించిన ఒక సర్వేలో 61 శాతం మంది భారతీయులు ఎక్కువ మంది భాగస్వాములను కలిగి ఉండేందుకు ఆసక్తిగా ఉన్నట్టు చెప్పారు. వివాహం చేసుకున్న వ్యక్తులు కూడా ఎక్కువ మంది భాగస్వాములను కలిగి ఉండాలని ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిపారు.
సోలో పొల్యామరి ట్రెండ్‌ను ఇష్టపడే వ్యక్తులు చాలా స్వతంత్రంగా ఉంటారు. వారి అవసరాలకు ఇతర వ్యక్తులపై ఆధారపడేందుకు ఇష్టపడరు. స్వయంగా తమపై తామే ఆధారపడతారు. అలాగే దీర్ఘకాలం పాటు ఉండే అనుబంధాలపై వారు ఆసక్తిని చూపించరు. లోతైన భావోద్వేగాలను కూడా కలిగి ఉండరు.
సోలో పొల్యామరిలో బహుళ భాగస్వాములతో లైంగిక అనుబంధాన్ని పెట్టుకోవచ్చు. కాబట్టి అలాంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి లైంగికంగా సంక్రమించే వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి. సురక్షితమైన సెక్స్ ను మాత్రమే అభ్యసించడం మంచిది.
సామాజిక పద్దతులకు, సాంప్రదాయాలకు తలొగ్గకుండా తమ ప్రేమను అన్వేషించుకునేందుకు ఎక్కువమంది ఇలా సోలో పొల్యామరి ట్రెండ్ ను ఫాలో అవుతూ ఉంటారు.
ఎన్ని రోజులైనా కలిసి ఉండవచ్చు
సోలో పొల్యామరి ఒక భాగస్వామితో కలిసి జీవిస్తున్నప్పుడు అతడితో ఒక రోజు లేదా ఒక వారం, ఒక నెల రోజులపాటు ఉంటారు. నచ్చకపోతే వెంటనే అనుబంధం నుంచి బయటికి వచ్చి వేరొకరితో ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అలాగే ఒకే ఇంట్లో ఒక భాగస్వామితో జీవిస్తున్నా కూడా బయట ఇద్దరు ముగ్గురు భాగస్వాములను కలిగి ఉండడం సోలో పొల్యామరి ట్రెండ్. నిజానికి ఇది సామాజిక అనుబంధాలకు కట్టుబాట్లకు విరుద్ధమైనది. కానీ ఇప్పటి యువత ఇదే పద్ధతిని ఇష్టపడుతున్నారు.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే.)
సంబంధిత కథనం
టాపిక్