Body Language: అవతలి వ్యక్తులకు మీరంటే ఇష్టం లేదనే విషయాన్ని వారి బాడీ లాంగ్వేజ్‌ ద్వారా ఇట్టే పసిగట్టొచ్చు!-you can easily tell if someone doesnt like you through their body language ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Body Language: అవతలి వ్యక్తులకు మీరంటే ఇష్టం లేదనే విషయాన్ని వారి బాడీ లాంగ్వేజ్‌ ద్వారా ఇట్టే పసిగట్టొచ్చు!

Body Language: అవతలి వ్యక్తులకు మీరంటే ఇష్టం లేదనే విషయాన్ని వారి బాడీ లాంగ్వేజ్‌ ద్వారా ఇట్టే పసిగట్టొచ్చు!

Ramya Sri Marka HT Telugu

Body Language: బాడీ లాంగ్వేజ్ ద్వారా కొన్ని విషయాలను ఇట్టే పసిగట్టొచ్చు. ముఖ్యంగా కొన్ని సున్నితమైన విషయాల్లో ఎదుటి వారు తమ ఫీలింగ్ చెప్పకనే కొన్ని సంకేతాల ద్వారా చెప్తుంటారు. అది అర్థం చేసుకుంటే హుందాతనంగా ఆ బంధం నుంచి తప్పుకోవచ్చు.

అవతలి వ్యక్తులకు మీరంటే ఇష్టం లేదనే విషయాన్ని వారి బాడీ లాంగ్వేజ్ (Shutterstock)

పరిచయస్తులకి, స్నేహితులకి తేడా చాలా మందికి తెలియకపోవచ్చు. తమతో ఉన్న వాళ్లంతా తమ వాళ్లేనని ఫీలవుతుంటారు. పరిస్థితులు వస్తేనే గానీ, వాస్తవాలు బయటకు రావు. అలా జరగడానికి ముందే మీరు ఆ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటున్నప్పుడే కొన్ని సంకేతాల ద్వారా ఈ తేడాను గమనించవచ్చు. మరొక రకంగా చెప్పాలంటే, ఒక వ్యక్తితో డేటింగ్ చేస్తున్న సమయంలో మీపైన అవతలి వ్యక్తి ఇష్టం లేకపోయినా, మనస్పూర్తిగా మిమ్మల్ని అంగీకరించకపోయినా ఏదో ఒక అవసరం కోసం మాత్రమే బంధాన్ని కొనసాగిస్తుంటారు. అలాంటి వారిని ముందుగానే పసిగడితే మానసికంగా బాధను ఎదుర్కోవాల్సిన దుస్థితి రాదు. మనస్సుల్లోకి తొంగిచూసి, వారు మిమ్మల్ని నిజంగా ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి మీరు ప్రొఫెషనల్ మైండ్ రీడర్ కావాల్సిన అవసర్లేదా?

ఇష్టం లేకున్నా నటిస్తూ బంధం కొనసాగిస్తున్న వారిని ఇలా పసిగట్టండి:

సైకాలజిస్ట్ సూచనల ప్రకారం, ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడటం లేదంటే ఈ 5 బాడీ లాంగ్వేజ్ సంకేతాల వారి అయిష్టాన్ని బయటపెట్టేస్తుంటారు. అవేంటంటే,

  • ఐ కాంటాక్ట్ ఉండదు: డిస్కషన్ ను నామమాత్రంగా కొనసాగించడానికే ఇష్టపడతారు. కళ్లలోకి చూసి మనసుకు తాకేలా, లేదంటే వారు లోపల అనుకుంటున్నది స్పష్టంగా చెప్పడానికి ఇష్టపడరు.
  • పెదవులను కొరుకుతూ ఉండటం లేదా ఏదైనా పని చేస్తూ ఉండటం: అవతలి వ్యక్తి మనతో గడుపుతున్న సమయంలో నేరుగా మనతో మాట్లాడకుండా ఏదో పని చేస్తూ గడుపుతుంటారు. సమాధానం ఇవ్వకుండా కాస్త ఆలస్యం చేస్తుంటారు. ఇది అవతలి వ్యక్తులు మనపై చూపిస్తున్న చికాకు, అయిష్టత, తిరస్కారం వంటి ఫీలింగ్స్ ను సూచిస్తుంటాయట.
  • వెళ్లిపోవడానికి రెడీగా ఉంటారు: నిలబడి మాట్లాడుతున్నప్పుడు మీతో ముఖాముఖీగా ఉండటాన్ని ఇష్టపడరు. వారి శరీరాన్ని లేదా పాదాలను మరో దిశ వైపుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉంచుతారు. ఇలా చేయడాన్ని బట్టి ఎదుటి వారు మీతో సంభాషణ నుంచి నిష్క్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుసుకోవచ్చు.
  • అడ్డంకులు సృష్టిస్తూ..: మానసికంగా మీ మధ్య ఉన్న దూరాన్ని వస్తువులను ఉంచి చూపిస్తుంటారు. దగ్గరకు రానివ్వకుండా చేతులు అడ్డుపెట్టడం, వస్తువులు ఉంచడం వంటివి ఉంచి శారీరకంగా దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. మీరు నిలబడిన స్థలానికి ఒక అడుగుదూరం వరకూ వెనక్కి జరిగి వారి అసౌకర్యాన్ని కనబరుస్తుంటారు.
  • ఫార్మాలిటీ స్మైల్: నవ్వాల్సిన పరిస్థితుల్లోనూ మొక్కుబడిగా నవ్వుతుంటారు. చెప్పే విషయాలను పూర్తిగా వినకుండానే సరేనని సమాధానాలిస్తుంటారు. పదేపదే ఒక ముఖ కవళికలతో సమాధానమిస్తుంటారు. వీటిని బట్టి ఎదుటి వ్యక్తికి మనపై ఎటువంటి ఆసక్తి లేదని, భరించడం ఇబ్బందిగా ఫీలవుతున్నారని గమనించవచ్చు.

సందర్భాన్ని బట్టి ప్రతిస్పందన

పై వాటిలో ఏ ఒక్క విషయంపైనో ఆధారపడి నిర్ధారణలకు వెళ్లకండి. కేవలం ఒక హావభావాన్ని మాత్రమే విరుద్ధంగా భావించి నిర్ణయాలు తీసుకోకండి. ఎల్లప్పుడూ సందర్భం కోసం చూడండి. భావోద్వేగాలను తెలియజేయడంలో బాడీ లాంగ్వేజ్ తో పాటు వాయిస్ పిచ్, టోన్ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. మీతో బంధం కొనసాగించడానికి ఇష్టపడటం లేదని మీకనిపిస్తే, మీ సందేహాల గురించి వెంటనే అడగండి. సందేహాలు కలిగి ఉండటం అపార్థాలకు దారితీస్తుంది. కొన్ని సార్లు మనస్సులో లేని ప్రతికూలతను కొన్ని సందర్భాల్లో చూపించాల్సి రావొచ్చు.

సంబంధిత కథనం