Lemon Plant: ఇంట్లోనే కుండీలో నిమ్మచెట్టును ఇలా సులువుగా పెంచేయచ్చు, ఈ చిట్కాలు పాటించండి-you can easily grow a lemon tree in a pot on the balcony just follow these tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lemon Plant: ఇంట్లోనే కుండీలో నిమ్మచెట్టును ఇలా సులువుగా పెంచేయచ్చు, ఈ చిట్కాలు పాటించండి

Lemon Plant: ఇంట్లోనే కుండీలో నిమ్మచెట్టును ఇలా సులువుగా పెంచేయచ్చు, ఈ చిట్కాలు పాటించండి

Haritha Chappa HT Telugu
Feb 05, 2025 08:48 AM IST

Lemon Plant: బాల్కనీలోనే నిమ్మ చెట్టును సులువుగా పెంచేయచ్చు. దీన్నీ కుండీలోనే పెంచవచ్చు. నిమ్మ చెట్టును కుండీలో ఎలా పెంచాలో తెలుసుకోండి.

కుండీలోనే నిమ్మ మొక్కను ఎలా పెంచాలి?
కుండీలోనే నిమ్మ మొక్కను ఎలా పెంచాలి?

నిమ్మ చెట్టును పెంచాలంటే ఇంటి వెనుక పెద్ద పెరడు ఉండాలని అనుకుంటున్నారా? అవసరం లేదు. బాల్కనీ ఉంటే చాలు. అందులోనే కుండీలో నిమ్మ చెట్టును పెంచేయచ్చు. సేంద్రీయ పద్దతిలోనే నిమ్మకాయలను పొందవచ్చు. నిమ్మ చెట్టును పెంచడానికి చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే చాలు. సులువుగా అవి పెరిగేస్తాయి.

yearly horoscope entry point

విత్తనాలు లేదా మొక్కలు

మీరు విత్తనాలను నాటాలనుకుంటున్నారా లేదా మొక్కను కొనుగోలు చేయాలనుకుంటున్నారా అన్నది ముందుగా నిర్ణయించుకోండి. విత్తనాల నుండి పెంచినప్పుడు మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది. విత్తనం స్థాయి నుంచి అది ఎదగడాన్ని మీరు చూడవచ్చు. అయితే మొక్కను నాటడం వల్ల నిమ్మకాయలు త్వరగా, కచ్చితంగా కాసే అవకాశం ఉంది.

సరైన కుండ

మీరు కుండలో మొక్కను పెంచుతున్నట్లయితే, అది పెద్ద కుండ అయి ఉండాలి. అప్పుడు మొక్క బాగా పెరుగుతుంది. కుండ లేదా సంచి 7 అంగుళాల లోతుతో విశాలంగా ఉండాలి.

మట్టి మిశ్రమం

నర్సరీలోని తోటమాలిని సంప్రదించి, మీ కుండలో ఉంచాల్సిన మట్టి మిశ్రమాన్ని తెలుసుకోండి. 50 శాతం తోట మట్టి, 20 శాతం వానపాము ఎరువు లేదా సేంద్రీయ ఎరువు, ఇతర మట్టిని కలపండి.

నీటి అవసరం

మీరు మొక్కకు నీరు పోసేటప్పుడు జాగ్రత్తగా పోయాలి. ఎందుకంటే నిమ్మ చెట్టు సువాసన, పండ్లు కొన్ని కీటకాలను ఆకర్షిస్తాయి. కాబట్టి, మట్టి ఉపరితలం పొడిగా ఉన్నప్పుడు మాత్రమే నీరు పోయాలి. వేసవిలో, రోజుకు ఒకసారి నీరు పోయాలి. మరి అధికంగా నీటిని పోయకూడదు.

సూర్యకాంతి అవసరం

నిమ్మ చెట్లకు సూర్యకాంతి అవసరం. ప్రకాశవంతమైన సూర్యకాంతి పడాలి. అప్పుడు మొక్క పెరుగుతుంది, పూలు, పండ్లు వస్తాయి. కాబట్టి మీరు బాల్కనీ తోటలో మొక్కను ఉంచినట్లయితే, కుండకు తగినంత ఖాళీ ఉందో లేదో, రోజుకు 6 గంటల సూర్యకాంతి వస్తుందో లేదో చూడండి. కొంత సమయం నీడలో ఉంచడం కూడా మంచిది.

మట్టిని కదిలించండి

నిమ్మ చెట్టు చుట్టూ ఉన్న మట్టిని బాగా కదిలించాలి. మీరు మొక్కను ఇంటికి తీసుకువచ్చినప్పుడు, ఆకులు పెరగడం ప్రారంభమవుతాయి. ప్రతి 20 నుండి 25 రోజులకు మట్టిని కదిలించాలి.

ఎరువు అవసరమా?

పండ్లు త్వరగా రావాలంటే మీరు నిమ్మ చెట్టుకు ఎరువు వేయాలి. కానీ, ఇది పూలు పూసే సమయంలో చేయాలి. ఆకులు రాలే సమయంలో చేయకూడదు. పూలు రావడం ప్రారంభించిన తర్వాత, ఎరువు వేసి, అనవసరమైన ఆకులను తొలగించాలి.

పండ్లు ఎప్పుడు రావడం ప్రారంభిస్తాయి?

పూలు పూసిన వెంటనే పండ్లు రావడం ప్రారంభమవుతాయి. నిమ్మ చెట్టులోని పూలు తెల్లగా ఉంటాయి. వాటిపై బంగారు రంగు మొగ్గలు ఉంటాయి. వాటిలో పచ్చని గింజలు ఉంటాయి. మొదటి పూవు పూసిన 2 వారాలలో ఇలా ఉంటుంది.

ఎప్పుడు కోయాలి?

ఒకటిన్నర నెలల తర్వాత, పూలు కాయలుగా మారిన తర్వాత నిమ్మకాయలు పూర్తిగా పెరగడం ప్రారంభిస్తాయి. అవి ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇంకా కొన్ని వారాలు పట్టి పసుపు రంగులోకి మారుతాయి. కాబట్టి అది మారే వరకు వేచి ఉండండి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner

సంబంధిత కథనం