Yoni Massage: లైంగిక సంబంధంలో మరింత తృప్తి పొందడం కోసం యోనిని మసాజ్ చేసుకోండిలా!!
Yoni Massage: యోని భాగంలో మసాజ్ చేసుకోవడం వల్ల లైంగిక సంతృప్తితో పాటు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. ఈ విధంగా చేయడం వల్ల భావప్రాప్తి కలగడమే కాకుండా పరిపూర్ణ ఆరోగ్యం కూడా మీసొంతంఅవుతుంది.

స్పాకు వెళ్లి మసాజ్ చేయించుకోవడం వల్ల బాడీ రిలాక్స్ అవుతుంది కదా. కానీ, చాలా సార్లు శరీరానికి మసాజ్ చేసే సమయంలో యోని భాగాన్ని పట్టించుకోరు. కానీ, ఇదొక ఇంద్రియ మసాజ్. ఎటువంటి లైంగిక చర్య చేయకుండానే యోని భాగంలో మసాజ్‌తో ప్రకంపనలు కలిగించవచ్చు. ఇలా చేయడం వల్ల ఋతుక్రమంలో సమస్యల నుంచి ఉపశమనం అందుతుంది.
యోని మసాజ్ చేయడం అంటే ఏమిటి?
స్త్రీ జననేంద్రియమైన యోనికి మసాజ్ చేయడం వల్ల విశ్రాంతిని ప్రోత్సహించినట్లు అవుతుంది. అంతేకాకుండా ఒకరితో ఒకరికి శారీరక సంబంధం మెరుగుపరుచుకోవచ్చట. దీని ఉద్దేశ్యం లైంగిక ఆనందం కాదు. రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి, కండరాలలో ఉద్రిక్తతను కలుగజేస్తుంది.
యోని మసాజ్ వల్ల కలిగే 5 ప్రయోజనాలు:
యోని మసాజ్ చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా తృప్తిని ఎలా కలుగజేస్తుందంటే..
స్వీయ అవగాహన, శరీరంతో సంబంధం
యోని మసాజ్ వల్ల శరీరంతో సంబంధం ఏర్పడి మహిళలకు తమ శరీరంపై తమకు పూర్తి అవగాహన ఏర్పడుతుంది. ఈ మసాజ్‌లో యోని పక్కనే ఉన్న ప్రాంతాలను సున్నితంగా స్ప్రుసిస్తారు. ఇలా చేయడం వల్ల మహిళలకు తమలో కలిగే ఫీలింగ్స్ వల్ల శరీర నిర్మాణంపై అవగాహన పెరుగుతుంది. ఈ అవగాహన వారిలో స్ట్రాంగ్ ఫిజికల్ ఫీలింగ్‌కు దారితీస్తుంది.
లైంగిక ఆనందాన్ని పెంచుతుంది
యోని భాగంలో తరచుగా మసాజ్ చేయడం వల్ల క్లిటోరిస్‌ను ప్రేరేపించినట్లు అవుతుంది. అక్కడి రక్తప్రవాహాన్ని మెరుగుపరిచి, భావప్రాప్తికి దారితీస్తుంది. క్రమం తప్పకుండా యోని మసాజ్ చేయించుకోవడం వల్ల మహిళలు తమ సరిహద్దుల గురించి మరింత తెలుసుకోవచ్చు. తమకు ఏది సంతోషాన్ని కలగజేస్తుందో స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. ఒంటరిగా సంతృప్తి చెందడం, భాగస్వామితో చక్కటి శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయడాన్ని నేర్చుకుంటారు.
భావోద్వేగాల వ్యక్తీకరణ
కొందరి గతాలలో లైంగికంగా ఎదుర్కొన్న చేదు అనుభవాలు బాధిస్తుంటాయి. అటువంటి వారు తమ భావోద్వేగాలను పూర్తిగా ఎక్స్‌ప్రెస్ చేయలేరు. అంతేకాకుండా ఇతరులకు శారీరకంగా దగ్గరవడానికి ఇష్టపడరు. భయం, అపరాధం, దుఃఖం వంటి భావాలు వారిలో భావోద్వేగాలను బయటకు రానివ్వవు. అటువంటి వారిలో యోని మసాజ్ స్వీయ అవగాహన కల్పించి, భావోద్వేగాలను స్పష్టంగా వ్యక్తీకరించేలా చేస్తుంది.
పెల్విక్ ఫ్లోర్ కండరాల సామర్థ్యం
యోని మసాజ్ ప్రక్రియ పెల్విక్ ఫ్లోర్ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. దీనిని రెగ్యూలర్ గా చేస్తుండటం వల్లన బిగుతుగా ఉన్న పెల్విక్ ఫ్లోర్ కండరాలు సడలేందుకు కారణమవుతుంది. మరోవైపు మహిళలు కండరాలలో మరింత స్పర్శను గ్రహిస్తారు. ఫలితంగా బలం, టోన్ పెరుగుతుంది. పెల్విక్ ఫ్లోర్ బలపడటం వలన మూత్రాశయ నియంత్రణ సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా రిలాక్స్‌డ్, దృఢమైన పెల్విక్ ఫ్లోర్ సంభోగ సమయంలో నొప్పి కలగకుండా చేస్తుంది.
సంభోగంలో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది
కటి ప్రాంతంలో రక్తప్రసరణను మెరుగుపరిచి గర్భాశయం చుట్టూ ఉండే కండరాలలో ఒత్తిడి తగ్గిస్తుంది. ఫలితంగా సంభోగం సమయంలో అసౌకర్యాన్ని తగ్గించగలదు. ప్రశాంతతను కల్గించి, మానసిక కల్లోలం నుంచి బయటపడేస్తుంది.
యోని భాగంలో మసాజ్ చేసే సమయంలో శుభ్రతను పాటించండి. ఫలితంగా ఇన్ఫెక్షన్లు నివారించవచ్చు. మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనించి వ్యవహరించండి.
సంబంధిత కథనం