పచ్చ గన్నేరు పువ్వు వల్ల కలిగే ప్రయోజనం తెలియక చాలా మంది నిర్లక్ష్యపెడుతుంటాం. రోడ్డు పక్కన కనిపించే ఈ మొక్కలను చాలా మంది పిచ్చి మొక్కలుగా పరిగణిస్తుంటారు. వాస్తవానికి ఇందులో ఉండే ఔషద గుణాలు తెలిసిన వారెవ్వరూ వీటిని వదిలిపెట్టరు. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం, పచ్చ గన్నేరు పువ్వును శివుడికి, విష్ణువుకి ప్రీతికరమైనదిగా చెప్తుంటారు. దీనిని పీత కర్వీర, దివ్య పుష్పం అనే ఇతర పేర్లతో పిలుస్తుంటారు. చూడటానికి ఎంత అందంగా ఉంటుందో, ఆయుర్వేదం ప్రకారం అన్ని ప్రయోజనాలను అందిస్తుంది కూడా. ఈ పువ్వుతో పుండ్లు, పీరియడ్ సమయంలో కలిగే నొప్పులు, పైల్స్ వంటి అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా ఉపయోగిస్తారు.
ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు తరచుగా మలబద్ధకం సమస్యకు దారితీస్తాయి. ఈ విధంగా మీకు కూడా మలబద్ధకం సమస్య ఉంటే, పచ్చ గన్నేరు పువ్వుతో మీ సమస్యకు పరిష్కారం వెదుక్కోవచ్చు. మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి, పసుపు గన్నేరు ఆకులు, బెరడుతో కషాయం తయారు చేసి తాగడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది.
చర్మంపై మొటిమలు, పుండ్లు లేదా మచ్చలు ఉన్నవారు పసుపు గన్నేరు మొక్క బెరడుతో తయారుచేసిన పేస్ట్‌ను చర్మంపై రాసుకోవచ్చు. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు లేదా మచ్చలతో పాటు దద్దుర్ల సమస్య నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ముఖంపై కనిపించే పుండ్లను నయం చేయడానికి, మజ్జిగలో ఒక చెంచా పసుపు, పచ్చ గన్నేరు పువ్వులు వేసి పేస్ట్ తయారు చేసుకోండి. ఆ తర్వాత ఈ పేస్ట్‌ను ముఖంపై ఉన్న మొటిమలపై రాసుకోండి. ఇలా చేయడం ద్వారా మొటిమల సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
చాలా మందికి శీతాకాలంలో కీళ్ళ నొప్పులు ఉంటాయి. ఈ సమస్య నుండి ఉపశమనం పొందడంలో పచ్చ గన్నేరు ఆకులు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, వీటి ఆకులను రుబ్బి ఆలివ్ ఆయిల్‌తో కలిపి కీళ్ళకు మర్దన చేయడం వల్ల కీళ్ళ నొప్పులకు ఎంతో ఉపశమనం లభిస్తుంది.
ఋతుకాలంలో వచ్చే నొప్పులు, అసౌకర్యం నుండి ఉపశమనం పొందడంలో పసుపు గన్నేరు పువ్వుతో తయారుచేసిన కాషాయం సహాయపడుతుంది. ఈ చర్య కోసం మీరు గన్నేరు తాజా పువ్వులతో తయారుచేసిన కాషాయాన్ని ఉపయోగించవచ్చు.
పైల్స్ సమస్య నుండి ఉపశమనం పొందడానికి గన్నేరు పువ్వులు సహాయపడతాయి. ఇలా చేసేందుకు గానూ గన్నేరు ఆకులు, వేప ఆకులను కలిపి రుబ్బి పేస్ట్ తయారు చేసుకోండి. ఆ తర్వాత ఈ పేస్ట్ ను పైల్స్ ఉన్న ప్రదేశంలో రోజుకు మూడు సార్లు రాసుకోండి. ఈ చర్య ద్వారా మీకు ఉపశమనం లభిస్తుంది.
పసుపు కనెరును వాడే ముందు దాని సరైన మోతాదు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా సమస్య నుండి ఉపశమనం పొందడానికి దీనిని అధికంగా వాడితే వాంతులు, విరేచనాలు, తలనొప్పి, కడుపులోనొప్పి, గుండె సమస్యలు, బలహీనత వంటి లక్షణాలు కనిపించవచ్చు. కాబట్టి, దీన్ని మీ ఆహారంలో చేర్చే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
సంబంధిత కథనం