World Water Day 2025: సమస్తాన్ని బతికించే నీటికి ఈ ఒక్క రోజు ఇచ్చేద్దామా! ప్రపంచ జల దినోత్సవ ప్రాముఖ్యత, చరిత్ర
World Water Day 2025: నీరు లేనిదే ఒక్క రోజైనా ఉండగలమా? పొనీ ఒక్కపూట? చాలా కష్టం కదా. మరి భవిష్యత్ తరాల మాటేంటి? మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటి ప్రాముఖ్యత, నీటి కొరత వంటి విషయాలను తెలుసుకుందాం రండి.
నీరు మనిషికి జీవనాధారం. శరీరంలోని ప్రతి జీవక్రియ నీరు చాలా చాలా అవసరం. కేవలం శరీరం కోసం మాత్రమే కాదు. మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా నీటిపై ఆధారపడి ఉంటుంది. పంటలు పండేందుకు, వంటల తయారీకి, జంతువులు జీవించేందుకు, పరిశ్రమలు నడపడానికి, పరిశోధనలు చేయడానికి, విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి, పర్యావరణానికి ఇలా అన్నింటకీ నీరు అవసరం.నేడు మార్చి 22 ప్రపంచ జల దినోత్సవాన్ని నీటి ప్రాముఖ్యత, సంక్షోభం వంట వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రపంచ జల దినోత్సవం చరిత్ర (world water day history) :
ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకోవాలనే తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి సాధారణ సభ మొదటిసారిగా 1992 డిసెంబర్ 22న ఆమోదించింది. తరువాత మార్చి 22ని ప్రపంచ జల దినోత్సవంగా ప్రకటించారు. అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మొదటి ప్రపంచ జల దినోత్సవాన్ని 1993లో జరుపుకున్నారు.
ప్రాముఖ్యత(world water day significance):
‘నీరు జీవనామృతం’ అని అందరికీ తెలుసు. త్రాగడం నుండి శుభ్రపరచడం వరకూ అది లేకుండా జీవితం ఉండదు. చాలా మంది 24x7 ప్రవహించే నీటి సౌకర్యాన్ కలిగ ఉన్నారు, కానీ ప్రపంచవ్యాప్తంగా కనీసం చుక్క నీరు కూడా లభించని ప్రాంతాలు, జనాబా ఇంకా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. సగటు మనిషి రోజుకు దాదాపు 3,000 లీటర్ల నీటిని వినియోగిస్తాడు. ఇది పానీయం, ఆహారం తయారీ, పరిశుభ్రత, వ్యవసాయం వంటి ఇతర అవసరాల కోసం కావచ్చు. పాలలోకి, కూరగాయలను, పండ్లను శుభ్రం చేయడానికి, వంట చేయడనికి శరీరాన్ని శుభ్రం చేసుకునేందుకు ఇలా నీరు తప్పనిసరి.
కానీ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో నీటి కొరత ఒక పెద్ద సమస్యగా మారింది. జల కాలుష్యం, వృథా వినియోగం, వర్షపాతం తగ్గడం వంటి అనేక సమస్యల కారణంగా నీటి వనరులు క్షీణిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రకారం.. ప్రస్తుతం నలుగురిలో ఒకరు (అంటే ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ల మంది) - సురక్షితమైన త్రాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. పరిశుభ్రమైన త్రాగునీరు లేకపోవడం వల్ల సంవత్సరానికి సుమారు 1.4 మిలియన్ మంది మరణిస్తున్నారు. 74 మిలియన్ల మంది పేలవమైన నీరు, పరిశుభ్రతకు సంబంధించిన వ్యాధుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. OECD అంచనాల ప్రకారం, 2050 నాటికి ప్రపంచ నీటి డిమాండ్ (నీటి ఉపసంహరణలో) 55 శాతం పెరుగుతుంది.కనుక నీటి పరిరక్షణ విషయంలో దృష్టి సారించడం అత్యంత ముఖ్యం. మనం తీసుకునే కొన్ని జాగ్రత్తలే మన భవిష్యత్తుకు, తద్వారా మన పిల్లలకు, వారి పిల్లలకు నీటి వనరులు అందేలా చేస్తాయి.
ప్రపంచ జల దినోత్సవం(World Water Day 2025 Theme):
ప్రతి సంవత్సరం ఈ దినోత్సవానికి ఒక ప్రత్యేక అంశం (theme) కూడా ఉంటుంది. ఇది ఆ సంవత్సరం జల సంక్షోభాలపై అవగాహన పెంచడం, నీటి సంక్షేమం, నీటి పరిరక్షణ అంశాలను ప్రాముఖ్యంగా ప్రస్తావిస్తుంది. 2025 ప్రపంచ జల దినోత్సవం కోసం "Accelerating Change" అనే అంశం పెట్టారు. దీని ద్వారా మానవులు నీటి వనరులను సురక్షితంగా ఉంచేందుకు ఎక్కువ చర్యలు తీసుకోవాలని ప్రోత్సహిస్తున్నారు.
"Accelerating Change" అనే థీమ్ అంటే.. "మార్పును వేగవంతం చేయడం".
ప్రపంచ జల దినోత్సవం 2025 కోసం ఎంచుకున్న ఈ థీమ్, నీటి వనరుల పరిరక్షణ, వాటి సద్వినియోగం నీటి సంక్షోభాలను పరిష్కరించడంలో మన చర్యలను వేగంగా తీసుకోవాలని, అనుకున్న మార్పులను త్వరగా సాధించాలనే సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది.
ఉదాహరణకు..
1. సమస్యలు పరిష్కరించడంలో వేగం: నీటి కొరత, కాలుష్యం, వనరుల క్షీణత వంటి సమస్యలు దినదినం పెరిగిపోతున్నాయి. ఈ సమస్యలపై పరిష్కారం దిశగా చేసే చర్యలను వేగవంతం చేయాలి.
2. సాంకేతిక పరిజ్ఞానం, ఇన్నోవేషన్స్ ఉపయోగించడం: నీటి వనరుల రక్షణ కోసం సాంకేతికత, నూతన ఆవిష్కరణలను మరింత ఉపయోగించి మార్పులను సాధించాలి.
3. వ్యక్తిగత, సామాజిక, ప్రభుత్వ చర్యలు: సాంఘిక సంస్థల, ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం పెంచి నీటి వనరుల పరిరక్షణ కోసం అందరూ కలిసి మరింత వేగంగా పనిచేయాలని ప్రోత్సహించడం.
4. చురుకైన చర్యలు, మార్పు తేవడం: సరైన మార్గాలను ఎంచుకుని, నిర్ధిష్టమైన చర్యలు తీసుకుంటూ నీటి కోసం స్థిరమైన పరిష్కారాలను అందించాలి.
సంబంధిత కథనం