World Toilet day 2024: మనదేశంలో ఎంత మంది ఇంకా ఆరుబయటే ఆ పనిచేస్తున్నారో తెలుసా? దీని వల్లే రోగాల వ్యాప్తి
World Toilet day 2024: ప్రపంచ టాయిలెట్ దినోత్సవం ప్రతి ఏడాది నవంబర్ 19న నిర్వహించుకుంటారు. ప్రపంచంలో ఎంత మంది ఇంకా ఆరుబయట మలవిసర్జన చేస్తున్నారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
ఒకప్పుడు పారిశుధ్య విలువలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. పారిశుధ్యానికి ఎక్కువ విలువను ఇస్తున్నారు. అందుకే ప్రతి ఏడాది పారిశుధ్యం పై అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి నవంబర్ 19న ప్రపంచ టాయిలెట్ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఐక్యరాజ్యసమితి చెబుతున్న ప్రకారం ప్రపంచంలో 350 కోట్ల మందికి ఇప్పటికీ మంచి పారిశుద్ధ్య అవకాశాలు లేవు. 41 కోట్ల మంది ఇంకా బహిరంగంగానే మలవిసర్జన చేస్తున్నారు. దీనివల్ల ఎన్నో రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి.
ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం ఎందుకు?
ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం అనగానే అందరూ చదవకుండా చూపు తిప్పేస్తారు. నిజానికి ఇదే ఎంతో ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని నిర్ణయించేది. ఆరు బయట మలవిసర్జన చేయడం వల్ల రకరకాల రోగాలు వ్యాప్తి చెంది ప్రాణాలు తీస్తున్నాయి 21లో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి తొలిసారి ప్రారంభించింది. ఆరుబయట మలవిసర్జన కారణంగా ప్రజారోగ్యం, పర్యావరణం ప్రమాదంలో పడుతూ ఉండడాన్ని గమనించి దానిపై అవగాహన కల్పించేందుకే ఈ దినోత్సవాన్ని స్థాపించింది. పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం వల్ల నీరు కలుషితం అవుతుంది. ఆరు బయట మలవిసర్జన చేయడం వల్ల రకరకాల రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఈ రెండింటి వల్లే ప్రతిరోజూ ప్రపంచంలో ఐదేళ్ల వయసు కంటే తక్కువ ఉన్న వయసు ఉన్న పిల్లలు వెయ్యి మంది మరణిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి చెబుతోంది. వారందరి ప్రాణాలు కాపాడాలంటే పారిశుధ్య రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. ఆరు బయట మలవిసర్జన మానేయాలి.
మనదేశంలో పారిశుధ్ధ్యాన్ని మెరుగుపరచడానికి స్వచ్ఛభారత్ మిషన్ ప్రారంభించారు. 2014 నుండి ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇంట్లోనే మరుగుదొడ్లను నిర్మించి ఇస్తున్నారు. లక్షల పబ్లిక్ టాయిలెట్లను కూడా నిర్మించారు. కానీ వాటిని పూర్తిగా వాడుతున్న వారి సంఖ్య తక్కువగానే ఉంది. ఇంకా గ్రామాల్లో బయట మలవిసర్జనకు వెళుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.
ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల మంది మంచినీరు దొరకక ఇబ్బంది పడుతున్నారు. వారు కచ్చితంగా నీటిని తాగుతూ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు. వారిలో 200 కోట్ల మందికి కనీసం ప్రాథమిక పరిశుభ్రత సౌకర్యాలు కూడా లేవు. ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్న పిల్లలను అధికంగా చంపుతున్నవి పారిశుద్ధ్యం లేని కారణంగా వచ్చే వ్యాధులే.
పిల్లల ప్రాణాలు కాపాడుకోవాలన్నా, రోగాల వ్యాప్తిని తగ్గించుకోవాలన్నా ఆరు బయట మలవిసర్జనను మానేయాలి. ఇంట్లోనే ఒక టాయిలెట్ ను కట్టుకొని అందులోనే పనులను పూర్తి చేయాలి. అందుకోసం ప్రభుత్వ సాయాన్ని కూడా తీసుకోవాలి.
ఆరు బయట మల విసర్జన కారణంగా ఎన్నో రకాల రోగాలు విస్తరిస్తాయి. ముఖ్యంగా కలరా, టైఫాయిడ్, డయేరియా వంటివి వీటి వల్ల ఎక్కువగా వస్తాయి. వీటి బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఆరు బయట మలవిసర్జన మానేయాలి. తమ చుట్టుపక్కల పరిసరాలను, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పారిశుధ్యానికి ఎక్కువ విలువ ఇవ్వాలి.
టాపిక్