World Television Day 2023 : భారతదేశంలోకి టీవీ ఎప్పుడు వచ్చింది? ఏ ఏరియాలోకి?
World Television Day 2023 History : టెలివిజన్ ఇప్పుడు ప్రతీ ఒక్కరి జీవితంలో భాగం అయిపోయింది. టీవీ లేని ఇల్లు లేదేమో. నవంబర్ 21న టెలివిజన్ డే. ఈరోజును ఎందుకు నిర్వహిస్తారు? ఇండియాలోకి టీవీ ఎప్పుడు వచ్చింది?
నవంబర్ 21 అంతర్జాతీయ టెలివిజ్ దినోత్సవం(World Television Day). ప్రతీ ఏటా ఈ రోజున నిర్వహిస్తారు. ఎన్నో విషయాలను మన కళ్ల ముందు చూపించే టీవీకి పుట్టినరోజు అన్నమాట. టెలివిజన్ ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 21న ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. టీవీ కనిపెట్టినప్పటి నుంచి టెలివిజన్ వినోదంలో అత్యంత ముఖ్యమైన వనరులలో ఒకటి.
ట్రెండింగ్ వార్తలు
ఒకప్పుడు టీవీ అంటే డబ్బు ఉన్నవారి ఇళ్లలోనే ఉండేది. కానీ మారుతున్న పరిస్థితులతో ప్రతీ ఒక్కరి ఇంట్లో టీవీ భాగమైపోయింది. టీవీ లేని ఇంటిని ఇప్పుడు చూడలేం. టెక్నాలజీ పెరిగి.. సెల్ ఫోన్ల వాడకం పెరిగినా.. టీవీలను చూసేవారూ ఉన్నారు. కచ్చితమైన సమాచారం కోసం వాటి మీదే ఆధారపడుతుంటారు. ఐక్యరాజ్యసమితి ప్రకారం, ఇది వీడియో వినియోగం కోసం, కచ్చితమైన సమచారం కోసం ఉపయోగించే వస్తువుగా కొనసాగుతోంది. ప్రపంచ టెలివిజన్ దినోత్సవం దృశ్య మాధ్యమం శక్తిని, ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో, ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేయడంలో ఎలా సహాయపడుతుందో గుర్తుచేస్తుంది.
నవంబర్ 21, 1996న ఐక్యరాజ్యసమితి మొదటి ప్రపంచ టెలివిజన్ ఫోరమ్‌ను నిర్వహించింది. ప్రముఖ మీడియా ప్రముఖులు ఫోరమ్‌లో భాగంగా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్‍కు పెరుగుతున్న ప్రాముఖ్యత గురించి చర్చించారు. అప్పుడే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) ప్రతి సంవత్సరం నవంబర్ 21ని ప్రపంచ టెలివిజన్ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది.
టీవీని 1924లో స్కాటిష్ ఇంజనీర్, జాన్ లోగీ బైర్డ్ కనిపెట్టారు. ఇది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) సహాయంతో భారతదేశంలో సెప్టెంబర్ 15, 1959న న్యూ ఢిల్లీలో ప్రవేశపెట్టారు. ప్రారంభంలో భారతదేశంలో కమ్యూనిటీ హెల్త్, ట్రాఫిక్, రోడ్ సెన్స్ పౌరుల విధులు, హక్కులు వంటి వాటిపై వారంలో రెండు రోజులపాటు గంట సేపు కార్యక్రమాలు ప్రసారం చేశారు.
ప్రపంచ టెలివిజన్ దినోత్సవం నాడు కమ్యూనికేషన్, ప్రపంచీకరణలో టెలివిజన్ పోషిస్తున్న పాత్ర గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి సమావేశాలు జరుగుతాయి. ప్రసార మాధ్యమాల పాత్రను గుర్తుచేస్తారు. రచయితలు, పాత్రికేయులు, బ్లాగర్లు, టీవీతో అనుబంధించబడే ఇతరులు ఈ రోజును గురించి మాట్లాడుతారు.
సోషల్ మీడియాలో కంటెంట్‍లో వాస్తవికత సందేహాస్పదంగా ఉన్న సమయాల్లో నిష్పాక్షిక సమాచారాన్ని అందించడానికి ప్రభుత్వాలు, వార్తా సంస్థలు, వ్యక్తుల నిబద్ధతhపై కూడా ఈ రోజు చర్చిస్తారు. ఎంత సాంకేతిక వచ్చినా.. టీవీ గొప్పతనం దానిదే. టెలివిజన్ అప్డేట్ మోడల్స్ వస్తున్నాయి.. కానీ వీటి ప్రాముఖ్యత మాత్రం తగ్గడం లేదు. ప్రపంచ రాజకీయాల్లోనూ టీవీ పాత్ర చాలా గొప్పది. World Television Day నాడు ఒక్కసారి మీ టీవీవైపు చూసి దాని గొప్పతనాన్ని గుర్తుచేసుకోండి.