Ways To Quit Smoking। ఈ సింపుల్ చిట్కాలతో మీరు సిగరెట్ మానేయటం గ్యారెంటీ!-world no tobacco day 2023 checkout 6 simple ways to quit smoking easily ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  World No Tobacco Day 2023 Checkout 6 Simple Ways To Quit Smoking Easily

Ways To Quit Smoking। ఈ సింపుల్ చిట్కాలతో మీరు సిగరెట్ మానేయటం గ్యారెంటీ!

HT Telugu Desk HT Telugu
May 31, 2023 10:39 AM IST

World No Tobacco Day 2023: ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ధూమపానం లేదా పొగాకు ఉత్పత్తుల వినియోగం మానేయడానికి కొన్ని మార్గాలను ఇక్కడ తెలుసుకోండి.

Ways To Quit Smoking
Ways To Quit Smoking (Unsplash)

World No Tobacco Day 2023: ఆక్సిజన్ పీల్చుకోవాల్సిన ఊపిరితిత్తులు సిగరెట్ పొగతో నిండిపోతున్నాయి, ఈ పరిణామం ఆరోగ్యాన్ని మసకబారుస్తుంది. పొగాకు ఉత్పత్తుల వినియోగం వలన తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతున్నప్పటీ, ఈ ధోరణి తగ్గడం లేదు. భారతదేశంలో ధూమపానం చేసే వారు ఎక్కువ అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి, ప్రస్తుతం సుమారు 100 మిలియన్ల మంది పైగా ధూమపానం చేస్తున్నారు. ఇది కాకుండా భారతదేశంలో సుమారు 2.8 మిలియన్ల మంది ఇ-సిగరెట్లను ఉపయోగిస్తున్నారని అంచనా.

పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, పొగాకు కంపెనీల వ్యాపార విధానాలపై అవగాహన కల్పించేందుకు ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1987లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది, పొగాకు మహమ్మారి వలన కలిగే దుష్ఫ్రభావాలను ఎత్తి చూపడం ఈ రోజుకు ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. 2023వ సంవత్సరం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం థీమ్ “మనకు ఆహారం కావాలి, పొగాకు కాదు”.

Ways To Quit Smoking: ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ధూమపానం లేదా పొగాకు ఉత్పత్తుల వినియోగం మానేయడానికి కొన్ని మార్గాలను ఇక్కడ తెలుసుకోండి.

1. పొగాకు ఉత్పత్తుల స్టాక్ ఉంచుకోకండి

మీవద్ద పొగాకు ఉత్పత్తుల స్టాక్ ఉంటే, అవి అయిపోయేంత వరకు వినియోగించాలనే కోరిక కలుగుతుంది. సిగరెట్ ప్యాకెట్ ఉంటే ఒక్కొక్కటిగా కాల్చేస్తారు, ఇలా ఎప్పుటికీ కొనుగోలు చేయకండి. మీరు వెళ్లి సిగరెట్ కొనుగోలు చేయడం వలన మీరు కాల్చే సిగరెట్ల సంఖ్య తగ్గుతుంది.

2. ఆలస్యం చేయండి

మీరు సిగరెట్ కాల్చాలి అని మీకు అనిపిస్తున్నట్లయితే, వెంటనే సిగరెట్ కోసం బయలుదేరకండి, ఒక 10 నిమిషాలు మీ కోరికను ఆలస్యం చేయండి. ఆ సమయంలో మీ దృష్టి మరల్చడానికి ఏదైనా చేయండి. పబ్లిక్ స్మోక్-ఫ్రీ జోన్‌కి వెళ్లడానికి ప్రయత్నించండి. లేదా మీ పనిలో నిమగ్నం అయిపోండి.

3. ఏదైనా నమలండి

పొగాకు కోరికను నిరోధించడానికి మీ నోటికి ఇతర పని అప్పజెప్పండి. చక్కెర లేని చ్యూయింగ్ గమ్ నమలండి, లేదా లవంగం లాంటి ఏదైనా సుగంధ దినుసులను నమలండి. లేదా పచ్చి క్యారెట్లు, గింజలు లేదా పొద్దుతిరుగుడు గింజలు - కరకరలాడేవి రుచికరమైనవి నమలండి.

4. 'చివరగా ఒక్క సిగరెట్' కూడా వద్దు

చాలా మంది లాస్ట్ ఇదే ఇక సిగరెట్ తాగను అంటూ చివరి సిగరెట్ అంటూ వెలిగిస్తారు. కానీ అది కచ్చితంగా చివరి సిగరెట్ కాదు. ఇది మిమ్మల్ని మీరే మోసం చేసుకోవడం అవుతుంది. చివరి సిగరెట్ కూడా కాల్చవద్దు. ఆపేయండి.

5. శారీరక శ్రమ చేయండి

వ్యాయామం లేదా ఏదైనా శారీరక శ్రమ పొగాకు కోరికల నుండి మిమ్మల్ని మరల్చడంలో సహాయపడుతుంది. కొన్ని సార్లు మెట్లు పైకి ఎక్కడం, నడకకు వెళ్లాడం, పరుగెత్తడం వంటి చిన్న చిన్న కార్యకలాపాలు కూడా పొగాకు కోరికను దూరం చేస్తాయి. నడక లేదా జాగింగ్ కోసం బయటకు వెళ్లండి.

6. ఆరోగ్యం గురించి ఆలోచనలు చేయండి

పొగాకు మానేస్తే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకోండి. ఒక్క సిగరెట్ మానేస్తే ఎంత మేలో గుర్తించండి. మీకు తెలుసా? మీ ఊపిరితిత్తులు స్వీయ శుభ్రత కలిగిన అవయవం. మీరు సిగరెట్ మానేసిన రోజు నుంచి అవి వాటంతటవే శుభ్రపడతాయి. మీరు ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.

కాబట్టి చెప్పొచ్చేదేమిటంటే.. చక్కగా ఉండండి, రనౌట్ కావొద్దు!

WhatsApp channel

సంబంధిత కథనం