Ego Awareness Day | ఇగో మీ చుట్టూ వైఫైలాగా ఉందా? అయితే మీరు డేంజర్​లో ఉన్నట్టే..-world ego awareness day history and theme ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  World Ego Awareness Day History And Theme

Ego Awareness Day | ఇగో మీ చుట్టూ వైఫైలాగా ఉందా? అయితే మీరు డేంజర్​లో ఉన్నట్టే..

HT Telugu Desk HT Telugu
May 11, 2022 01:43 PM IST

అహం. ఇది చాలా మందిలో ఉంటుంది. అసలు అహమే ఉండొద్దు అంటే కొందరికి మితిమీరిన అహం ఉంటుంది. దీని వల్ల చాలా మానసిక సమస్యలు ఎదురవుతాయి. వారితో పాటు.. వారి చుట్టూ ఉన్నవారు కూడా.. దీనితో ఇబ్బందులు పడతారు. అలాంటి వారికోసమే ప్రపంచ అహంకార అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ఇగో
ఇగో

World Ego Awareness Day 2022 | ప్రతి సంవత్సరం మే 11వ తేదీన ప్రపంచ అహంకార అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ రోజు అహం అనే సమస్య కలిగి ఉన్నవారికి... దానిపై అవగాహాన కల్పించి.. అహం ప్రతి దానిపై ఎలా ప్రభావం చూపిస్తుందో అనే విషయాలపై అవగాహన కల్పిస్తారు. దీనిని ఆదర్శవంతంగా తీసుకుని ఏడాది పొడవునా.. స్వీయ-అభివృద్ధి, అహంకారాన్ని తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. అహం వల్ల కలిగే సమస్యలు, పరిణామాలపై విస్తృత అవగాహనను పెంపొందించడానికి ప్రపంచ అహంకార అవగాహన దినోత్సవం సహాయపడుతుంది. ఇగో అవేర్‌నెస్ మూవ్‌మెంట్ 2018లో ఒక నెట్​వర్క్​గా ఏర్పాటు చేశారు. అహంతో సంబంధం ఉన్న మానసిక పరిస్థితులతో పోరాడుతున్న వారికి మద్దతుగా ఉండేందుకు దీనిని ఏర్పాటు చేశారు.

మితిమీరిన అహం అనారోగ్యకరం

మితిమీరిన అహంకార ఆవేశం, పక్షపాతం, న్యూనత కాంప్లెక్స్‌లు, ఆధిపత్య భావాలు, ఒత్తిడికి సంబంధించిన హింస, జాత్యహంకారం, సెక్సిజం వంటి మరెన్నో సమస్యలు కలిగిస్తుంది. అహంకార సమస్యలకు ఆమోదం అవసరం. అహంతో పోరాడుతున్న వారు ఒంటరితనం, నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. అహంభావం అనేది భావోద్వేగ మానసిక రూపం. వారు దానితో బాధపడుతున్నారని లేదా బాధితులుగా ఉన్నారని తెలిసినప్పుడు.. వారి ఆలోచనను అంగీకరించడానికి కాస్త కష్టమే అయినా.. వారికి సపోర్ట్ ఇవ్వండి.

ప్రపంచ ఈగో అవేర్‌నెస్ డేలో పాల్గొనడం

వరల్డ్ ఈగో అవేర్‌నెస్ డే రోజు దానిగురించిన సమాచారాన్ని సోషల్ మీడియా పోస్ట్‌లు ద్వారా పంచుకోండి. మీటప్ గ్రూప్‌లకు హాజరవండి. స్థానిక ఈవెంట్‌లలో పాల్గొని అహంకారంపై, అహంకారం వల్ల కలిగే సమస్యల పట్ల ప్రజలలో అవగాహన పెంచాలి. అహాన్ని ఎలా మచ్చిక చేసుకోవాలో వారికి వివరించాలి.

 

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్