Earth Day | ప్రపంచ ఎర్త్ డేని ఎందుకు చేస్తారో తెలుసా? మొదటిసారి ఎక్కడ చేశారంటే
వాతావరణ సంక్షోభంపై దృష్టి సారిస్తూ.. ప్రపంచంలోని దేశాలన్ని.. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన ప్రపంచ ధరిత్రి దినోత్సవం జరుపుకుంటారు. కాబట్టి ఈ రోజున పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత, అవసరం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ప్రతి ఏటా ఏదొక థీమ్‌తో ముందుకు వస్తారు. ఈ ఏడాది థీమ్ ఏంటో, మొదటిసారి ఈ డేని ఎక్కడ జరిపారో తెలుసుకుందాం.

World Earth Day 2022 | ప్రపంచ ధరిత్రి దినోత్సవం. దీనిని అంతర్జాతీయ మదర్ ఎర్త్‌డే అని కూడా పిలుస్తారు. దీనిని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన నిర్వహిస్తుంటారు. రోజు రోజుకూ తీవ్రమవుతున్న ప్రపంచ వాతావరణ సంక్షోభంపై దృష్టి సారిస్తూ ఎర్త్‌డే చేస్తారు. అధిక జనాభా, జీవవైవిధ్యాన్ని కోల్పోవడం, ఓజోన్ పొర క్షీణించడం, పెరుగుతున్న కాలుష్యంతో సహా పెరుగుతున్న పర్యావరణ సమస్యలపై ఈ రోజు ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
ఈ సంవత్సరం థీమ్ ఇదే..
ఏప్రిల్ 22న జరిపే ప్రపంచ ఎర్త్ డే వేడుక చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది ఉత్తర అర్ధగోళంలో వసంతకాలం, దక్షిణ అర్ధగోళంలో శరదృతువు. ఈ సమయంలో వాతావరణం కూడా అనుకూలిస్తుంది కాబట్టి.. ఎర్త్ డే వేడుకలను కొనసాగించడం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ డేని ఉద్దేశిస్తూ.. ఓ థీమ్ చేస్తారు. ఈ సంవత్సరం అంటే 2022 ఎర్త్ డే థీమ్ 'మన గ్రహంలో పెట్టుబడి పెట్టడం'.
ఎర్త్ డే చరిత్ర
అంతర్జాతీయ మదర్ ఎర్త్ డేని ఏప్రిల్ 22, 1970వ సంవత్సరంలో తొలిసారి నిర్వహించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన యునెస్కో సదస్సులో శాంతి కార్యకర్త జాన్ మెక్ కన్నెల్.. మదర్ ఎర్త్, శాంతి భావనను గౌరవించాలని ప్రతిపాదించారు. ప్రపంచ ఎర్త్ డేని ముందుగా మార్చి 21, 1970న ఉత్తర అర్ధగోళంలో వసంతకాలం ఒకటిగా జరుపుకోవాలని నిర్ణయించారు. ఆ తర్వాత యూఎస్ సెనేటర్ గేలార్డ్ నెల్సన్ ఏప్రిల్ 22, 1970న దేశవ్యాప్త పర్యావరణ జ్ఞానోదయాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత దీనిని 'ఎర్త్ డే'గా మార్చారు.
ఎర్త్ డే ఎందుకు నిర్వహిస్తారంటే..
కాలుష్యం, అటవీ నిర్మూలన వంటి పర్యావరణ సమస్యలను చర్చించడానికి మిలియన్ల మంది ప్రజలను కనెక్ట్ చేయడానికి దీనిని నిర్వహిస్తున్నారు. వివిధ వాతావరణ సమస్యల గురించి యువకులకు అవగాహన కల్పించడానికి.. వారితో చర్చలు నిర్వహించడానికి ఈవెంట్‌లను నిర్వహిస్తారు.
ఎర్త్ డే రోజున వాతావరణ మార్పుల గురించి అవగాహన పెంచడానికి, గూగుల్ నాలుగు స్థానాలకు సంబంధించిన యానిమేషన్‌ల శ్రేణిని రూపొందించింది. మీరు ఈరోజు క్రోమో ఇంటర్నెట్ బ్రౌజర్‌లో గూగుల్ శోధన హోమ్‌పేజీని సందర్శించినప్పుడు.. మీరు టైమ్‌లాప్స్ యానిమేషన్‌ను చూస్తారు. ఈ యానిమేషన్లు సమయ వ్యవధిలో వాతావరణ మార్పుల ప్రభావాన్ని ప్రదర్శించడానికి ప్రతి గంటకు మారుతుంటాయి.
సంబంధిత కథనం