World Earth Day 2024 : వరల్డ్ ఎర్త్ డే.. మనిషి తప్ప మరే జంతువు ఈ భూమికి హాని చేయదు
World Earth Day 2024 : భూమికి ఒక్క మనిషి మాత్రమే శత్రువు. పుడమిని నాశనం చేసేది మనిషే. స్వార్థంతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడు. ఏప్రిల్ 22న వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా భూమి గురించి కొన్ని మంచి మాటలు మీ చుట్టుపక్కల వారికి చెప్పండి.
భూమిని ఏం చేసినా.. అది ఎప్పుడూ మానవుల మంచినే కోరుకుంటుంది. పర్యావరణాన్ని నాశనం చేసినా.. మనం కడుపు నిండా తినేందుకు మనకు అన్నం పెడుతుంది పుడమి. అలాంటి పుడమిని స్వార్థ ప్రయోజనాల కోసం మనుషులు నాశనం చేస్తున్నారు. దీంతో పర్యావరణంలో మార్పులు వస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా ఎర్త్ డే జరుపుకొంటారు. అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే అని కూడా పిలుస్తారు, ఈ ప్రత్యేకమైన ప్రపంచ ధరిత్రి దినోత్సవంనాడు.. పుడమికి జరుగుతున్న హానిపై చాలా మంది గళం విప్పుతారు.

వరల్డ్ ఎర్త్ డే మొదటిసారిగా ఏప్రిల్ 22, 1970న జరుపుకొన్నారు. 1969లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన UNSEO సదస్సులో శాంతి కార్యకర్త జాన్ మెక్‌కానెల్ మదర్ ఎర్త్, శాంతి భావనను గౌరవించాలని ప్రతిపాదించాడు. అయితే ప్రపంచ ఎర్త్ డేని మొదట 21 మార్చి 1970న, ఉత్తర అర్ధగోళంలో వసంతకాలం మొదటి రోజున నిర్వహించాలని ప్రతిపాదన వచ్చింది. తరువాత యునైటెడ్ స్టేట్స్ సెనేటర్ గేలార్డ్ నెల్సన్ 22 ఏప్రిల్ 1970న దేశవ్యాప్త పర్యావరణ అవగాహనను నిర్వహించాలని ప్రతిపాదించారు.. దానిని 'ఎర్త్ డే'గా మార్చారు.
వాతావరణ మార్పుల గురించి తెలుసుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా దాని గురించి అవగాహన కల్పించడానికి, భూమికి జరుగుతున్న హాని గురించి తెలియజేయడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22 న ఎర్త్ డే నిర్వహిస్తారు. అయితే ఈ ప్రత్యేకమైన రోజున మీ దగ్గరి వారితో కొన్ని మంటి మాటలు షేర్ చేసుకోండి.
భూమిని పచ్చగా మార్చండి.. జీవించడానికి అందమైన ప్రదేశంగా మార్చండి.
మనం బతికుండగా భూమిపైనే జీవించాలి.. చనిపోయాక మట్టిలో కలిసిపోవాలి.. అమ్మలాగా అక్కున చేర్చుకునే తత్వం భూ మాతది.. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది..
మనమందరం కలిసి భూ మాతను ప్రేమతో చూసుకుందాం. మీకు ఎర్త్ డే శుభాకాంక్షలు
సహజవనరులను సంరక్షిస్తామని, కాపాడతామని ప్రతిజ్ఞ చేద్దాం..
భూమిని సంరక్షించడం, రక్షించడం ద్వారా భూ తల్లికి మన కృతజ్ఞతలు తెలియజేయాలి.
మన భవిష్యత్ తరాలకు భూమిని మంచి రూపంలో అప్పగించడం మన బాధ్యత. దీన్ని మంచి ప్రదేశంగా మార్చడానికి కలిసి పని చేద్దాం.
ప్రతి సంవత్సరం ఒక వ్యక్తి ఒక చెట్టు నాటుతామని వాగ్దానం చేద్దాం. ఈ విధంగా మనం జీవించడానికి పచ్చని భూమిని కలిగి ఉంటాం.
ఇతరులు భూమిని రక్షించే వరకు వేచి ఉండకండి, అది మీతో ప్రారంభించండి.. భూమి తల్లి కూడా ఒక జీవి అనుకోండి. ప్రేమించండి, గౌరవించండి.
భూ తల్లి ప్రతి మనిషి అవసరాలను తీర్చడానికి తగినంత అందిస్తుంది. మనం మాత్రం ఏమీ తిరిగి ఇవ్వలేకపోతున్నాం..
ఈ భూమిపై ఉన్న సమస్త జీవరాశుల మనుగడకు మనవంతు కృషి చేద్దాం, రేపటి తరం కోసం కాపాడుకుందాం. ఈ సృష్టిలో అద్భుతమైన పుడమిని కాపాడుకుందాం..
భూ మాత ఎల్లప్పుడూ మనకు జీవితంలో అన్ని సౌకర్యాలు, అవసరాలను అందిస్తుంది. ఇది ప్రతి ఒక్కరినీ తల్లిలా చూస్తుంది.. మనం కూడా దానిని రక్షించాలి, సాధ్యమైనంత జాగ్రత్తగా చూసుకోవాలి.
కాలుష్యాన్ని నియంత్రించి, చెట్లను నాటడం ద్వారా భూమిని రక్షించుకుందామని ప్రతిజ్ఞ చేయాలి. భూమిని జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా భూ తల్లికి మన కృతజ్ఞతలు తెలియజేయాలి.
మనమందరం కలిసి భూ మాతను ప్రేమతో చూసుకుందాం. భూమి మనలను రక్షిస్తోంది.. మనం దానిని రక్షించాలి. Happy Earth Day 2024
టాపిక్