ప్రతీరోజూ ఈ అలవాట్లే బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి-world brain tumor day these lifestyle factors increasing brain tumor must stop from today ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ప్రతీరోజూ ఈ అలవాట్లే బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి

ప్రతీరోజూ ఈ అలవాట్లే బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి

Anand Sai HT Telugu

జీవితంలో మనం చేసే తప్పులే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. మనకున్న అలవాట్లు చాలా పెద్ద సమస్యలను తీసుకొస్తాయి. చిన్న చిన్న తప్పులు కూడా బ్రెయిన్ ట్యూమర్లకు దారితీస్తాయి. వాటిని సరిదిద్దుకుంటే హ్యాపీగా ఉండొచ్చు.

బ్రెయిన్ ట్యూమర్

ూన్ 8 అనేది ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే. ఇది చాలా ప్రమాదకరమైనది. బ్రెయిన్ ట్యూమర్ అనేది మన మెదడులో అసాధారణ కణాల పెరుగుదల వల్ల కలిగే తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధి. ఇటీవలి పరిశోధనలు మన జీవనశైలి, కొన్ని అలవాట్లు దాని ప్రమాదాన్ని బాగా పెంచుతాయని చెబుతున్నాయి. చాలా సార్లు మనం తెలియకుండానే రోజూ చేసే కొన్ని తప్పులు మన మెదడును దెబ్బతీస్తాయి. బ్రెయిన్ ట్యూమర్ వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి.

ఈ అలవాట్లు

ధూమపానం, అధిక మద్యం వినియోగం మెదడుకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. మెదడులోని రక్త నాళాలు, కణాలను దెబ్బతీస్తుంది. ఈ కారకాలు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మెదడు కణితుల అవకాశాలను పెంచుతుంది.

మెుబైల్ ఫోన్

కొంతమందికి గంటల తరబడి మొబైల్ ఫోన్లలో మాట్లాడుతుంటారు. ఎక్కువసేపు మొబైల్ ఫోన్ వాడటం, ముఖ్యంగా హెడ్ ఫోన్స్ లేదా స్పీకర్లు లేకుండా ఫోన్‌ను చెవికి దగ్గరగా పట్టుకోవడం వల్ల మెదడు నేరుగా రేడియేషన్‌తో సంబంధంలోకి వెళ్తుంది. మొబైల్ ఫోన్ల ద్వారా వెలువడే రేడియేషన్ మెదడు కణాలను దెబ్బతీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. మొబైల్ వాడకాన్ని వీలైనంత తగ్గించండి. బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాన్ని తగ్గించుకోండి.

ప్రాసెస్ చేసిన ఆహారాలు

రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, నూనెలో వేయించిన ఆహారాలు అధికంగా తీసుకోవడం మెదడుకు మంచిది కాదు. వాటిలో ఉండే నైట్రేట్లు, ప్రిజర్వేటివ్‌లు మెదడు కణాలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ పదార్థాలు శరీరంలో క్యాన్సర్ కారకాలను పెంచగలవు. ఇది బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదాన్ని పెంచుతుంది .

నిద్ర అవసరం

మన మొత్తం ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యమైనది. తగినంత నిద్రపోవడం మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. నిరంతరం నిద్ర లేకపోవడం వల్ల మెదడు కణాలపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఇది వాపు, అసాధారణ కణాల పెరుగుదలకు కారణం అవుతుంది. ఇది బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదాన్ని ఎక్కువ చేస్తుంది.

ఒత్తిడి

దీర్ఘకాలిక ఒత్తిడి, మానసిక ఒత్తిడి అనారోగ్యాలకు దారితీయడమే కాకుండా హార్మోన్ల అసమతుల్యత, మెదడులోని కణాల నష్టానికి కూడా కారణమవుతాయి. ఇది కణితి ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.