Period Cramps: పీరియడ్ సమస్యలను పసుపుతో అధిగమించండి! ఇంటి చిట్కాతోనే ఇబ్బందిని తప్పించుకోండి
Period Cramps: పీరియడ్స్ సమయంలో వచ్చే పీరియడ్ క్రాంప్స్ నుంచి పసుపు కాపాడుతుందట. పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమ్మేటరీ గుణాలు నొప్పి నుంచి ఉపశమనం కలిపిస్తాయట. అదెలాగో చూద్దామా..
నెలసరి సమయంలో మహిళలు సాధారణంగానే నొప్పితో ఇబ్బందిపడుతుంటారు. ఈ నొప్పిని పోగొట్టేందుకు మెడిసిన్ ఉండొచ్చు. కానీ, ఈ ఇంటి రెమెడీ కూడా పీరియడ్స్ ద్వారా వచ్చే నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుందట. సూపర్ ఫుడ్‌గా పిలుచుకునే పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమ్మేటరీ గుణాలు ఉంటాయట. ఇవి నొప్పి నుంచి బయటపడేందుకు సురక్షితమైన, సమర్థవంమైన పరిష్కారంగా పని చేస్తాయట. ఇంకా చెప్పాలంటే, కేవలం నొప్పిని తగ్గించడమే కాకుండా అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుందట పసుపు.

పసుపు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎదుర్కోగల యాంటీ ఆక్సిడెంట్ సామర్థ్యాన్ని పెంచడంలోనూ సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేచురల్ రెమెడీతో పీరియడ్ సమయంలో వచ్చే నొప్పులే కాదు ఎమోషనల్ స్ట్రెస్ నుంచి కూడా పరిష్కారం దొరుకుతుందని నిపుణుల అభిప్రాయం. ఎందుకో, ఎలాగో తెలుసుకుందాం పదండి.
అసలు పీరియడ్ క్రాంప్స్ (పీరియడ్ సమయంలో కలిగే నొప్పి) అంటే ఏమిటి?
పీరియడ్ క్రాంప్స్ ను శాస్త్రీయంగా డైస్మెనోరియా (Dysmenorrhea) అని పిలుస్తారు. పీరియడ్స్ సమయంలో పొత్తి కడుపులో కలిగే నొప్పి కారణగానే పీరియడ్ క్రాంప్స్ వస్తాయి. అయితే ఇది వ్యక్తిని బట్టి మారుతుంటుంది. పొత్తి కడుపులో వచ్చే నొప్పే పీరియడ్ క్రాంప్స్ కు ప్రధాన కారణం. ఈ సందర్భంలో మీకు నడుం కింది భాగంలో నొప్పి, వికారంగా, విరేచనాలు, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయట. అటువంటి సమయంలో పసుపు తీసుకోవడం మర్చిపోకండి. ఇది చాలా సింపుల్ రెమెడీ అయినప్పటికీ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
పసుపు ప్రభావవంతంగా పనిచేయగలదా:
పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమ్మేటరీ, యాంటీస్పాస్మోడక్ అనల్గేసిక్ గుణాలు పీరియడ్ క్రాంప్స్ ను తగ్గిస్తాయి అంతేకాకుండా నెలసరి సమయంలో కలిగే ఇబ్బంది నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
పసుపును ఎలా తీసుకోవాలి?
పీరియడ్ క్రాంప్స్ తగ్గించేందుకు సింపుల్ రెమెడీ అయిన పసుపును రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఈ కొన్ని విధాలలో ప్రయత్నించవచ్చు కూడా.
1. పసుపుతో టీ:
నీరు మరగపెట్టుకుని అందులో ఒక టీ స్పూన్ పసుపును వేసుకోండి. అలా ఒక 5 నుంచి 10 నిమిషాలు మరిగిన తర్వాత వడకట్టుకుని తాగేయడమే. రుచి కోసం అందులో తేనే, నిమ్మరసం పిండుకోవచ్చు.
2. గోల్డెన్ మిల్క్:
మీకు పాలు తాగే అలవాటుంటే, ఒక చిటికెడు పసుపును పాలలో వేసుకుని అందులో కొన్ని మిరియాలు, చిన్న ముక్క అల్లం వేసుకుని కాసేపటి వరకూ వేడి చేయండి. ఆ తర్వాత అందులో తేనె లేదా కొబ్బరి నూనె వేసుకుని తాగేయండి.
3. వంటల్లో పసుపు:
సూప్ లలో చిటికెడు పసుపు వేయడం ద్వారా నెలసరి నొప్పి నుంచి సమర్థవంతంగా బయటపడగలం.
4. పసుపుతో స్మూతీ
ఏదైనా పండు, పాలకూర, బాదం పాలు మిశ్రమంలా కలుపుకోండి. అందులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకుని, చిటికెడు మిరియాల పొడి వేసుకోండి. చివరిగా తేనె లేదా కొబ్బరి నూనె కలుపుకుని తాగేయడమే.
5. పసుపు నీళ్లు
గ్లాసు నిండి వేడి నీళ్లు తీసుకోండి. అందులో టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా తిప్పండి. కావాలంటే కాస్త నిమ్మరసం, రెండు మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం