Women's Day Wishes : స్త్రీ లేకుండా సృష్టే లేదు.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు-womens day 2024 greetings motivational quotes wishes whatsapp status facebook messages ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Women's Day Wishes : స్త్రీ లేకుండా సృష్టే లేదు.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

Women's Day Wishes : స్త్రీ లేకుండా సృష్టే లేదు.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

Anand Sai HT Telugu
Mar 08, 2024 05:00 AM IST

Women's Day 2024 : స్త్రీ లేకుండా జననం లేదు. స్త్రీ లేనిది అసలు సృష్టే లేదు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మీ ప్రియమైన వారికి ఈ కోట్స్ పంపండి.

ఉమెన్స్ డే విషెస్
ఉమెన్స్ డే విషెస్ (Unsplash)

ఈ ప్రపంచం ప్రేమతో నడుస్తుంటే స్త్రీలు ఆ ప్రేమకు ప్రతిరూపం. మనందరికీ స్ఫూర్తినిచ్చే అతిపెద్ద శక్తి స్త్రీలు. నేడు అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు ఎందరో ఉన్నారు. స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం బాగుంటుంది. కుటుంబాన్ని, పనిని ఒకే సమయంలో చూసుకోవడంలో సూపర్ స్టార్‌లుగా ఉన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలు విజయాలను సాధిస్తున్నారు. మహిళలను గౌరవించటానికి ప్రతి సంవత్సరం మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోంటారు. స్త్రీల శక్తిని చాటేందుకు, వారి హక్కులను పరిరక్షించేందుకు ఈ రోజును నిర్వహిస్తారు.

yearly horoscope entry point

మీ చుట్టూ ఉన్న స్త్రీలందరికీ మీరు కచ్చితంగా అభినందించాల్సిన రోజు ఇది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 సందర్భంగా కొన్ని మధురమైన సందేశాలను మీ జీవితంలోని మహిళలతో పంచుకోండి.

జీవితం ఇంద్రధనస్సు అయితే స్త్రీలు దాని రంగులు. మా జీవితాలను మెరుగుపరచడంలో సహకరించే మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

మీ జీవితంలో మీకు కావలసిన ప్రతిదానికీ మీరు అర్హులు. ఎందుకంటే మీరు చేస్తున్న సేవ అద్భుతం. మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నా జీవితంలో ఇంత బలమైన మహిళను పంపినందుకు దేవునికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. Happy Womens Day

బలమైన, అందమైన, ప్రేమగల, ప్రత్యేకమైన మహిళ.. నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

ప్రియమైన స్త్రీలారా మీది మొదటి నుండి నిస్వార్థ ప్రేమ, మీరు చేస్తున్న సేవకో మేం ఎప్పుడూ బానిసలమే. దేవుడు మీకు మరింత శక్తిని ఇవ్వాలి. మహిళ దినోత్సవ శుభాకాంక్షలు..

నువ్వు నాకు స్ఫూర్తి మాత్రమే కాదు నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. నువ్వే నా బంగారు గని.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

ప్రియతమా నువ్వు నా జీవితాన్ని రంగులమయం చేయడానికి వచ్చిన దేవతవి.. Happy International Womens Day

ఈ ప్రపంచంలో షరతులు లేని ప్రేమ, ఆప్యాయతలను పంచుతున్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

నువ్వే నా జీవితం, స్ఫూర్తి, బలం, ఆనందం, నువ్వు లేకుండా నేను లేను.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

నా జీవితానికి కొత్త అర్థాన్ని అందించిన అందమైన శిల్పివి నువ్వు.., ఈరోజు నేను ఈ స్థితికి రావడానికి కారణం నువ్వే... Happy Womens Day 2024

నేను కోరుకున్న అన్ని గుణాలు కలిగిన అమ్మాయి నువ్వు.. నా జీవితానికి ఒక అందమైన అర్థాన్ని అందించావ్, నా ప్రతి అడుగుకు నీవే స్ఫూర్తి... సూర్యుడిలా నా జీవితాన్ని వెలిగించే దీపం నువ్వే.. నా రాణికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

నీ వ్యక్తిత్వమే నీకు ఆభరణం. నా జీవితంలో మీలాంటి అమ్మాయిని కలిగి ఉన్నందుకు సంతోషంగా ఉన్నాను.. నేను నిన్ను పొందడం నా అదృష్టం., మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

నా ప్రపంచం చాలా అందంగా ఉంది.. నా కష్టాల్లో, సుఖాల్లో పాలుపంచుకునేది నువ్వు.. నా జీవితానికి నీవే స్ఫూర్తి. Happy Womens Day

తల్లిగా, భార్యగా, సోదరిగా.. ఇలా నువ్వు చేసే సేవలకు ఈ భూలోకంలో ఏదీ సాటిరాదు.. హ్యాపీ ఉమెన్స్ డే

Whats_app_banner