Ladies Domination: రిలేషన్‌షిప్‌లో చక్రం తిప్పుతున్న మహిళలు.. కాలంతో పాటు మగాళ్ల డామినేషన్ మాయమైపోతుందా!-women spinning the wheel in relationships male domination disappearing over time ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ladies Domination: రిలేషన్‌షిప్‌లో చక్రం తిప్పుతున్న మహిళలు.. కాలంతో పాటు మగాళ్ల డామినేషన్ మాయమైపోతుందా!

Ladies Domination: రిలేషన్‌షిప్‌లో చక్రం తిప్పుతున్న మహిళలు.. కాలంతో పాటు మగాళ్ల డామినేషన్ మాయమైపోతుందా!

Ramya Sri Marka HT Telugu

Ladies Domination: రిలేషన్‌షిప్‌లో మహిళల హవా పెరిగిపోయింది. పెళ్లి బంధమైనా, ప్రేమలోనైనా మహిళల ఛాయీస్‌కే ప్రియారిటీ ఉంటుందట. మగాళ్ల డామినేషన్‌తో నడిచే రిలేషన్స్ నుంచి మహిళలదే పైచేయిగా మారిపోయిన బంధాల వెనుక అసలు కారణమేంటి? ఈ మార్పుకు దారితీసిన అంశాలిలా ఉన్నాయి.

రిలేషన్లో లేడీస్ డామినేషన్ పెరిగిపోవడానికి కారణమేంటి?

గతంలో వివాహం, ప్రేమ వంటి విషయాల్లో పూర్తిగా మగాళ్ల డామినేషన్ కనిపించేది. ప్రేమ కథల్లోనూ, దాంపత్య జీవితాల్లోనూ ఎక్కడ చూసినా భర్త లేదా ప్రియుడు చెప్పిందే నడిచేది. ఇప్పుడు రిలేషన్స్‌లో పద్ధతి మారింది. పురుషుడు గొప్పవాడు అనే ఫీలింగ్ నుంచి ఆడాళ్లు చెప్పిన మాటే నడిచే విధంగా మారిపోయింది.

ఈ రోజుల్లో మహిళలు ఆర్థిక స్వేచ్ఛను పొందుతున్నారు. కెరీర్‌లో కూడా చాలా వరకూ విజయాలు అందుకుంటున్నారు. ఆత్మవిశ్వాసం కూడా పెరగడంతో రిలేషన్‌షిప్‌ను బాధ్యతాయుతంగా నడిపిస్తున్నారు. కొన్ని పురుష సమాజాల అభిప్రాయం ప్రకారం.. మహిళల కంట్రోల్‌లోనే బంధాలు నడుస్తున్నాయని చెబుతున్నారు. మరి, రిలేషన్‌షిప్‌లో స్త్రీ ఆధిపత్యానికి దారితీసిన అంశాలు ఏంటో ఒకసారి చూసేద్దామా..

ఆర్థిక స్వాతంత్య్రం, తగ్గిన డిపెండెన్సీ

గతంలో అమ్మాయిలు ఆర్థిక స్థిరత్వం కోసం మగాళ్లపైనే ఆధారపడాల్సి ఉండేది. ఇప్పుడు మహిళలు తమంతట తాముగా ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఉన్నత విద్య, విజయవంతమైన కెరీర్లు, వ్యక్తిగత పెట్టుబడులకు అవకాశాలు సంపాదించుకుంటున్నారు. కొందరు మహిళల్లో అయితే మగాడు అవసరం లేకుండా ఒంటరిగా జీవించగలమనే అభిప్రాయానికి కూడా వచ్చేస్తున్నారు. ముందుతరాలు అనుభవించిన షరతులు, ఫైనాన్షియల్ కంట్రోలింగ్ తమ జీవితాల్లో ఉండకూడదని కోరుకుంటున్నారు.

సంబంధాల్లో అధిక అంచనాలు

ప్రస్తుతం అమ్మాయిలు ఆర్థికంగా సాధికారత కలిగిన వ్యక్తి కోసం చూడటం లేదు. ఎందుకంటే వారు కూడా పనిచేస్తూ.. ఆర్థిక సాధికారత కలిగి ఉంటున్నారు. అందుకే స్వతహాగా ఆలోచించుకుని భావోద్వేగపరంగా తెలివైన, ప్రతిష్టాత్మకమైన సంబంధాలలో అనుకూలమైన వ్యక్తిని ఇష్టపడుతున్నారు. సాంప్రదాయ పాత్ర పోషించే పురుషుల కంటే వ్యక్తిగత ప్రమాణాలను చేరుకునే భాగస్వామిని కనుగొనడంలో మహిళలు ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు.

అప్‌డేట్ అవుతున్న టెక్నాలజీ

పెద్దలు కుదిర్చిన వివాహానికి గతంలో ఒక పురుషుడు, స్త్రీని చూడటానికి వెళ్ళే సంప్రదాయం ఉండేది. ఒకవేళ అది లవ్ ప్రపోజల్ అయితే అది కూడా మొదట ఉండేది పురుషుడే. శృంగార సంబంధాన్ని కొనసాగించడానికి పురుషుడే ముందుకు వచ్చేవాడు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. టిండర్, బంబుల్, హింజ్ వంటి డేటింగ్ యాప్‌లు అమ్మాయిలకు స్వేచ్ఛను కల్పించాయి. వారికి ఏది నచ్చినా సరే, తన అభిరుచికి తగ్గ అబ్బాయిని ఎంచుకోవచ్చు. ఇలాంటి యాప్స్ ద్వారా అమ్మాయిలు తమకు ఇష్టమైన ఛాయీస్‌ను ఎంచుకోవచ్చు.

ఎమోషనల్ అండ్ సోషల్ పవర్

వాస్తవానికి పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఎమోషనల్ కంట్రోలింగ్ పవర్ కలిగి ఉంటారు. పురుషుడికి బదులుగా మహిళలు డామినేటింగ్ చేస్తున్నట్లయితే సంబంధంలో విబేధాలకు అవకాశం తక్కువ. ఎమోషనల్ కంట్రోలింగ్ పవర్లో సమర్థవంతమైన కమ్యూనికేషన్, సానుభూతి, అర్థం చేసుకోవడం వంటి నైపుణ్యాలు ఉంటాయి. వీటన్నింటిలో అమ్మాయిలు ఏ మాత్రం తీసిపోవడం లేదు. పైగా రిలేషన్ లో డామినేషన్ కు వీటిని బాగా వినియోగించుకుంటున్నారు.

లేడీస్ ఎక్స్‌పెక్టేషన్స్

ఆధునిక డేటింగ్‌లో అత్యంత వివాదాస్పదమైన అంశాల్లో ఒకటి రిలేషన్‌షిప్ ఎక్స్‌పెక్టేషన్స్. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే పురుషుడి కంటే మానసికంగా దగ్గరగా ఉండే వ్యక్తిని కనుగొనడం మంచిదని సమాజం కూడా భావిస్తుంది. స్త్రీలు తమ అంచనాలు అందుకోలేని వ్యక్తులు జీవితాల్లోకి రాకూడదనే కోరుకుంటున్నారు.

కొంతమంది పురుషుల్లో పెరుగుతున్న కోపం

ఇటీవల అమ్మాయిల ప్రవర్తన, డేటింగ్ ప్రపంచంలో అమ్మాయిల నియంత్రణ వంటి విషయాలు పురుషుల్లో ఆగ్రహానికి దారితీస్తున్నాయి. చివరికి అది నిరాశగా మిగిలిపోయిన సందర్భాలు కూడా తారసపడుతున్నాయి. మహిళలకు అవాస్తవిక అంచనాలు ఉన్నాయని ఫిర్యాదు చేసే పురుషులు కూడా ఉన్నారు. అమ్మాయిలు ప్రతి విషయంలోనూ పరిపూర్ణమైన భాగస్వామి కోసం వెతుకుతున్నారనే ఫిర్యాదులు ఎక్కువైపోతున్నాయి.

ఏది తప్పు, ఏది కరెక్ట్?

నియంత్రణ కంటే సమతుల్యత కోసం ప్రయత్నించడం ద్వారా సంబంధాలను హెల్తీగా ఉంచుకోవచ్చు. డామినేషన్ చూపించడంలో భాగస్వామ్యం లోపిస్తుందట. పరస్పర గౌరవం, పరిస్థితులపై అవగాహన, భాగస్వామ్య బాధ్యతలు నెరవేర్చడం వంటివి సంబంధాన్ని మరింత పెరిగేలా చేస్తాయి. ఒక పురుషుడు లేదా స్త్రీ తన భాగస్వామిపై నియంత్రణ కలిగి ఉండటం సరికాదనే పలువురి అభిప్రాయం.

స్త్రీపురుషులిద్దరూ ఒకరి అభిప్రాయానికి మరొకరు విలువ ఇవ్వాలి. భావోద్వేగ, ఆర్థిక లేదా సామాజిక విలువలను గౌరవించాలి.

సంబంధాలకు బ్రేకప్ చెప్పేది ఎక్కువగా అమ్మాయిలే..

బ్రేకప్ లేదా విడాకులకు అమ్మాయిలే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి.దాదాపు 70 శాతం కేసుల్లో మొదట విడాకులకు ఫైల్ చేసేది మహిళలేనని అధ్యయనాలు చెబుతున్నాయి. అసంతృప్తి, సంతోషం లేకపోవడం, విలువ లేకపోవడం వంటి కారణాలతో మహిళలు ఆ సంబంధాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం