పీరియడ్స్ సమయంలో మహిళలకు ఎక్కువసార్లు మలవిసర్జన ఎందుకు అవుతుంది? డాక్టర్ చెప్పిన 3 కారణాలు-women poop more during periods doctor shares 3 reasons behind it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పీరియడ్స్ సమయంలో మహిళలకు ఎక్కువసార్లు మలవిసర్జన ఎందుకు అవుతుంది? డాక్టర్ చెప్పిన 3 కారణాలు

పీరియడ్స్ సమయంలో మహిళలకు ఎక్కువసార్లు మలవిసర్జన ఎందుకు అవుతుంది? డాక్టర్ చెప్పిన 3 కారణాలు

HT Telugu Desk HT Telugu

పీరియడ్స్ సమయంలో మహిళలకు ఎక్కువసార్లు మలవిసర్జన ఎందుకు అవుతుంది? డాక్టర్ చెప్పిన 3 కారణాలు ఇక్కడ తెలుసుకోండి.

పీరియడ్స్ లో మలవిసర్జన ఎక్కువ సార్లు చేయాల్సి వస్తుందంటున్నారు డాక్టర్ (Freepik)

యూకేకు చెందిన ఎన్‌హెచ్‌ఎస్ సర్జన్ డాక్టర్ కరణ్ రాజన్ ఒక మహిళ అడిగిన ప్రశ్నకు జూన్ 2న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో స్పందించారు. "నాకు పీరియడ్స్ సమయంలో ఎందుకు ఎక్కువసార్లు మలవిసర్జన అవుతుంది?" అని ప్రశ్నించిన కంటెంట్ క్రియేటర్ నాద్యా ఒకామోటోకు బదులిస్తూ, ఋతు చక్రం (పీరియడ్స్) సమయంలో మహిళలు తరచుగా మల విసర్జనలో మార్పులను ఎలా అనుభవిస్తారో ఆయన వివరించారు.

మూడు ప్రధాన కారణాలు వివరించిన డాక్టర్

1. శరీరానికి నీటిని పీల్చుకోవడం కష్టం

డాక్టర్ రాజన్ వీడియోలో మాట్లాడుతూ, "చాలా మంచి ప్రశ్న. పీరియడ్స్ సమయంలో మీకు మలవిసర్జన ఎక్కువగా అవ్వడానికి వాస్తవానికి 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏమిటంటే.. పీరియడ్ హార్మోన్లు మీ శరీరం నీటిని పీల్చుకోవడాన్ని కష్టతరం చేస్తాయి. కాబట్టి, మలం పల్చగా, మెత్తగా అయ్యే అవకాశాలు, విరేచనాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి" అని వివరించారు.

2. ప్రొస్టాగ్లాండిన్స్ ప్రేగులపై ప్రభావం చూపగలవు

"రెండవ కారణం ప్రొస్టాగ్లాండిన్స్ (Prostaglandins). ఇప్పుడు ఒక తెల్లటి, మెత్తటి వస్తువు మీ గర్భాశయం అని ఊహించుకోండి. విడుదలయ్యే ప్రొస్టాగ్లాండిన్స్ గర్భాశయాన్ని తీవ్రంగా మెలితిప్పేలా, సంకోచింపజేసేలా చేస్తాయి. ఇది ఒక చిన్న హెడ్‌లాక్ చేస్తున్నట్లుగా ఉంటుంది. అది నొప్పిని కలిగిస్తుంది. ఇప్పుడు ప్రొస్టాగ్లాండిన్స్ ప్రేగులు వంటి సమీప అవయవాలపై కూడా ఇదే విధమైన తీవ్రమైన సంకోచాన్ని కలిగిస్తాయి. కాబట్టి, మీ ప్రేగులు పిండేస్తున్నట్లనిపించినప్పుడు మీరు మలవిసర్జన చేయాల్సి వస్తుంది..." అని వివరించారు.

3. ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్‌లో మార్పులు

"మీకు ఋతు చక్రం ఉన్నప్పుడు హార్మోన్ల హెచ్చుతగ్గులు ఉంటాయి. వాస్తవానికి, జీర్ణనాళం (GI tract) ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్‌లోని ఆ మార్పులకు చాలా సున్నితంగా ఉంటుంది. కొన్నిసార్లు ఇది ప్రక్రియను వేగవంతం చేస్తుంది. కొన్నిసార్లు ప్రక్రియను నెమ్మదిస్తుంది. కాబట్టి మీరు మీ రుతు చక్రంలో ఎక్కడ ఉన్నారనే దానిపై ఆధారపడి విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు రావొచ్చు..’ అని మూడో కారణాన్ని వివరించారు.

(పాఠకులకు గమనిక: ఈ కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. వైద్యపరమైన పరిస్థితి గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.