Weight Loss: ఒక్క మార్పుతో వేగంగా బరువు తగ్గానన్న మహిళ.. ఏం చేశారో చెబుతూ పోస్ట్-women lost 8 kgs in 4 months she lost weight after one change and share tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weight Loss: ఒక్క మార్పుతో వేగంగా బరువు తగ్గానన్న మహిళ.. ఏం చేశారో చెబుతూ పోస్ట్

Weight Loss: ఒక్క మార్పుతో వేగంగా బరువు తగ్గానన్న మహిళ.. ఏం చేశారో చెబుతూ పోస్ట్

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 29, 2024 12:30 PM IST

Weight Loss: తన వెయిట్ లాస్ జర్నీ ఓ మహిళ ఇన్‍స్టాగ్రామ్‍లో పంచుకున్నారు. తన డైట్‍లో ఓ మార్పు చేశాక వేగంగా బరువు తగ్గానని వెల్లడించారు. అలాగే తాను పాటించిన టిప్స్ కూడా షేర్ చేసుకున్నారు.

Weight Loss: ఒక్క మార్పుతో వేగంగా బరువు తగ్గానన్న మహిళ.. ఏం చేశారో చెబుతూ పోస్ట్
Weight Loss: ఒక్క మార్పుతో వేగంగా బరువు తగ్గానన్న మహిళ.. ఏం చేశారో చెబుతూ పోస్ట్

వెయిల్ లాస్ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‍గా కొనసాగుతూనే ఉంది. బరువు తగ్గిన కొందరు తమ అనుభవాలు, డైట్, టిప్స్ షేర్ చేసుకుంటూనే ఉన్నారు. అమెరికాకు చెందిన ఎరీకా జెన్నింగ్స్ తాజాగా ఇన్‍స్టాగ్రామ్‍లో తన వెయిట్ లాస్ జర్నీ గురించి వెల్లడించారు. డైట్‍లో చేసిన ఓ మార్పు వల్ల తాను వేగంగా బరువు తగ్గానని చెప్పారు. ఆ వివరాలు ఇవే..

ఆ మార్పు ఏంటంటే?

తాను నాలుగు నెలల్లో 18 పౌండ్ల (సుమారు 8.1 కేజీలు) బరువు తగ్గానని ఎరికా వెల్లడించారు. తాను డైట్‍లో ఓ మార్పు చేయడం వల్ల వేగంగా వెయిట్ లాస్ అయ్యానని చెప్పారు. శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ కంట్రోల్‍లో ఉండేలా ఆహారం తీసుకోవడం నేర్చుకున్నానని, ఈ మార్పు వల్లే వేగంగా బరువు తగ్గానని తెలిపారు. “ఓ ఒక్క విషయం: ఫ్యాట్‍ను నిల్వ చేసే హార్మోన్‍గా పేరు ఉన్న ఇన్సులిన్ కంట్రోల్ అయ్యేలా తినడం నేర్చుకున్నా” అని రాసుకొచ్చారు.

తాను బ్లడ్ షుగర్ స్థాయిపై ఎక్కువగా ఫోకస్ చెప్పానని చెప్పారు. “4 నెలల్లో 18 పౌండ్లు తగ్గే ప్రయాణంలో.. నేను ఎక్కువగా నా బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటే ఇన్సులిన్ హార్మోన్‍పై ఎక్కువగా దృష్టి పెట్టాను. దీనిపై ఫోకస్ పెట్టడం వల్ల నా గ్లూకోజ్ లెవెల్స్ పెరగలేదు. తీపి పదార్థాలు తినాలనే కోరిక తగ్గిపోయింది. గ్లూకోజ్ పెరగకుండా కొన్ని మార్పులు నాకు బాగా సహకరించాయ. శరీరంలో గ్లూకోజ్ ఎక్కువ అసవరం లేదు” అని ఎరికా జెన్నింగ్స్ పోస్ట్ చేశారు.

ఎరికా పాటించిన ఐదు టిప్స్

శరీరంలో గ్లూకోజ్ పెరగకుండా పాటించిన 5 పద్దతులను ఎరికా జెన్నింగ్స్ వెల్లడించారు.

  • బ్యాలెన్స్డ్ షుగర్ ఆహారం తినడం.
  • భోజనం చేసిన తర్వాత సుమారు 30 నిమిషాల పాటు నడవడం.
  • భోజనం సమయంలో ముందుగా కూరగాయలు తిని, ఆ తర్వాత మిగిలిన పదార్థాలు తీసుకోవడం.
  • ఎక్కువగా తినే ముందు గ్లాస్ నీటిలో 2 టేబుల్ స్పూన్‍ల యాపిల్ సిడెర్ వెనగర్ కలుపుకొని తాగడం.
  • ఎనర్జీ ఎక్కువగా ఉంచుకుంటూ, షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు రోజంతా తనకు సులువుగా అనిపిస్తుందని ఎరిక్ రాసుకొచ్చారు.

బరువు పెరిగితే రక్తంలో చక్కెర స్థాయి, జీవక్రియపై ఎక్కువ ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. బరువు పెరగడం వల్ల శరీరంలో ఇన్సులిన్‍కు ఇబ్బందిగా మారుతుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం ప్రమాదకరంగా ఉంటుంది.

గమనిక: బరువు తగ్గాలనుకున్న వారు వారి శరీర, ఆరోగ్య పరిస్థితులను బట్టి డైట్, వర్కౌట్స్ ప్లాన్ చేసుకోవాలి. ఒక్కొక్కరి స్థితిగతులు, ఫిట్‍నెస్ గోల్స్ విభిన్నంగా ఉండొచ్చు. అందుకే వెయిట్ లాస్ డైట్ ప్లాన్ చేసుకునేటప్పుడు అవసరమైతే సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోవాలి.

Whats_app_banner