Weight Loss: 18 కేజీల బరువు తగ్గిన అమ్మాయి.. ఆమె ఫాలో అయిన 4 ఫార్ములాలు ఇవే-women lost 18 kgs she revealed 4 step formula for sustainable weigh loss ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weight Loss: 18 కేజీల బరువు తగ్గిన అమ్మాయి.. ఆమె ఫాలో అయిన 4 ఫార్ములాలు ఇవే

Weight Loss: 18 కేజీల బరువు తగ్గిన అమ్మాయి.. ఆమె ఫాలో అయిన 4 ఫార్ములాలు ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 23, 2024 12:30 PM IST

Weight Loss: ఓ మహిళ నాలుగు స్టెప్‍ల ఫార్ములాలను పాటిస్తే బరువు తగ్గారు. 18 కేజీల పాటు వెయిట్ లాస్ అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. తాను నిర్దేశించుకున్న ఫార్ములాలను పంచుకున్నారు.

Weight Loss: 18 కేజీల బరువు తగ్గిన అమ్మాయి.. ఆమె ఫాలో అయిన 4 ఫార్ములాలు ఇవే
Weight Loss: 18 కేజీల బరువు తగ్గిన అమ్మాయి.. ఆమె ఫాలో అయిన 4 ఫార్ములాలు ఇవే

శరీర బరువు తగ్గేందుకు కొందరు ప్రత్యేకమైన ప్లానింగ్ చేసుకుంటారు. వారికి తగ్గట్టుగా ప్రణాళిక రచించుకొని ఫాలో అవుతుంటారు. ఇలా బరువు తగ్గిన కొందరు సోషల్ మీడియాలో తమ వెయిట్ లాస్ జర్నీని వెల్లడిస్తుంటారు. తాజాగా.. మ్యాడీ సే అనే మహిళ తాను బరువు తగ్గిన విషయాన్ని ఇన్‍స్టాగ్రామ్‍లో పంచుకున్నారు. 11 నెలల్లో 18 కేజీల బరువు తగ్గానని తెలిపారు. ఇందుకోసం తాను పాటించిన 4 స్పెప్‍ల ఫార్ములాను కూడా రివీల్ చేశారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

ఈ వ్యాయామాలు

జీవక్రియ మెరుగయ్యేందుకు, కండలు పెరిగిందుకు తాను కంబైన్డ్ స్ట్రెంథ్ ట్రైనింగ్, కార్డియో వర్కౌట్స్ చేశానని మ్యాడీ వెల్లడించారు. ఈ రకం వ్యాయామాలు చేయడం వల్ల క్యాలరీలు బర్న్ అవడంతో పాటు పూర్తిస్థాయి ఫిట్‍నెస్ వస్తుందని తెలిపారు. క్రమంగా బరువు తగ్గేందుకు ఈ ఎక్సర్‌సైజ్‍లు చాలా ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు.

2-3 లీటర్ల నీరు

బరువు తగ్గాలంటే ప్రతీ రోజూ 2 లీటర్ల నుంచి 3 లీటర్ల మధ్య నీరు తాగడం ముఖ్యమని మ్యాడీ తెలిపారు. హైట్రేటెడ్‍గా ఉండడం వల్ల చాలా లాభాలు ఉంటాయన్నారు. సరిపడా నీరు తాగడం వల్ల ఆకలి తగ్గడం, శక్తి పెరగడం, శరీరంలోని వ్యర్థాలు బయటికి వెళ్లడం, జీర్ణక్రియ మెరుగ్గా ఉండడం లాంటి ప్రయోజనాలు ఉంటాయి.

డైట్ కోసం 80/20 రూల్

వెయిట్ లాస్ జర్నీలో ఆహారం తీసుకునేందుకు 80/20 డైట్ రూల్‍తో పాటించారు మ్యాడీ. అంటే ఆహారంలో 80 శాతం శరీరానికి పుష్కలంగా పోషకాలు అందించేవి ఉంటాయి. మరో 20 శాతం ఇష్టమైన, సాధారణ ఫుడ్స్ ఉంటాయి. ఇలా బ్యాలెన్స్డ్ డైట్ పాటించడం వల్ల శారీరక, మానసిక సంతృప్తి ఉంటుందని తెలిపారు. అందుకే తన వెయిట్ లాస్ జర్నీ సంతోషకరంగా సాగిందని తెలిపారు. బరువు తగ్గాలనుకునే వారు ప్రోటీన్, ఫైబర్ సహా కీలకమైన విటమిన్లు, మినరల్స్ ఉన్న పోషకాహాలు తీసుకోవాలి.

10 రోజులకు ఓసారి ఫొటోలు

తాను ప్రతీ 10 రోజులకు ఒకసారి ఫొటోలు తీసుకునేదాన్ని అని మ్యాడీ తెలిపారు. శరీరంలో ఎంత మారిందనే విషయాన్ని పరిశీలించేందుకు, విశ్లేషించుకునేందుకు ఇలా చేశానని వెల్లడించారు. తరచూ వేయింగ్ స్కేల్ కంటే బరువులో మార్పును తాను ఇలానే చూసుకున్నానని తెలిపారు. తన శరీరం షేప్ మారుతున్న కొద్దీ తనకు బరువు తగ్గేందుకు మరింత స్ఫూర్తి పెరిగిందని అన్నారు. బరువు తగ్గాలనుకునే వారు ఓపికగా, నిలకడగా ప్రయత్నించాలని సూచించారు.

గమనిక: బరువు తగ్గాలనుకునే వారు వారి శరీర పరిస్థితి, ఆరోగ్యం, ఇష్టాలను, ఫిట్‍నెస్ గోల్‍ను బట్టి ప్లాన్ చేసుకోవాలి. అందరి పరిస్థితులు ఒకేలా ఉండవు. వెయిట్ లాస్ కోసం ప్లాన్ చేసే ముందు కావాలంటే ఫిట్‍నెస్ నిపుణుల సలహా తీసుకోవచ్చు.

Whats_app_banner