శీతాకాలంలో ఫెరాన్ ధరిస్తే మహిళలు ట్రెండీగా కనిపిస్తారు, ఈ కశ్మీరీ డ్రెస్ గురించి తెలుసుకోండి
చలికాలంలో ఫ్యాషన్ ఫాలో అవ్వాలనుకుంటే కాశ్మీరీ డ్రెస్ ఫెరాన్ ధరించండి. ఇది చలిని అడ్డుకోవడంతో పాటు, మీరు స్టైలిష్ గా కనిపించేలా చేస్తుంది. ఫెరాన్ ఎలా ధరిస్తే మీరు ట్రెండీగా కనిపిస్తారో తెలుసుకోండి.
శీతాకాలంలో ఫ్యాషన్ డ్రెస్ లు వేసుకోవడం కష్టం. స్లీవ్ లెస్ వంటివి వేస్తే చలి విపరీతంగా వేసేస్తుంది. పెళ్లిళ్లు వంటివి రాత్రి పూట ఎక్కువగా జరుగుతాయి. ఎలాంటి వేడుకలైనా సాయంత్రం పూట జరుగుతూ ఉంటాయి. ఆ వేడుకలకు ట్రెండీగా కనిపించాలంటే వెస్ట్రన్ వేర్ వేసుకోలేరు. అలాగని చీర కట్టుకుని వెళ్లినా చలి వేస్తుంది. అందుకే సరికొత్తగా ఫెరాన్ వేసుకోవడానికి ప్రయత్నించండి.
ఫెరాన్ డ్రెస్ నిండుగా ఉంటుంది. ఇది చలిని నివారించడంతో పాటు, అమ్మాయిలు స్టైలిష్ గా కనిపించేలా చేస్తుంది. ముఖ్యంగా ఇవి సంప్రదాయ దుస్తుల్లా కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిలో, మీరు వివాహ సీజన్లో కాశ్మీరీ ఫెరాన్ ధరించవచ్చు. ఇది చలి నుండి మిమ్మల్ని రక్షించడమే కాకుండా అందంగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో కశ్మీరీ ఫెరాన్ ట్రెండ్ నడుస్తోంది. దీనిలో మీరు ఆకర్షణీయమైన, ట్రెండీ లుక్ ను పొందవచ్చు.
ఫెరాన్ అనేది స్త్రీ, పురుషులు ఇద్దరికీ లభిస్తుంది. దీనిని ఉన్ని నుండి తయారు చేస్తారు. ఇది చాలా వదులుగా ఉంటుంది. మందంగా ఉండడంతో పాటూ కింద మరో లేయర్ తో ఉంటుంది. కాబట్టి ఇది వేసుకుంటే చలి త్వరగా వేయదు. ఈ రోజు ఫ్యాషన్ లో ఉన్నితో పాటు వెల్వెట్ వంటి వస్త్రాలను కూడా తయారు చేస్తున్నారు. మీకు ఫెరాన్ చాలా నచ్చడం ఖాయం.
మీరు ఫెరాన్ ను మీకు నచ్చిన ప్యాంటుతో జత చేయవచ్చు. ఇది టైట్ ప్యాంట్ తో ఇది పర్ఫెక్ట్ లుక్ ఇస్తుంది.
పాలాజ్జోతో జత చేసినా కూడా ఫెరాన్ అందంగా కనిపిస్తుంది. పాలాజ్జో ప్యాంట్ ఫెరాన్ తో మెరిసిపోతూ కనిపించడం ఖాయం. మీకు హెవీ లుక్ కావాలంటే, మ్యాచింగ్ ఎంబ్రాయిడరీ బాటమ్ ను సిద్ధంగా ఉంచుకోండి. ఇది వేసుకుంటే వివాహంలో అందంగా కనిపిస్తారు.
ఫెరాన్ ను చుడీదార్ లేదా లెగ్గింగ్స్ తో కూడా ధరించవచ్చు. ఈ విధంగా తేలికపాటి డిజైన్ ఫెరాన్ ను వేసుకుంటే క్యాజువల్ లుక్ లో కనిపిస్తారు.
అందమైన ఫెరాన్ తో పీప్ టూ హీల్స్ వెడ్డింగ్ లుక్ లో పర్ఫెక్ట్ గా కనిపిస్తాయి. సాధారణ లుక్ కోసం, మీరు సాదా లేదా ఎంబ్రాయిడరీ బూట్లను ప్రయత్నించవచ్చు.
మీరు ఫెరాన్ ధరిస్తుంటే , దాని పైన చున్నీలు వంటివి ఏవి పడితే అది వేయద్దు. ఫెరాన్ పై శాలువాలను వేసుకుంటే అందంగా కనిపిస్తారు. మందపాటి దుపట్టాలు కూడా వేయవచ్చు. ఫెరాన్లు ముదురు రంగులోనే కనిపిస్తాయి. కాబట్టి ఇవి ఎవరికైనా నప్పుతాయి. పైగా వీటితో వేసుకోవడం వల్ల మీరు ఆధునిక అమ్మాయిలా ట్రెండీగా కనిపిస్తారు.
టాపిక్