వేసవి దాహం తీర్చుకోవడానికి, చర్మాన్ని కాపాడుకోవడానికి మీరు ఎన్నో రకాల డ్రింక్ లు తాగుతుంటారు. వాటితో పాటు మీ డైట్లో గులాబీ పూలతో చేసిన షర్బత్(Rose Sharbat) లేదా గులాబీ పూలతో చేసిన టీ(Rose Tea) లను కూడా చేర్చుకోండి. భారతదేశపు సంప్రదాయ పానీయాల్లో ఒకటైన ఈ గులాబీ పువ్వు పానీయాలు ఎండ వేడిని తట్టుకునేలా చేస్తాయి. శరీరం హైడ్రేటెడ్ గా ఉండేందుకు సహాయపడుతాయి.
అంతేకాదు.. మహిళలను ఎంతగానో ఇబ్బంది పెట్టే పీరియడ్స్ సమస్యలను, అధిక బరువును తగ్గిస్తుంది. పీరియడ్స్ సమయంలో రోజ్ షర్బత్ తాగడం అలవాటు చేసుకున్నారంటే ఆ టైంలో వచ్చే నొప్పుల నుంచి చక్కటి ఉపశమనం పొందుతారు. బరువు తగ్గడం కోసం డైట్ చేస్తున్నవాళ్ల తమ డైట్ రోటీన్లో రోజ్ షర్బత్ లేదా రోజ్ టీని చేర్చుకుంటే బరువు తగ్గడం సులభంగా మారుతుంది. గులాబీ పూల టీ లేదా గులాబీ పూల శరబత్ లను తాగడం వల్ల కలిగే మరిన్న ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రండి..
వేసవిలో శరీరంలో నీరు తగ్గిపోతుంది. అందుకే ఏదో ఒక రకంగా నీరు తాగడం చాలా అవసరం. ఒక కప్పు గులాబీ రోజ్ షర్బత్ లేదా రోజ్ టీ మీ నీటి వినియోగాన్ని పెంచుతుంది. డీహైడ్రేషన్ సమస్యను తగ్గించడంతో పాటు బరువు తగ్గడాన్ని కూడా సులభతరం చేస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. గులాబీ పూలతో చేసిన ఈ పానీయాల్లో పాలీఫినాల్స్ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడంతో పాటు కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం గులాబీ టీలో ఫినాల్ కంటెంట్, యాంటీఆక్సిడెంట్ల మొత్తం గ్రీన్ టీకి సమానమని, కొన్నిసార్లు అంత కన్నా ఎక్కువ లాభదాయకంగా పని చేస్తాయి.
చాలా మంది మహిళలకు పీరియడ్స్ నొప్పులు బాధాకరంగా ఉంటాయి. ఈ సమయంలో ఎక్కువ మంది ఆడవారు తలనొప్పి, వెన్నునొప్పి, వాంతులు, విరేచనాలు, బలహీనతతో ఇబ్బంది పడతారు. చైనీస్ ఔషధ నిపుణులు గులాబీ మొగ్గలతో చేసిన టీ లేదా షర్బత్ నెలసరి నొప్పుల నుండి ఉపశమనం కలిగించడానికి ఉపయోగిస్తారు. ఓ అధ్యయనం ప్రకారం పీరియడ్స్ ప్రారంభానికి ఒక వారం ముందు నుండి తర్వాత వరకు తాగడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి నుండి చాలా ఉపశమనం లభిస్తుంది.
గులాబీ రేకులతో చేసిన టీ లేదా షర్బత్ రు క్రమం తప్పకుండా తాగడం వల్ల ఒత్తిడి సులభంగా జయించగలుగుతారు. మనసును ప్రశాంతంగా ఉంచడానికి గులాబీ పానీయాలు చాలా బాగా సహాయపడుతాయి.
గులాబీ టీ, షర్బత్ లను తాగడం వల్ల శరీరంలో వచ్చే ఒత్తిడి తగ్గుతుంది. దాని ప్రభావం గుండె ఆరోగ్యంపై సానుకూలంగా ఉంటుంది. గులాబీ టీని రోజూ తాగడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
గులాబీ టీ, షర్బత్ లను రోజూ తాగితే మానసిక ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒత్తిడిని తగ్గించడంతో పాటు మానసిక స్థితిని మెరుగుపరచడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది. డిమెన్షియా, మూర్ఛ ప్రమాదాలు తగ్గుతాయి.
ఆయుర్వేదం ప్రకారం.. గులాబీ పూలు పిత్తం శాంతపరచేందుకు చాలా బాగా పని చేస్తాయి. రోజ్ షర్బత్, రోజ్ టీలను తాగడం వల్ల తగ్గుతుంది. దీనివల్ల శరీరంలో వచ్చే వేడి, అసౌకర్యం, అసిడిటీ తగ్గుతుంది. అలాగే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వేసవిలో పిత్తం పెరగడం వల్ల శరీరం వేడెక్కుతుంది కాబట్టి రెండు నెలలూ గులాబీ టీ, షర్బత్‌లను రోజూ తాగండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం