మహిళల్లో కొన్ని ఆరోగ్య సమస్యలు వయస్సుతో పాటు పెరిగి ఇబ్బంది పెడుతుంటాయి. మెనోపాజ్, హార్మోన్ల అసమతుల్యత, ఎముకల బలహీనత వంటివి అందులో ప్రధానంగా నిలుస్తాయి. చిన్న వయస్సులోనే PCOS (పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) పెరగడం కూడా ఇందుకు కారణం. ఈ సమస్యలతో బాధపడే మహిళలు దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, మునుపటి ఉత్సాహంతో జీవితాన్ని గడపాలనుకుంటే మీ ఆహారంలో ఈ 3 రకాల గింజలను చేర్చుకోవాలి. ఇవి మీ శరీరానికి అవసరమైన చాలా పోషకాలను అందించడంతో పాటు ప్రయోజనం చేకూరుస్తాయి.
అందరికీ అందుబాటులో ఉండే తెల్ల నువ్వులు పోషకాలకు నిధి. ఇందులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల ఇవి ఎముకలను బలపరచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఇవి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగై రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. చర్మాన్ని కూడా ప్రకాశంగా మార్చి ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. అన్ని వయసుల మహిళలు తెల్ల నువ్వులను తినడం వల్ల ప్రయోజనం పొందుతారు. ముఖ్యంగా తెల్ల నువ్వులు తినడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
మహిళల విషయంలో ఈ విత్తనాలు బహుళ ప్రయోజనాకారకులు. రక్తహీనత తగ్గించడం, రోగ నిరోధక శక్తి పెంచడం, బరువు తగ్గించడం వంటి విషయాల్లో అలీవ్ సీడ్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ సమస్యలతో బాధపడే మహిళలు హలీమ్ లేదా అలీవ్ గింజలను తప్పనిసరిగా తినాలి. ఇనుము, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండటంతో పాటు, హలీమ్ గింజలు యాంటీఆక్సిడెంట్లతో కూడా సమృద్ధిగా కలిగి ఉంటాయి. వీటిల్లో ఉండే ఔషద గుణాలు పీరియడ్స్ సమయంలో వచ్చే సమస్యలను అధిగమించేందుకు కూడా సహాయపడతాయి. ప్రతి వంద గ్రాముల హలీమ్ విత్తనాల్లో 40.37 గ్రాముల ఫైబర్, 22.4 గ్రాముల ప్రోటీన్స్ లభిస్తాయి. అంతేకాకుండా పొటాషియం, ఫాస్పరస్, నియాసిన్, కొవ్వు, పిండి పదార్ధాలు కూడా అధిక పరిమాణంలో ఉంటాయి.
చియా గింజలు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్లతో నిండి ఉంటాయి. ఈ సూపర్‌ఫుడ్‌ను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. హార్మోన్లను సమతుల్యం చేయడంతో పాటు, రోజంతా శక్తి కోసం చియా గింజలను తినడం మంచిది. అన్ని వయసుల మహిళలకు శక్తిని అందించి, పోషకాల లోపాన్ని సరి చేస్తాయి. ఇందులో ఉండే కాల్షియం నేరుగా ఎముకలను బలంగా ఉంచడానికి ఉపయోగపడతాయి.
బహుళ ప్రయోజనాలను అందించే ఈ మూడు రకాలైన విత్తనాలను సూపర్ ఫుడ్స్ గా పరిగణిస్తారు. ఇవి తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యత, ఎముకల పటిష్టత కోసమే కాకుండా మహిళలను చాలా విషయాల్లో ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి, 30 దాటిన ప్రతి ఒక్కరూ ఈ గింజలను క్రమం తప్పకుండా తమ ఆహారంలో చేర్చుకోవాలి. కేవలం కూరల్లోనే కాకుండా సలాడ్లలోనూ వీటిని వినియోగించుకోవచ్చు.
సంబంధిత కథనం