Women: 30 ఏళ్ల తర్వాత మహిళలు ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారా? త్వరగా వృద్ధాప్య ఛాయలు వచ్చే రిస్క్-women do not eat these foods too much after 30 years due to early aging risk ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Women: 30 ఏళ్ల తర్వాత మహిళలు ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారా? త్వరగా వృద్ధాప్య ఛాయలు వచ్చే రిస్క్

Women: 30 ఏళ్ల తర్వాత మహిళలు ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారా? త్వరగా వృద్ధాప్య ఛాయలు వచ్చే రిస్క్

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 12, 2024 08:30 PM IST

Women: మహిళలు 30 ఏళ్ల తర్వాత ఆహారం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల త్వరగానే వృద్ధాప్య ఛాయలు వస్తాయి. చర్మం దెబ్బతింటుంది.

Women: 30 ఏళ్ల తర్వాత మహిళలు ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారా? త్వరగా వృద్ధాప్య ఛాయలు వచ్చే రిస్క్
Women: 30 ఏళ్ల తర్వాత మహిళలు ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారా? త్వరగా వృద్ధాప్య ఛాయలు వచ్చే రిస్క్

30 ఏళ్ల వయసు దాటిన తర్వాత మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అందుకు తగ్గట్టుగా జీవన శైలిని మార్చుకోవాలి. ఆ వయసు తర్వాత ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వయసుతో పాటు వచ్చే మార్పులు మహిళల ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపడమే అందుకు కారణం. 30 ఏళ్ల తర్వాత డయాబెటిస్, బ్లడ్ ప్రెజర్, కీళ్ల నొప్పులు, క్యాన్సర్లు సహా చాలా వ్యాధులు వచ్చే రిస్క్ పెరుగుతుంది. చర్మంపై కూడా ప్రభావం పడుతుంది.

అందుకే 30 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య, చర్మ సమస్యలు ఎదురవటంతో పాటు వృద్ధాప్య ఛాయలు త్వరగా వచ్చే రిస్క్ ఉంటుంది. 30 ఏళ్ల తర్వాత మహిళలు ఎక్కువగా తినకూడడని ఫుడ్స్ ఏవంటే..

స్వీమపోబోట్స్ ఎక్కువగా వద్దు

తీపి పదార్థాలు ఎక్కువగా తినడం ఎవరికైనా మంచిది కాదు. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన మహిళల స్వీట్స్ ఎక్కువగా తీసుకుంటే మరింత ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారిలో జీవక్రియ తగ్గిపోయి ఉంటుంది. స్వీట్స్ ఎక్కువగా తింటే ఊబకాయం, డయాబెటిస్, కొలెస్ట్రాల్ పెరగడం, గుండె వ్యాధులు వచ్చే రిస్క్ పెరుగుతుంది. అతిగా స్వీట్స్ తింటే చర్మంపై మొటిమలు, ముడతలు, మచ్చలు కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది. దీంతో చర్మంపై వృద్ధాప్య ఛాయలు తొందరగా వచ్చే రిస్క్ ఎక్కువ.

ఫ్రైడ్ ఫుడ్స్

30 సంవత్సరాల వయసు దాటాక మహిళలు ఎక్కువగా నూనెలో వేయించిన ఫ్రైడ్ ఫుడ్స్ తినకూడదు. వీలైనంత వరకు ఇంట్లో తక్కువ నూనెతో చేసిన ఆహారాలు తినేందుకు ప్రాధ్యానత ఇవ్వాలి. నూనెల పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల డయాబెటిస్ బారిన పడే ప్రమాదం కూడా అధికం అవుతుంది. గుండెకు కూడా ప్రతికూలంగానే ఉంటుంది. చర్మ సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే ఫ్రైడ్ ఆహారాలను, జంక్ ఫుడ్‍లను వీలైనంత తక్కువగా తీసుకుంటేనే మేలు.

ఉప్పు ఎక్కువగా వద్దు

ఆహారాల్లో ఉప్పు ఎక్కువగా తినడం ఏ వయసు వారికైనా మంచిది కాదు. ముఖ్యంగా 30 ఏళ్లు మళ్లిన మహిళలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఉప్పు ఎక్కువగా తీసుకోకూడదు. ఉప్పు మోతాదు కంటే ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే రిస్క్ అధికం అవుతుంది. బ్లడ్ ప్రెజర్, కీళ్ల నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఆహారాల్లో సరిపడా మాత్రమే ఉప్పు తీసుకోవాలి. తక్కువైనా సరే కానీ ఎక్కువ కాకుండా జాగ్రత్త పడాలి.

కాఫీ, టీలు మితంగా..

30 ఏళ్ల వయసు దాటిన మహిళలు.. కఫీన్ ఉండే కాఫీలు, టీలు ఎక్కువగా సేవించకూడదు. కఫీన్ ఎక్కువైతే హర్మోన్ల అసమతుల్యత ఎదురవొచ్చు. వీటి వల్ల ఆందోళన, హైపర్‌టెన్షన్, ఏకాగ్రతలోపం, డిప్రెషన్ లాంటి సమస్యలు తలెత్తే రిస్క్ పెరుగుతుంది. కఫీన్ ఎక్కువగా తీసుకుంటే చర్మంపై వృద్ధాప్య ఛాయలు ఎక్కువవుతాయి. ముడతలు, చారలు తక్కువ వయసులోనే రావొచ్చు.

రిఫైన్డ్ కార్బొహైడ్రేట్లు తక్కువగా..

30 సంవత్సరాల వయసు తర్వాత మహిళలు రిఫైన్డ్ కార్బొహైడ్రేట్లు ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోకూడదు. వైట్ బ్రెడ్, పాస్తా, నూడిల్స్, వైట్ రైస్ లాంటివి తీసుకోవడాన్ని తగ్గించుకోవాలి. కూరగాయలు, పండ్లు, నట్స్ లాంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు అధికం అవుతాయి. జీవక్రియ నెమ్మదిస్తుంది. చర్మంపై కూడా దుష్ప్రభావం పడుతుంది.

Whats_app_banner