Women Tips : మహిళలకు శృంగారం చేసే ఆసక్తి లేకపోతే ఏం చేస్తారు?-women behaviour like this when they are not interested in intercourse ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Women Behaviour Like This When They Are Not Interested In Intercourse

Women Tips : మహిళలకు శృంగారం చేసే ఆసక్తి లేకపోతే ఏం చేస్తారు?

HT Telugu Desk HT Telugu
Nov 18, 2023 07:20 PM IST

Women Tips : కొన్నిసార్లు శృంగారం చేయాలని ఉన్నా.. భాగస్వామికి ఆసక్తిగా ఉండదు. అలా మహిళలు కొన్ని రకాలుగా తమకు ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తారు. వద్దు అనుకుంటే ఎంత చెప్పినా వినరు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

వైవాహిక జీవితంలో సెక్స్ ఒక ముఖ్యమైన భాగం. భార్యాభర్తలు ఒకరికోసం ఒకరు జీవించాలి. సాధారణంగా పెళ్లయిన మహిళలు తమ భర్తల నుంచి ప్రేమను, ఆప్యాయతలను ఆశిస్తారు. రాత్రి మాత్రమే దగ్గరకు వచ్చే భర్తను ఏ భార్యా ఇష్టపడదు. సెక్స్ చేసినా వారికి ఎలాంటి ఫీలింగ్ ఉండదు. 35, 40 ఏళ్లు నిండిన వివాహితుల్లో చాలా మందికి సెక్స్‌పై కోరిక తగ్గుతుంది. దీనికి చాలా కారణాలున్నాయి. ఇష్టం లేని భార్యలు ఏం చేస్తారో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు

ఏదో ఒక సాకుతో ప్రతిరోజూ శృంగారాన్ని వాయిదా వేస్తూనే ఉంటారు. తలనొప్పి, కడుపునొప్పి వంటి కారణాలు చెబుతూనే ఉంటారు. నిద్ర, అలసట, పని ఉందని తప్పించుకుంటారు. సెక్స్ చేసిన తర్వాత జననాంగాలు నొప్పిగానూ, చికాకుగానూ ఉంటాయని కొన్ని కారణాలు చెబుతారు. వద్దు అని బాహాటంగా చెప్పకుండా ప్రతి రోజూ అయిష్టంగా గడిపేస్తుంటారు. ఏదో ఒక సమయంలో శృంగారం చేయక భర్తల ఆగ్రహానికి గురవుతారు.

భార్యపై ప్రేమ, ఆప్యాయతలు ఉండే భర్తకు కూడా తమ భార్యలకు సెక్స్ పట్ల ఆసక్తి లేదని తెలియగానే కోపం వస్తుంది. భర్తలు కోరుకున్నది లభించనప్పుడు, దూకుడుగా ఉంటారు. ఈ కారణంగా, మీ భర్తలు మిమ్మల్ని ద్వేషిస్తారు. మిమ్మల్ని ప్రేమించరు. ఆ తర్వాత మరో మార్గంలో సంబంధాన్ని కోరుకుంటారు.

పురుషుల కంటే మహిళలు సెక్స్‌ను ఎక్కువగా ఆస్వాదిస్తారు. పురుషులకు స్కలన జరిగితే చాలు.. కానీ స్త్రీలకు అప్పుడే మెుదలవుతుంది. వారికి ఇంకా ఎక్కువ కావాలి అనిపిస్తుంది. పెళ్లయ్యాక నిర్ణీత వయస్సు తర్వాత స్త్రీలు సంభోగానికి ఎందుకు దూరంగా ఉంటారో భర్తలు ముందుగా తెలుసుకోవాలి.

ఆ తర్వాత దాన్ని పరిష్కరించడానికి దశలను అనుసరించాలి. అనవసరమైన తగాదాలు, వివాదాలు, సందేహాలు సృష్టించకూడదు. భర్తలు ప్రేమతో ఉంటే.. భార్య కచ్చితంగా శృంగారాని ఒప్పుకుంటుంది. కొన్నిసార్లు వారికి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి. అన్నిసార్లు కావాలి అంటే కుదరదు కదా.. వారిని ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి. అప్పుడే మీరు భర్యపై ఎంత ప్రేమ చూపిస్తున్నారో అర్థమవుతుంది.

శృంగారం ఆసక్తి లేని మహిళలు ఎక్కువగా హాల్‍లోకి వచ్చేస్తారు. లేదంటే వంటగదిలోకి వెళ్తారు. భర్త పక్కన పడుకోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. భర్త ఎంత దగ్గరకు వచ్చినా అలసటగా ఉన్నట్టుగా ఉంటారు. మాట్లాడేందుకు ప్రయత్నించినా పెద్దగా రెస్పాండ్ అవ్వరు. అందుకే భర్తలు సరిగా భార్యలను చూసుకుంటే ఈ సమస్యలు రావు.

ఈ విధంగా అయినప్పుడు మెుదట మీరు మాట్లాడి చూడండి. తర్వాత నిపుణులను సంప్రదించండి. వారి నుంచి సలహాలు తీసుకోండి. మీ సమస్య గురించి మీ భాగస్వామితో తప్పకుండా మాట్లాడాలి. తద్వారా వారు అర్థం చేసుకుంటారు. మీకు సహాయం చేస్తారు. దీన్ని ఎలా నివారించాలో తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించాలి. ధ్యానం, యోగా వంటి వ్యాయామాలలో పాల్గొనండి.

WhatsApp channel