Chanakya Niti Telugu : ఈ విషయాల్లో పురుషుల కంటే స్త్రీలు ముందు ఉంటారు
Chanakya Niti On Men and Woman : చాణక్య నీతిలో స్త్రీ పురుషుల గురించి చాణక్యుడు గొప్పగా చెప్పాడు. చాణక్యుడు చెప్పిన వివరాల ప్రకారం స్త్రీలు కొన్ని విషయాల్లో పురుషులకంటే తెలివైనవారు.
ఆచార్య చాణక్యుడు తెలివైన రాజకీయవేత్త, మేధావి, ఆర్థికవేత్త. ఆయన చెప్పిన నైతిక పాఠాలు నేటికీ మన జీవితాలకు వర్తిస్తాయి. చాణక్యుడు చెప్పిన సూత్రాలను నేటికీ పాటించేవరా ఉన్నారు. చాణక్య నీతిని ఫాలో అయితే జీవితంలో అనేక అంశాల్లో విజయం సాధించవచ్చు. ఆయన నిర్దేశించిన బాటలో పయనించే వారు తప్పకుండా విజయ శిఖరాలను అధిరోహిస్తారు.
అది ఎవరికైనా వర్తిస్తుంది. గతంలో స్త్రీలు దోపిడీకి గురయ్యేవారు. ఇటీవలి కాలంలో మహిళలు అంతరిక్షంలోకి సైతం అడుగుపెడుతున్నారు. నిజానికి చాలా విషయాల్లో పురుషులకంటే స్త్రీలు ముందు ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం. కానీ స్త్రీకి కొన్ని విషయాల్లో పూర్తి స్వేచ్ఛ లభించిందని చెప్పలేం. ఆచార్య చాణక్యుడు ప్రకారం నాలుగు అంశాలలో స్త్రీలు ఎల్లప్పుడూ పురుషుల కంటే ముందుంటారు. అవి ఏంటో చూద్దాం..
స్త్రీలు తెలివైనవారు
చాణక్యుడి ప్రకారం స్త్రీలు పురుషుల కంటే తెలివైనవారు. మహిళల ఈ జ్ఞానం కష్ట సమయాల్లో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఇంట్లో ఆర్థిక సమస్య ఉండవచ్చు. లేదా కుటుంబ సంబంధిత సమస్యలు ఉండవచ్చు. మహిళలు వాటిని సులభంగా పరిష్కరించగలరు. వారికి ఎలాంటి సమయంలో ఎలా రియాక్ట్ కావాలో పురుషులకంటే బాగా తెలుసు. కుటంబాన్ని కష్టాల నుంచి ఈజీగా బయటపడేయగల శక్తి స్త్రీకి ఉందని చాణక్య నీతి చెబుతుంది. అందుకే వారిని తక్కువ అంచనా వేయకూడదు.
చాలా ధైర్యవంతులు
స్త్రీల కంటే పురుషులకు ధైర్యం ఎక్కువ అని అందరూ అనుకుంటారు. కానీ చాణక్య నీతి ప్రకారం పురుషుల కంటే మహిళలకు ఆరు రెట్లు ఎక్కువ ధైర్యం ఉంది. ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వారికి ఉంటుంది. కానీ కొన్ని పనుల విషయంలో పురుషుల కంటే మహిళల పనితీరు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. కానీ ధైర్యం విషయానికి వస్తే, మహిళలు ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉంటారు. వంద మంది పురుషులు ఉన్న చోట నుంచి ఒక్క స్త్రీ ధైర్యంగా వెళ్తుంది. కానీ వంద మంది స్త్రీలు ఉన్న చోట నుంచి పురుషుడు వెళ్లాలంటే ధైర్యం సరిపోదు.
ఎక్కువ ఆకలితో ఉంటారు
చాణక్యుడి ప్రకారం పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఆకలితో ఉంటారు. స్త్రీలు పురుషుల కంటే ఎక్కువగా తింటారు. కారణం వారి శరీర నిర్మాణమే. పురుషులతో పోలిస్తే మహిళలకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వారికి పెద్ద మొత్తంలో కేలరీలు అవసరమవుతాయి. అందువల్ల, వారికి ఆకలి కూడా ఎక్కువ. కాబట్టి మహిళలు ఎక్కువగా తినాలి. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుంది. అప్పుడే అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి.
సున్నితత్వం ఎక్కువే
స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ సున్నితత్వం కలిగి ఉంటారు. వారు ఏదైనా ఆలోచనను త్వరగా గ్రహిస్తారు. వారి బాధ కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంది. ఇంకా స్త్రీల శరీరాలు కూడా చాలా సున్నితంగా ఉంటాయి. చిన్న బాధను కూడా పెద్దదిగా ఫీలవుతారు. చాణక్యుడు ప్రకారం, స్త్రీలు పురుషుల కంటే ఎనిమిది రెట్లు సున్నితంగా ఉంటారు. అలా అని ఆ సమయంలోనూ వారు తీసుకునే నిర్ణయాలు గొప్పగానే ఉంటాయి. చాలా విషయాల్లో పురుషుల కంటే స్త్రీలు ముందు వరుసలో ఉంటారు.