Aging Slow Tips: మహిళల్లో వయస్సు కంటే పెద్దవాళ్లు లేదా ముసలి వాళ్లుగా కనిపించడానికి చేస్తున్న తప్పులేంటి? ఎలా బయటపడాలి?-women age quickly due to these habits what are they and how can they get rid of them ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Aging Slow Tips: మహిళల్లో వయస్సు కంటే పెద్దవాళ్లు లేదా ముసలి వాళ్లుగా కనిపించడానికి చేస్తున్న తప్పులేంటి? ఎలా బయటపడాలి?

Aging Slow Tips: మహిళల్లో వయస్సు కంటే పెద్దవాళ్లు లేదా ముసలి వాళ్లుగా కనిపించడానికి చేస్తున్న తప్పులేంటి? ఎలా బయటపడాలి?

Ramya Sri Marka HT Telugu
Published Feb 08, 2025 06:30 PM IST

మహిళలూ మీరు 5 పొరబాట్లు చేస్తున్నారా..? అయితే మీకు వయస్సు కంటే ముందుగానే వృద్ధాప్యం వచ్చేస్తుంది. అసలు వయస్సు కంటే చిన్నవారిలా కనిపించాలనుకునే తపన ఉన్న మీరు, త్వరలోనే వృద్ధులుగా కనపడతాారు. ఆ 5 తప్పులేంటో తెలుసుకుందామా?

మహిళల్లో వయస్సు కంటే పెద్దవాళ్లు లేదా ముసలి వాళ్లుగా కనిపించడానికి చేస్తున్న తప్పులేంటి
మహిళల్లో వయస్సు కంటే పెద్దవాళ్లు లేదా ముసలి వాళ్లుగా కనిపించడానికి చేస్తున్న తప్పులేంటి (shutterstock)

మనం చాలా సార్లు మహిళలు ఉన్న వయస్సు కంటే ఎక్కువ వయస్సు వారిలా కనిపించడం గమనిస్తుంటాం. అనేక రకాల వ్యాధులు వారి చర్మం తీరుని మార్చేసి ముడతలు కలిగేలా చేస్తుంది. ఫలితంగా చిన్న వయస్సులో ఉండగానే ఆంటీ అని పిలింపించుకుంటారు. అలా మహిళలకు వయసుకు ముందే వృద్ధాప్యం రాకుండా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, ఈ అలవాట్లను వెంటనే వదిలేయాలి.

వ్యాయామం చేయకపోవడం

చాలా మంది మహిళల్లో కామన్‌గా తాము రోజంతా నిలబడి పనిచేస్తాం. కాబట్టి, ఎటువంటి వ్యాయామం అవసరం లేదని అనుకుంటారు. కానీ, వ్యాయామం అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. గంటల కొద్దీ నిలబడి ఉండే వారు, కూర్చుని మీ కాళ్ళను బలపరుచుకునే వ్యాయామం చేయాలని తెలుసుకోండి. దీనివల్ల వృద్ధాప్యంలో వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. గుండె ఆరోగ్యానికి కూడా వ్యాయామం చాలా ముఖ్యం.

ఎల్లప్పుడూ ఆందోళన చెందడం

మహిళలు తరచుగా భవిష్యత్తు గురించి, ఇతరుల ఆలోచనల గురించి లేదా ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. ఒత్తిడి, ఉద్రేకం, ఆందోళన శరీరంలో కార్టిసోల్ స్థాయిని పెంచుతాయి. ఫలితంగా అనేక వ్యాధులు కలిగేందుకు కారణమవుతాయి. కాబట్టి ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందకుండా, సాధ్యమైనంత వరకూ ప్రశాంతంగా ఉండటానికే ప్రయత్నించండి. ఆందోళన చెందే అలవాట్లను వదిలేయండి.

అధిక కోపం

కోపం, చిరాకు ఎల్లప్పుడూ ఉంటే, మీరు కోపాన్ని నియంత్రించుకోవడం అవసరం. ఇది మీ మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండింటికీ హాని కలిగిస్తుంది. ప్రతికూల భావోద్వేగాలు మీ చర్మం, జుట్టుపై ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల మీరు వయసుకు ముందే ముసలివారైపోతారు.

తక్కువ నీరు త్రాగడం

ఇంటి పనుల్లో మునిగిపోయి చాలా మంది మహిళలు తమను తాము పట్టించుకోరు. అవసరమైన మేర కూడా నీరు తాగకుండా ప్రమాదాల బారిన పడతారు. చాలా తక్కువ నీరు తాగడం వల్ల మెనోపాజ్ లేదా ప్రసవం తర్వాత మూత్రాశయం బలహీనపడుతుంది. మూత్రం లీక్ అయ్యే సమస్య మొదలవుతుంది. దీనివల్ల మహిళలు నీరు త్రాగడం తగ్గిస్తారు. దీనివల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి. కాబట్టి ముందు నీరు తాగాలనే విషయాన్ని వాయిదా వేసుకోకండి.

తక్కువ నిద్ర

ఇంటి పనుల వల్ల నిద్రకు ఇవ్వాల్సిన దానికంటే తక్కువ సమయం కేటాంచుకోకండి. నిద్రకు ప్రాధాన్యత తగ్గితే, గుండెపోటు ప్రమాదాన్ని పెరుగుతుంది. మీరు నిద్రిస్తున్నప్పుడు, శరీరం తనను తాను మరమ్మత్తు చేసుకుంటుంది. ఫలితంగా వృద్ధాప్య వేగం తగ్గుతుంది. కాబట్టి వయసుకు ముందే ముసలివారు కాకూడదనుకుంటే, సరిపోయేంత సమయం పాటు నిద్రకు కేటాయించడం ఉత్తమం.

కండరాలు బలపడేందుకు కొద్దిపాటి వ్యాయామాలు, ప్రశాంతమైన నిద్ర కోసం యోగా లాంటి ప్రక్రియలు, హైడ్రేటెడ్‌గా ఉండేందుకు ఎక్కువ నీరు తాగడం, శరీర మరమ్మతు కోసం సరిపడ నిద్ర, కోపం అదుపులో ఉంచుకోవడానికి ధ్యానం లాంటివి చేస్తుండాలి. ఈ విషయాల పట్ల జాగ్రత్త తీసుకుంటే, వయస్సు కంటే ముందే వృద్ధాప్యం రాకుండా కాపాడుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం