బరువు పెరిగే ముందు శరీరంలోని కొవ్వును తగ్గించడం, అలాగే ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడ్‌తో పొట్ట కండరాలపై దృష్టి పెట్టడం ఎంత ముఖ్యమో చెబుతూ లియానా అనే యువతి తన ఫిట్‌నెస్ ప్రయాణాన్ని వివరించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా 'ఫిట్జియెలిఫ్ట్స్'లో తన వెయిట్ లాస్ జర్నీ నమోదు చేస్తున్న లియానా, జూన్ 24న పోస్ట్ చేసిన ఒక వీడియోలో తన పొట్టను ఎలా టోన్ చేశారో వివరించారు.
ఆమె తన పోస్ట్‌కు 'బరువులు ఎత్తడం మీ పొట్ట ఆకారాన్ని ఎలా మారుస్తుందో చూడండి' అని క్యాప్షన్ ఇచ్చారు. 2022లో జిమ్‌కు వెళ్లడం ప్రారంభించినప్పటి నుండి ప్రస్తుత అద్భుతమైన 'అబ్స్' (పొట్ట కండరాలు) వరకు ఆమె ప్రయాణాన్ని చూపించారు.
"నా పొట్ట ఆకారాన్ని నేను ఎలా మార్చుకున్నాను? నా జన్యుపరమైన కారణాల వల్ల (genetics) ఎక్కువగా కొవ్వు పేరుకుపోవడంతో నేను ఎప్పుడూ నా పొట్టతో ఇబ్బంది పడ్డాను. నా మొదటి కేలరీ లోటు (calorie deficit) తర్వాత నా పొట్ట చదునుగా మారింది. కానీ ఆకారం అలాగే ఉంది. నేను పెద్దగా ఏమీ సాధించలేదని అనిపించింది..’ అని లియానా వివరించారు.
ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు ఫిట్‌నెస్‌లో సర్టిఫికేషన్ పొంది, 3 సంవత్సరాలు జిమ్‌లో సాధన చేసిన తర్వాత చివరకు విజయవంతంగా ఈ ఫలితాన్ని సాధించిన తర్వాత తన సలహాలను లియానా పంచుకున్నారు.
‘ముందుగా మీ ఒంట్లో కొవ్వు శాతాన్ని (body fat percentage) తగ్గించుకోవాలి. అది 10 శాతం ఉండాల్సిన అవసరం లేదు. కానీ శరీరాన్ని బల్కింగ్ చేసుకోవడానికి సిద్ధమయ్యే ముందు వీలైనంత వరకు కొవ్వును తగ్గించుకోండి. ఇలా చేయడం వల్ల బల్కింగ్ దశలో మరీ ఎక్కువ కొవ్వు పేరుకుపోదు.’ అని లియానా చెప్పారు. bulking అంటే కండర ద్రవ్యరాశిని (muscle mass) పెంచుకోవాలనే లక్ష్యంతో, మీ శరీరం కాల్చే (burn చేసే) దానికంటే ఎక్కువ కేలరీలను (calories) తీసుకోవడం, తీవ్రమైన వెయిట్ ట్రైనింగ్ (weight training) చేయడం.
"'బల్కింగ్ దశ'లో మీ పొట్ట కండరాలపై దృష్టి పెట్టండి. క్రమంగా బరువులు పెంచుతూ (progressive overload) వ్యాయామం చేయండి. నా ఆబ్ రొటీన్‌ను నేను ఎప్పుడూ పంచుకుంటూ ఉంటాను. తక్కువ సమయంలో మంచి ఫలితాలు ఇచ్చేది ఇదే అని నా నమ్మకం. మిగతా పద్ధతులు అంత ప్రభావవంతంగా లేవు" అని లియానా వివరించారు.
"మీరు సాధించిన ఫలితాలు కనిపించడానికి కేలరీల లోటును (calorie deficit) సృష్టించుకోవాలి. ఇదంతా తెలుసుకోవడానికి, నా పొట్ట కండరాలపై దృష్టి పెట్టడానికి నాకు మూడేళ్లు పట్టింది. కానీ నేను చేసిన తప్పులు మీరు చేయకపోతే, సంవత్సరం లోపే మంచి ఫలితాలు సాధించవచ్చు" అని లియానా చెప్పారు. calorie deficit అంటే మీరు తినే ఆహారం ద్వారా తీసుకునే కేలరీల కంటే, మీ శరీరం ఉపయోగించే లేదా బర్న్ చేసే కేలరీలు ఎక్కువగా ఉండటం.
"నిజం చెప్పాలంటే, మొదటి రెండేళ్లు నేను దాదాపు అన్నీ తప్పుగానే చేశాను. కానీ ఆ తప్పులు, ప్రయత్నాల నుండే నేను ఈ ఫలితాన్ని సాధించగలిగాను. కాబట్టి నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. అంతే. చెప్పడానికి సులభం, కానీ చేయడానికి కష్టం." అని లియాన చెప్పారు.
(పాఠకులకు గమనిక: ఈ వ్యాసం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా వైద్య పరిస్థితి గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే ఎల్లప్పుడూ మీ డాక్టర్ సలహా తీసుకోవాలి.)