Weight Loss: నెలలో 4కేజీల బరువు తగ్గిన మహిళ.. ఏం చేయాలో చెప్పిన అమ్మాయి
Weight Loss: బరువు తగ్గేందుకు ఎలాంటి అలవాట్లు అలవరచుకోవాలో ఓ మహిళ వెల్లడించారు. తాను నెలలో 4 కేజీలు తగ్గానని తెలిపారు. ఇన్‍స్టాగ్రామ్‍లో వీడియో పోస్ట్ చేశారు. వెయిట్ లాస్ కోసం సూచనలు చేశారు.
బరువు తగ్గాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామాలు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. బరువు తగ్గేందుకు ఈ అలవాట్లను అలవరుచుకోవాలి. నిలకడగా కొనసాగించడం అనేది చాలా ముఖ్యం. ఇలా అలవాట్లను పద్ధతిగా పాటించి నెలలోనే నాలుగు కేజీల బరువు తగ్గారు బుల్‍బుల్ థక్కర్ అనే మహిళ. ఈ విషయాన్ని ఇన్‍స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. వెయిట్ లాస్ కోసం 6 విషయాలను పంచుకున్నారు.
బరువు తగ్గేందుకు తాను పాటించిన అలవాట్లను థక్కర్ వెల్లడించారు. అలాగే, సూచనలను చేశారు. అలవాట్లను ఎలా అలవరుచుకోవాలో.. వీడియో ద్వారా వెల్లడించారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
అన్నీ ఒకేసారి వద్దు
బరువు తగ్గాలని నిర్ణయించుకున్నప్పుడు అన్నీ ఒకేసారి మొదలుపెడితే శరీరం అంగీకరించకపోవచ్చని థక్కర్ చెప్పారు. “అన్నీ ఒకేసారి చేయవద్దు. దీని వల్ల శరీరం షాక్‍గా ఫీల్ అవుతుంది. ప్రతీ వారం ఒక్కో అలవాటు మొదలుపెట్టండి” అని తెలిపారు. అది కొత్త డైట్ అయినా, వ్యాయామాలు అయినా అందుకు తగ్గట్టుగా అడ్జస్ట్ అయ్యేందుకు శరీరానికి సమయం అవసరమని చెప్పారు. అందుకే అలవాట్లను క్రమంగా వారానికి ఒకటి తీసుకొని కొనసాగించాలని అన్నారు.
వర్కౌట్ ప్లాన్
వర్కౌట్లు చేసేందుకు ఓ పక్కా ప్లాన్ రూపొందించుకోవడం ముఖ్యమని థక్కర్ వెల్లడించారు. ఆ ప్లాన్‍కే కట్టుబడి కొనసాగాలని తెలిపారు. దీనివల్ల శరీరానికి ఆ పద్ధతి అలవాటై.. ఫిట్‍నెస్ పెరుగుతుందని వెల్లడించారు.
క్యాలరీల లెక్క తప్పనిసరి
బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నప్పుడు.. ఆహారం ద్వారా ప్రతీ రోజు ఎన్ని క్యాలరీలు తీసుకుంటున్నామని లెక్కేసుకోవడం చాలా ముఖ్యమని థక్కర్ వెల్లడించారు. క్యాలరీలు ఎక్కువగా తీసుకోకుండా ఉండేలా జాగ్రత్త పడేందుకు లెక్క వేసుకోవడం అలవాటు చేసుకోవాలని చెప్పారు. ఇందుకోసం క్యాలరీ కాలుక్యులేటర్ యాప్స్ వాడాలని సూచించారు. దీనివల్ల ఎక్కువగా తినకుండా అలవాటు అవుతుందని తెలిపారు.
ప్రోటీన్, క్యాలరీ బడ్జెట్
రోజులో ఎన్ని క్యాలరీలు తీసుకోవానే విషయంలో కఠినంగా ఉండాలని థక్కర్ సూచించారు. ఆ క్యాలరీ బడ్జెట్‍కు కట్టుబడేలా ఆహారపు అలవాటు చేసుకోవాలని అన్నారు. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలన డైట్‍లో తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. బరువు తగ్గాలంటే శరీరానికి సరిపోయే ప్రోటీన్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలని తెలిపారు.
ఆకలి కట్టడికి నీరు తాగడం
బరువు తగ్గేందుకు డైట్ పాటిస్తున్నప్పుడు ఆకలి కావడం సహజం. అయితే, ఆకలి అయినప్పుడు అదనంగా ఆహారం తీసుకుండా నీరు తాగాలని థక్కర్ సూచించారు. నీరు తీసుకోవడం ద్వారా ఆకలిని కట్టడి చేయాలన్నారు. ఇలా చేయడం వల్ల హైడ్రేటెడ్‍గా ఉండటంతో పాటు క్యాలరీల లోపం సృష్టించుకోవచ్చని తెలిపారు. తగినంత నీరు తాగడం ముఖ్యమని చెప్పారు.
30 నిమిషాల కార్డియో
30 నిమిషాల కార్డియో ఎక్సర్‌సైజ్‍లు చేయడం గేమ్ ఛేంజర్ అని థక్కర్ చెప్పారు. బరువు తగ్గేందుకు 30 నిమిషాల కార్డియో చాలా ప్రభావవంతంగా ఉంటుందని తెలిపారు.
బరువు తగ్గాలనుకునే వారు వారి శరీర, ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్లాన్ చేసుకోవాలి. వాటి అనుగుణంగా డైట్, వర్కౌట్స్ చేయాలి. అవసరమైతే సంబంధిత ఫిట్‍నెస్ నిపుణులను సంప్రదించవచ్చు.