New Year Wishes 2025: మీ ప్రియమైన అన్నా తమ్ముళ్లకు తెలుగులో విషెస్ ఇలా చెప్పేయండి
New Year Wishes 2025: పాత ఏడాది 2024 ముగిసింది. కొత్త సంవత్సరం 2025 రాబోతోంది. మీ సోదరులకు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు ఇక్కడ కొన్ని ప్రేమ పూర్వక శుభాకాంక్షలు ఉన్నాయి.
ప్రపంచంలోనే అందమైన అనుబంధం అక్కా తమ్ముడు, అన్నా చెల్లెళ్లదే. ఒకరికి కష్టమొస్తే మరొకరు తల్లడిల్లిపోతారు. ఎంత తిట్టుకున్నా, కొట్టుకున్నా కూడా వారు చివరికి ఒక్కటే అవుతారు. బయటకు కోపంగా తిట్టినట్లు నటించినా మనసులో మాత్రం కొండంత ప్రేమ ఉంటుంది. కానీ ఆ ప్రేమను వారు ఎప్పుడూ వ్యక్తపరచరు. కానీ బాధ్యతగా ఉంటారు. అక్కాతమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు ఒకరి కష్టాల్లో మరొకరు తోడుగా ఉంటారు. న్యూ ఇయర్ వచ్చేస్తోంది. ఈ సందర్భంగా మీ ఆత్మీయ అన్నలకు, తమ్ముళ్లకు ప్రేమపూర్వకంగా కొత్త ఏడాది శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు 2024 ముగిసి కొత్త సంవత్సరం రాబోతోంది. మీ సోదరులకు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి. మీ అన్నాతమ్ముళ్లకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ కొన్ని విషెస్ ఉన్నాయి.
కొత్త సంవత్సర శుభాకాంక్షలు 2025
- ఒకరినొకరు అండగా ఉందాం, ఎప్పటిలాగే కొట్టుకుంటూ తిట్టుకుందాం, మనసు నిండా ప్రేమతో కొత్త సంవత్సరాన్ని సంతోషంగా ఆహ్వానిద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ మై క్రైమ్ పార్టనర్
2. నువ్వు నా తమ్ముడివి మాత్రమే కాదు మంచి స్నేహితుడివి కూడా. నీ జీవితంలో కొత్త సంవత్సరం శాంతి, శ్రేయస్సు, ఆనందంతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్
3. నూతన సంవత్సరం నీకు ఎన్నో అవకాశాలు, సంతోషాన్ని తీసుకురావాలి. నువ్వు నేను సంతోషంగా జీవించాలి. హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్.
4. బెస్ట్ బ్రదర్ అవార్డ్ ఇవ్వాలనుకుంటే నేను నీ పేరే చెబుతాను. నువ్వు వినయంగా, స్వీట్ గా ఉంటావు. అందుకే నువ్వందరి కంటే బెస్ట్, హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్.
5. రాబోయే సంవత్సరంలో నీ జీవితం ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు మంచి ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్
6. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు అన్ని అదృష్టాలు, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ మై స్వీట్ బ్రదర్.
7. నీ లక్ష్యం వైపు ప్రయాణం చేయు బ్రదర్. నీ ఆకాంక్షలను నెరవేర్చడంలో నేను నీకు అండగా ఉంటాను. హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్.
8. నా సోదరుడితో మరో గొప్ప సంవత్సరాన్ని జీవించేందుకు సిద్ధంగా ఉన్నాను, హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్
9. నా ప్రియమైన సోదరుడికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను నీకు అండగా ఉంటాను. హ్యాపీ న్యూ ఇయర్
10. నువ్వే నా స్నేహితుడు, రక్షకుడు, మార్గదర్శి. అలాగే ఇంట్లో పెద్ద తలనొప్పి కూడా. అయినా నువ్వు నా ఫేవరేట్. హ్యాపీ న్యూఇయర్ మై లిటిల్ బ్రదర్
11. నా సోదరుడికి సంతోషకరమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు. నవ్వులు, ఆనందాలు నిండిన జీవితం మీకు ఈ ఏడాదిలో రావాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్.
12. నా చిన్న తమ్ముడికి హ్యాపీ న్యూ ఇయర్. మీ కోరికలన్నీ కొత్త సంవత్సరంలో నెరవేరాలని ప్రార్థిస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్
ఇది కూడా చదవండి: