Saddula Batukamma Wishes: సద్దుల బతుకమ్మ పండుగకు మీ బంధువులు, స్నేహితులకు ఇలా శుభాకాంక్షలు చెప్పేయండి-wish your relatives and friends on saddula bathukamma festival like this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saddula Batukamma Wishes: సద్దుల బతుకమ్మ పండుగకు మీ బంధువులు, స్నేహితులకు ఇలా శుభాకాంక్షలు చెప్పేయండి

Saddula Batukamma Wishes: సద్దుల బతుకమ్మ పండుగకు మీ బంధువులు, స్నేహితులకు ఇలా శుభాకాంక్షలు చెప్పేయండి

Haritha Chappa HT Telugu
Published Oct 10, 2024 05:30 AM IST

Saddula Batukamma Wishes: తెలంగాణ పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ. ఆ రోజు మీ బంధువులకు, స్నేహితులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పాల్సిందే. ఇక్కడిచ్చి విషెస్ ను మీ బంధుమిత్రులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేయండి.

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

పూలనే దేవతల రూపంలో కొలిచే అందమైన పండుగ బతుకమ్మ. సద్దుల బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి చిహ్నం. తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. బతుకమ్మ పండగలో చివర రోజు సద్దుల బతుకమ్మ. ఈరోజు ఊరు వాడా సంబరాల్లో తేలిపోతుంది. సద్దుల బతుకమ్మను పెద్ద బతుకమ్మ అని కూడా పిలుస్తారు.

సద్దుల బతుకమ్మ రోజు పులగం, చిత్రాన్నం, నువ్వుల సద్ది, కొబ్బరి సద్ది, పెరుగన్నం, పులిహోర ఇలా అనేక రకాలైన సద్దులను చేసి బతుకమ్మకు సమర్పిస్తారు. అందుకే ఈ పండుగను సద్దుల బతుకమ్మ అని కూడా పిలుస్తారు. బతుకమ్మను పేర్చాక చెరువు కట్టకు ఊరంతా ఊరేగింపుగా వెళతారు. ‘తంగేడు పువ్వుల చందమామ... బతుకమ్మ పోతుంది చందమామ’ అంటూ బతుకమ్మకు ఘనంగా వీడ్కోలు పలుకుతారు. ఈ సద్దుల బతుకమ్మ రోజు తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తి తమ బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇక్కడ మేము సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఇచ్చాము. వీటిని నచ్చిన వారికి మెసేజ్‌ల రూపంలో పంపించండి.

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

 

  1. తెలంగాణలో పుట్టి

పూల పల్లకి ఎక్కి

లోకమంతా తిరిగే బతుకమ్మ పండుగను

ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటూ

మీకు బతుకమ్మ శుభాకాంక్షలు

 

2. ప్రకృతిని ఆరాధించే అందమైన పండుగ బతుకమ్మ

ఈ పూల పండుగ సందర్భంగా ఆడబిడ్డలు అందరికీ శుభాకాంక్షలు

పూలను పూజించడం గొప్ప సాంప్రదాయం

అది తెలంగాణకు మాత్రమే సొంతం

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

 

3. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

బంగారు బతుకమ్మ ఉయ్యాలో

తెలంగాణ ఆడబిడ్డలకు

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

 

4. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం

తెలంగాణ ఆడబిడ్డల పూల పండుగ బతుకమ్మ

అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

 

5.  తెలంగాణ ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

 

6. ఎక్కడైనా దేవతలను పూలతో పూజిస్తారు

కానీ పూలనే దేవతలుగా పూజించే సంప్రదాయానికి

నమస్కరిస్తూ తెలంగాణ ఆడపడుచులు

అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

 

7. ఊరందరినీ ఒకే వేదిక పైకి తీసుకొచ్చే పండుగ బతుకమ్మ

తెలంగాణ ఆడపడుచులు ఎంతో సంతోషంగా

ఆనందంగా ఉండాలని కోరుకుంటూ

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

 

8. పల్లెకు ఆనందాన్ని తీసుకొచ్చే పూల పండుగ సద్దుల బతుకమ్మ

ఈ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు

సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

 

9. తెలంగాణ ఆడపిల్లల ఆత్మగౌరవాన్ని సూచించే పూలవేడుక బతుకమ్మ

ఈ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

Whats_app_banner