కష్టాల నుంచి కాపాడే హనుమంతుడు,ఈ హనుమాన్ జయంతికి మీ బంధుమిత్రులకు ఇలా శుభాకాంక్షలు చెప్పండి-wish your relatives and friends in telugu on the occasion of hanuman jayanti ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  కష్టాల నుంచి కాపాడే హనుమంతుడు,ఈ హనుమాన్ జయంతికి మీ బంధుమిత్రులకు ఇలా శుభాకాంక్షలు చెప్పండి

కష్టాల నుంచి కాపాడే హనుమంతుడు,ఈ హనుమాన్ జయంతికి మీ బంధుమిత్రులకు ఇలా శుభాకాంక్షలు చెప్పండి

Haritha Chappa HT Telugu

పరాక్రమవంతుడైన హనుమంతుడుని తలుచుకుంటే చాలు వెయ్యి ఏనుగుల బలం వచ్చేస్తుందని అంటారు. ఏ కష్టం నుంచి అయినా కాపాడే శక్తి హనుమాన్ కి ఉందని అంటారు. అందుకే ఈ హనుమాన్ జయంతి రోజు మీ బంధుమిత్రులను ఈ శుభాకాంక్షలతో పలకరించండి.

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు (Pixabay)

హనుమంతుడిని పూజిస్తే ఆ శ్రీరాముడిని పూజించిన ఫలితం దక్కుతుందని అంటారు. జైశ్రీరామ్ అన్న పదమే హనుమంతుడికి ఎంతో ఇష్టమైనది. శ్రీసీతారాములను తన గుండెల్లో నింపుకున్న హనుమంతుడు దుష్టశక్తుల నుంచి కాపాడే శక్తిని బలాన్ని ప్రసాదిస్తాడు.

దేవుళ్ళలో ఇప్పటికీ భౌతిక రూపంలో భూమిపై ఉన్న వ్యక్తిగా ఆంజనేయుడు గురించి చెబుతారు. అతడిని నిజమైన ప్రేమతో, భక్తితో స్మరిస్తే ఆ వ్యక్తి కష్టాలన్నీ తొలగిపోతాయని అంటారు. హనుమాన్ జన్మోత్సవం శుభ సందర్భంగా మీ బంధుమిత్రులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేయండి. ఇవి వారిలో ధైర్యాన్ని నింపి కష్టాలను తొలగిస్తాయి.

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుగులో

1.హనుమా నువ్వు లేకుండా

శ్రీరాముడు అసంపూర్ణం

నువ్వు నీ భక్తుల కలలను నెరవేరుస్తావు

సీతారాములకు ఇష్టమైన వ్యక్తివి నువ్వే

అలాంటి నీకు మా వందనాలు

హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు

2. జీవితంలోని సవాళ్లను, కష్టాలను

ఎదురుకోవడానికి హనుమంతుడు మీకు

బలాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను

మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

3. హనుమాన్... నువ్వే రక్షకుడివి

నువ్వే నా దేవుడివి

నువ్వు ఉండగా భయమే అవసరం లేదు

హనుమాన్ జయంతి సందర్భంగా

హృదయపూర్వక శుభాకాంక్షలు

4. వాయు పుత్రుడు హనుమంతుడు

మంగళవారం జన్మించినవాడు మంచినే చేస్తాడు

మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

5. హనుమాన్ పేరు ఉచ్చరిస్తే చాలు

దుష్టశక్తులు దగ్గరకు రావు

వ్యాధులు తొలగిపోతాయి

ఆ హనుమాన్ పేరును నిరంతరం జపించి

మీ బాధలను తొలగించుకోండి

మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

6. హనుమంతుడు మీ కష్టాలను నాశనం చేసి

మీ హృదయంలో కొలువై ఉండాలని కోరుకుంటున్నాను

హనుమాన్ జయంతి సందర్భంగా మీకు శుభాకాంక్షలు

7. క్లిష్ట పరిస్థితుల్లో హనుమంతుడి

నామాన్ని జపించండి చాలు

ప్రతి సమస్య తేలికగా మారుతుంది

మీ మనసు ఆనందంతో పొంగుతుంది

హ్యాపీ హనుమాన్ జయంతి

8. హనుమంతుడే శక్తి స్వరూపం

ఆయన పేరును పిలిస్తే చాలు..

భయం తొలగిపోతుంది

మీకు మీ కుటుంబ సభ్యులకు

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

9. ఆ హనుమంతుడి నామాన్ని జపించే వారు

జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు.

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

10. హనుమంతుడిని పూజించండి చాలు

మీ ప్రతి కష్టమూ తొలగిపోతుంది

మీ జీవితం అందంగా, ఆహ్లాదకరంగా

ఆనందంతో నిండిపోతుంది

మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

11. కష్టాల్లో ఉన్నప్పుడు హనుమంతుడిని పిలవండి చాలు

అతడు మిమ్మల్ని గమ్యస్థానానికి చేరుస్తాడు

మీ జీవితాన్ని శుభప్రదం గా ఉండేలా చూస్తాడు

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

12. హనుమంతుని పట్ల మీకున్న భక్తి.. శక్తిని ఇస్తుంది

ఆ శక్తి నీ జీవితంలో ప్రతి కష్టాల నుండి

బయటపడేలా చేస్తుంది

హనుమాన్ భక్తి ప్రతి అసాధ్యాన్ని

సుసాధ్యం చేస్తుంది

మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

13. ఆ బజరంగబలి మీ కష్టాలన్నింటినీ

నాశనం చేసి మీ జీవితంలో ఆనందాన్ని,

శ్రేయస్సును తెచ్చి ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.