Republic Day Wishes: రిపబ్లిక్ డే రోజున మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఈ దేశభక్తి కవితలతో శుభాకాంక్షలు చెప్పండి-wish your friends and family on republic day 2025 with these patriotic poems ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Republic Day Wishes: రిపబ్లిక్ డే రోజున మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఈ దేశభక్తి కవితలతో శుభాకాంక్షలు చెప్పండి

Republic Day Wishes: రిపబ్లిక్ డే రోజున మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఈ దేశభక్తి కవితలతో శుభాకాంక్షలు చెప్పండి

Ramya Sri Marka HT Telugu
Jan 25, 2025 03:30 PM IST

Happy Republic Day Wishes: రిపబ్లిక్ డే సందర్భంగా స్నేహితులు, బంధువులకు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? ఈ దేశభక్తి కవితలను వారితో పంచుకోండి. మీ దేశభక్తిని అందరికీ చాటి చెప్పండి.

రిపబ్లిక్ డే రోజున మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను ఈ దేశభక్తి కవితలతో శుభాకాంక్షలు చెప్పండి
రిపబ్లిక్ డే రోజున మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను ఈ దేశభక్తి కవితలతో శుభాకాంక్షలు చెప్పండి (shutterstock)

జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున ప్రతి భారతీయుడు తన స్నేహితులు, బంధువులు, పరిచయస్తులకు శుభాకాంక్షలతో కూడిన సందేశాన్ని పంపుతారు. ఈ సంవత్సరం 76వ రిపబ్లిక్ డే సందర్భంగా, ప్రతి ఒక్కరికీ దేశభక్తితో నిండిన ఈ అందమైన కవితలను పంపండి. వీటిని చదివిన ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది.

yearly horoscope entry point

1)దేశ వాసులారా, మనల్ని మనం మేల్కొల్పుకుందాం,

అందరికీ క్రమశిక్షణ పాఠం నేర్పుదాం,

భారతదేశాన్ని మరింత అలంకరిద్దాం,

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనమంతా ఈ వాగ్దానం చేద్దాం,

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

2) ఈరోజు మళ్ళీ మనం జెండా ఎగురవేయాలి,

ఈరోజు మనమందరం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలి.

మనమందరం కలిసి ఒక వాగ్దానం చేసుకోవాలి

ఈ దేశాన్ని మనం మరింత ముందుకు తీసుకెళ్లాలి.

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

3) దేశం పట్ల ప్రేమ, దేశం పట్ల గర్వంతో

మనస్ఫూర్తిగా గణతంత్ర దినోత్సవాన్ని ప్రారంభిద్దాం

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 2025

4) వీరుల త్యాగాల ఫలితం గణతంత్రం

స్వాతంత్య్ర కథలను స్మృతి చేసుకుందాం

వారి బాటలోనే నడిచి దేశాన్ని కాపాడుకుందాం.

Happy Republic Day

5) జెండా ఎగురవేసి జయజయ కారాలు చేద్దాం,

దేశ గౌరవం కోసం మళ్ళీ మళ్ళీ జీవిద్దాం, అవసరమైతూ చనిపోదాం,

Happy Republic Day 2025

6) గణతంత్ర దినోత్సవం నాడు మనం ప్రతిజ్ఞ చేద్దాం,

భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి,

అన్ని మార్గాల్లోనూ ముందుండి దేశాన్ని నడిపిద్దాం

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

7) గణతంత్ర దినోత్సవానికి అందరూ సిద్ధంగా ఉండండి,

భారతీయుల పండుగ వస్తోంది.

Happy Republic Day 2025

8) జెండా గౌరవాన్ని ఎక్కడా పోనివ్వము,

దేశ గౌరవాన్ని ఎక్కడా కోల్పోనివ్వము.

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

9) భారత వీర సైనికులకు నమస్కారం,

మన హీరోలు ఎవరికీ తీసిపోరు.

Happy Republic Day 2025

10) స్వాతంత్య్ర ప్రేమికులు అరుదు,

దేశానికి ఉపయోగపడని వారు వ్యర్థం,

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

11) వీరుల త్యాగాలను మనకు గుర్తు చేసేది

ప్రతి సంవత్సరం వచ్చే గణతంత్ర దినోత్సవమే

Happy Republic Day 2025

12) దేశం పట్ల ప్రేమ పెంచుకుందాం

దేశ ప్రజల పట్ల గౌరవం చూపిద్దాం

ఏదైమైనా అంతా కలిసికట్టుగా నడుద్దాం

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

13) గణతంత్ర దినోత్సవం సందర్భంగా

ప్రతి పౌరుడిలో దేశభక్తి భావన మేల్కొంటుంది

ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో మెరుస్తుంది.

Happy Republic Day 2025

14) మన దేశ జెండాను గర్వంగా ఎగురవేద్దాం,

భారతదేశం గొప్పతనాన్ని ఆశయాలతో చెబుతాం

Happy Republic Day 2025

15) జెండా ఎగురవేసినప్పుడు,

ప్రతి భారతీయుడి హృదయం గర్విస్తుంది

ఈ గణతంత్ర దినోత్సవం నాడు,

భరతమాత కుమారులు దేశభక్తి దీపాన్ని వెలిగించాలి

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 2025

Whats_app_banner