Happy Children's Day Wishes: బాలల దినోత్సవం సందర్భంగా మీ పిల్లలకు ఇలా తెలుగులో శుభాకాంక్షలు చెప్పేయండి-wish your children on childrens day 2024 in telugu here are the childrens day wishes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Happy Children's Day Wishes: బాలల దినోత్సవం సందర్భంగా మీ పిల్లలకు ఇలా తెలుగులో శుభాకాంక్షలు చెప్పేయండి

Happy Children's Day Wishes: బాలల దినోత్సవం సందర్భంగా మీ పిల్లలకు ఇలా తెలుగులో శుభాకాంక్షలు చెప్పేయండి

Haritha Chappa HT Telugu
Nov 13, 2024 03:30 PM IST

Happy Children's Day Wishes: పిల్లలు ఆరాధించే నేత జవహర్ లాల్ నెహ్రూ. అతని పుట్టినరోజు సందర్భంగా మనం బాలల దినోత్సవాన్ని నిర్వహించుకుంటాము. బాలల దినోత్సవం సందర్భంగా మీ స్నేహితులు, బంధువులకు పంపించేందుకు శుభాకాంక్షలు, కోట్‌లను ఇక్కడ అందించాము.

చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు
చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు

నవంబర్ 14న దేశమంతా పిల్లల పండుగను వేడుకగా నిర్వహించుకుంటారు. పిల్లలు ప్రేమగా చాచా నెహ్రూ అని పిలిచే మన దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం ఆ రోజే. బాల్యం విలువకు, బాల సంక్షేమానికి విలువ ఇవ్వాలని చెప్పేవారు నెహ్రూ. పిల్లలు అభివృద్ధి చెందడానికి అనువైన వాతావరణాన్ని పెద్దలే కల్పించాలని వివరించేవారు. ఈ బాలల దినోత్సవం రోజు మీ బంధువులు, స్నేహితులకు చిల్డ్రన్స్ డే విషెస్ ను పంపించేందుకు ఇక్కడ కొన్ని శుభాకాంక్షలు, మెసేజులను తెలుగులోనే అందించాము. వీటిని మెసేజుల రూపంలో, వాట్సాప్ గ్రూప్‌లో, సోషల్ మీడియాలో కాపీ చేసి పోస్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన చిల్డ్రన్స్ డే విషెస్ ను ఎంపిక చేసుకుని మీ స్నేహితులకు, బంధువులకు పంపించండి.

చిల్డ్రన్స్ డే 2024 శుభాకాంక్షలు తెలుగులో

1. పిల్లల చిరునవ్వులోని అమాయకత్వం

వారి హృదయాల్లోని స్వచ్ఛత

ప్రకాశవంతంగా అలా వెలుగుతూనే ఉండనిద్దాం

హ్యాపీ చిల్డ్రన్స్ డే

2. బాల్యం అనేది ఒక అందమైన ప్రయాణం

మర్చిపోలేని అనుభూతి

దాన్ని ప్రతిబిడ్డకు అందేలా చూద్దాం

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

3. ప్రతి చిన్నారి ఉజ్వల భవిష్యత్తు కోసం

అందరం కృషి చేద్దాం

ఈ దేశాన్ని పిల్లల కోసం

ప్రకాశవంతంగా మారుద్దాం

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

4. పిల్లలకు ఆశా, సంతోషంతో కూడిన

ప్రకాశవంతమైన భవిష్యత్తును ఇచ్చేందుకు

మనమందరం పాటుపడాల్సిందే

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

5. మన జీవితాల్లో ప్రతిరోజూ

చిరునవ్వులు, ఆనందాన్ని తెచ్చేది పిల్లలే

అలాంటి పిల్లలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు

6. ప్రపంచం పిల్లల హృదయంలాగే

స్వచ్ఛంగా, దయతో నిండా నిండి ఉండాలని కోరుకుంటూ

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

7. మనదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ

ఆనందం, విద్యా, ప్రేమకు అర్హుడు.

ఆ దిశగా అందరం కృషి చేద్దాం

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

8. పిల్లలు మీరే మా జీవితాలకు వెలుగు

మా భవిష్యత్తుకు ఆశాకిరణం

హ్యాపీ చిల్డ్రన్స్ డే

9. ప్రతి బిడ్డ ప్రేమ, నవ్వు,

అంతులేని అవకాశాలతో నిండిన

ప్రపంచంలో ఎదగాలని కోరుకుంటూ

బాలల దినోత్సవం శుభాకాంక్షలు

10. పిల్లలు తోటలో విరిసిన మొగ్గల్లాంటి వారు

ప్రతి ఒక్కరూ వారి సొంత ప్రత్యేక మార్గంలో

వికసించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు

వారిని స్వచ్చంగా వికసించేలా చేద్దాం

హ్యాపీ చిల్డ్రన్స్ డే

11. పిల్లలూ...

మీరు ప్రత్యేకమైన వారు

ప్రతిభావంతులు

పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నవారు

మీరు నిత్యం ప్రకాశిస్తూనే ఉండాలి

ఈ ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చాలి

హ్యాపీ చిల్డ్రన్స్ డే

12. పిల్లలు ఉద్యానవనంలో

విరిసిన పువ్వులాంటివారు

వారే దేశ భవిష్యత్తు

వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది

హ్యాపీ చిల్డ్రన్స్ డే

13. నేటి పిల్లలు రేపటి భారతదేశాన్ని నిర్మిస్తారు

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

Whats_app_banner