Sankranti Wishes 2025: ఈ అందమైన సందేశాలతో సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేయండి
Sankranti Wishes 2025: కొత్త ఏడాదిలో వచ్చే మొట్ట మొదటి పండగు మకర సంక్రాంతి. ఈ పండుగ చాలా ప్రత్యేకమైనది. ఈ పండుగ సందర్భంగా అందరూ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఇక్కడ మేము కొన్ని శుభాకాంక్షలు ఇచ్చాము మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోండి.
మకర సంక్రాంతి పండుగ తెలుగు వారికీ ఎంతో ప్రత్యేకమైనది. ఈ పండుగ రోజే పంట సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ ఏడాది జనవరి 13, 14 తేదీల్లో భోగీ, సంక్రాంతి పండుగలు జరగనున్నాయి. సంక్రాంతి రోజు పంటల దేవుడు సూర్యుడిని ఆరాధిస్తారు. కొత్త బట్టలు ధరించి బంధు మిత్రులతో స్వీట్లు పంచుకుని తింటారు. ఈ ప్రత్యేక పండుగరోజు మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు కూడా చెప్పాలి. అందుకే ఇక్కడ మేము సంక్రాంతి విషెస్ తెలుగులో ఇచ్చాము. మీకు నచ్చని వాటిని ఎంపిక చేసుకుని మీ స్నేహితులకు, బంధువులకు అందించండి.
సంక్రాంతి శుభాకాంక్షలు
1. సంక్రాంతి రోజున నువ్వుల లడ్డూ తినండి
గాలిపటాలు ఎగురవేయండి
ఆనందంగా గడపండి
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు
2. సూర్యుడి ప్రకాశంతో కొత్త పంటలు పరిమళాన్ని వెదజల్లుతాయి, జీవితంలో ప్రతి క్షణం వికసిస్తుంది,
మకరసంక్రాంతి మీకు ఆనందాల జాతర కావాలని
కోరుకుంటూ మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
3. ఆ సూర్యభగవానుడి కిరణాలు
మీ జీవితాల్లో వెలుగులు నింపాలి.
మకర సంక్రాంతి పండుగ
మీ జీవితంలో సంతోషాన్ని తీసుకురావాలి.
మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
4. గాలిపటాలను ఎగురవేయండి
స్వీట్లు పంచుకోండి
మకర సంక్రాంతి పండుగ
మీ జీవితాన్ని సంతోషంగా మార్చానలి కోరుకుంటున్నాను.
మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
5. ఈ మకర సంక్రాంతి సందర్భంగా
భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని,
సంపదను ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
6. మేఘాలు లేకుండా వర్షం లేదు,
సూర్యుడు ఉదయించకుండా రోజు ప్రారంభం కాదు!
అలాగే మీరు లేకుండా మా పండుగ ప్రారంభం కాదు
మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
7. గాలిపటాలు ఆకాశంలో ఎత్తుకు ఎగురుతున్నట్టు
మీ ఆశలు, ఆశయాలు కూడా నెరవేరాలని కోరుకుంటూ
మీ జీవితం అద్భుతంగా ఉండాలని ఆశిస్తూ
మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు
8. సంక్రాంతి శుభాకాంక్షలు మీ హృదయంలో ఆనందాన్ని,
మీ జీవితంలో శ్రేయస్సును
మన స్నేహంలో వృద్ధిని తీసుకురావాలని కోరుకుంటూ
సంక్రాంతి శుభాకాంక్షలు మిత్రమా!
9. ఈ మకర సంక్రాంతి
మీ జీవితంలో వెలుగులు నింపాలని
మీతో నేను పంచుకున్న బంధాన్ని బలంగా మార్చాలని కోరుకుంటూ
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు
10. మకర సంక్రాంతి తెలుగువారికి ఒక వరం
మన జీవితాల్లోకి విజయం, ఆనందం తీసుకువచ్చే వేడుక
నా ప్రియమైన బంధువులకు, స్నేహితులకు సంక్రాంతి శుభాకాంక్షలు
11. అద్భుతమైన స్నేహితులకు సంక్రాంతి శుభాకాంక్షలు
ఈ పండుగ ప్రతి ఒక్కరికీ విజయాన్ని తేవాలని కోరుకుంటున్నాను
హ్యాపీ మకర సంక్రాంతి
13. మీ వ్యక్తిగత,వృత్తిపరమైన జీవితంలో
అన్నీ గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను;
మీరు గాలిపటంలా ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశిస్తూ
సంక్రాంతి శుభాకాంక్షలు
14. సంక్రాంతి రోజున సూర్యుని ఆశీర్వాదాలు
మిమ్మల్ని ఉజ్వలమైన, సంపన్నమైన భవిష్యత్తు వైపు
నడిపించాలని కోరుకుంటూ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు
15. సంక్రాంతి పండుగ మీకు మంచి ఆరోగ్యాన్ని
సంపదను, ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటూ
సంక్రాంతి శుభాకాంక్షలు
సంబంధిత కథనం