Kanuma Wishes: పశువులను ఆరాధించే కనుమ పండుగకు బంధుమిత్రులకు ఇలా శుభాకాంక్షలు చెప్పేయండి
Kanuma Wishes: కనుమ పండుగతో సంక్రాంతి పండుగ పూర్తవుతుంది. మూడు రోజుల సంక్రాంతి పండుగలో కనుమ ముఖ్యమైనది. ఈరోజు పశువులను ఆరాధిస్తారు. ఈరోజు మీ బంధమిత్రులకు కనుమ శుభాకాంక్షలు చెప్పండి.
కనుమ శుభాకాంక్షలు (Twitter)
సంక్రాంతి మూడు రోజుల పండుగ, అందులో మూడో రోజు కనుమ. ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. కనుమను పశువుల పండుగగా పిలుస్తారు. పంటలు చేతికి వచ్చిన ఆనందంలో ఈ పండుగను నిర్వహించుకుంటారు. కనుమ పండుగ రోజు ఇంట్లో ఉన్న ఆవులు, గేదెలను పూజిస్తారు. పక్షులను ప్రేమగా చూస్తారు. వాటికి ఆహారాలను తినిపిస్తారు. ఏడాదంతా తమ యజమానులకు సహాయపడే మూగ జీవాలను గౌరవించే పండుగ కనుమ.

కనుమ రోజు కచ్చితంగా మాంసాహారాన్ని తినడం ఆనవాయితీగా మారింది. సంక్రాంతికి బలిచ్చిన కోళ్లను కనుమ రోజే వండుకుని తింటారు. కనుమ రోజే తమిళనాడులో జల్లికట్టు నిర్వహిస్తారు. ఆరోజు పశువులతో ఆటలు ఆడతారు. ఇది ఎంతో ప్రమాదకరమైనది. చిత్తూరు జిల్లాలోని వల్లివేడు గ్రామంలో ఈ జల్లికట్టు నిర్వహిస్తారు.
కనుమ శుభాకాంక్షలు తెలుగులో
1. ఏడాది పొడవునా మన కష్టంలో పాలుపంచుకునే
పశువులను, రైతన్నలను పూజించే పండుగ కనుమ
అందరికీ కనుమ శుభాకాంక్షలు
2. రోకళ్ల దంచే ధాన్యాలు మనసుల్ని నింపే మాన్యాలు
రెక్కల కష్టంలో చేదోడుగా నిలిచిన పాడి పశువులు
మళ్లీ మళ్లీ చేసుకోవాలి ఇలాంటి వేడుకలు
అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
3. ఈ కనుమ మీకు కమ్మని అనుభూతులను అందించాలని
మనస్పూర్తిగా కోరుకుంటూ
మీకు మీ కుటుంబసభ్యులకు కనుమ శుభాకాంక్షలు
4. కష్టానికి తగిన ప్రతిఫలం కనుమ
శ్రమకోర్చిన పశువులకు ఇచ్చే గౌరవం కనుమ
మనలోని మంచితనం వెలిగించే దినం కనుమ
అందరం కలిసి కష్టసుఖాలను పంచుకునే పర్వదినం కనుమ
మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ శుభాకాంక్షలు
5. వ్యవసాయంలో తమకు తోడుగా ఉన్న
పశువులకు శుభాకాంక్షలు తెలిపే పండుగ కనుమ
అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
6. పశుసంపదకు పూజలు
బసవన్నల ఆటలు
నట్టింట ధాన్యపు రాశులు
అందరికీ కనుమ శుభాకాంక్షలు
7. ముంగిళ్లలో మెరిసే రంగవల్లులు
తెలుగదనాన్ని తట్టిలేసే బంగారు తల్లులు
బసవన్నల ఆటపాటలు
సంక్రాంతి సరదాలు
ఈ కనుమ మీకు కమ్మని అనుభూతులను అందించాలని
కోరుకుంటూ కనుమ శుభాకాంక్షలు
8. మూడురోజుల సంబరం
ఊరించే విందుతో పసందైన వేడుక చేసుకుందాం
అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
9. రైతులే రాజు రాతలు మార్చే పండుగ
పంట చేలు కోతలతో ఇచ్చే కానుక
కమ్మని వంటలతో పొట్ట నింపే వేడుక
అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
10. భోగీ సంక్రాంతి కనుమ పండుగ సందర్భంగా
ప్రజలందరూ ఆనందోత్సాహాలతో
సుఖశాంతులతో ఉండాలని
అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
11. మీ ఇల్లు ఆనందనిలయమై
సుఖసంతోషాలతో
నిండి ఉండాలని
మనసారా కోరుకుంటూ
కనుమ శుభాకాంక్షలు