Dhantrayodashi Wishes: ధనత్రయోదశి నాడు మీ ప్రియమైన వారికి శుభాలు జరగాలని కోరుతూ విషెస్ చెప్పండి
Dhantrayodashi Wishes: శుభాల పండుగ అయిన దీపావళి ధనత్రయోదశితో ప్రారంభమవుతుంది. ఈ పండుగకు మీ ప్రియమైనవారికి శుభాకాంక్షలు చెప్పడానికి కొన్ని మంచి సందేశాల కోసం వెతుకుతున్నారా? ఇక్కడ మేము తెలుగులో కొన్ని మెసేజులు ఇచ్చాము.
దీపావళి అయిదు రోజుల పండుగ. ధనత్రయోదశితో ఈ పండుగ మొదలవుతుంది. ప్రతిరోజూ ఒక్కో సంప్రదాయాన్ని పాటిస్తారు. అయిదు రోజుల్లో ప్రతిరోజూ లక్ష్మీదేవిని పూజించడం చాలా ముఖ్యం. ధంతేరస్ నుండి ప్రారంభమయ్యే ఈ పండుగ మీకు, మీ సన్నిహితులకు శుభదాయకమైన సమయం. మీకు, మీ స్నేహితులకు, బంధువులకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ ధన త్రయోదశికి తెలుగులో శుభాకాంక్షలు పంపండి. కొన్ని మెసేజులను ఇక్కడ అందించాము. మీకు నచ్చినదాన్ని ఎంపిక చేసుకుని మీ ప్రియమైన వారికి పంపించండి.
ధనత్రయోదశి శుభాకాంక్షలు
- ధనత్రయోదశి పర్వదినం సందర్భంగా
మీ అదృష్టం బంగారంలా ప్రకాశించాలని ఆకాంక్షిస్తూ
మీకు, మీ కుటుంబానికి ధనత్రయోదశి శుభాకాంక్షలు
2. పవిత్రమైన ధనత్రయోదశి రోజున
మీ ఇంట్లో దీపం వెలిగిస్తే
మీ ఇల్లంతా ప్రకాశవంతంగా ఉంటుంది,
మీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటూ
లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించాలని కాంక్షిస్తూ
మీకు ధన త్రయోదశి శుభాకాంక్షలు
3. ఈ ధంతేరాస్‌తో మీరు చాలా ధనవంతులు కావాలని కోరుకుంటున్నాను.
మీ ఇంట్లో సంపదల వర్షం కురవాలని, లక్ష్మీదేవి నివసించాలని,
కష్టాలు తొలగి శాంతి కలగాలని ఆకాంక్షిస్తున్నాను
హ్యాపీ ధంతేరాస్
4. ధనత్రయోదశి శుభదినం వచ్చేసింది.
కొత్త సంతోషాన్ని తెచ్చేసింది.
మీ వ్యాపారం రోజురోజుకూ పెరగాలని
మీ జీవితంలో ఆప్యాయత, ప్రేమ ఉండాలని
మీపై ఎల్లప్పుడూ డబ్బుల వర్షం కురవాలని
కోరుకుంటూ ధనత్రయోదశి శుభాకాంక్షలు
5. ధంతేరస్ రోజున మీకు ధన్వంతరి
మీకు ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సు కలగాలని కోరుకుంటూ…
ఈ ధంతేరస్ మీకు ప్రత్యేకమైనదిగా ఉండాలని,
మీ ఇంట్లో సంతోషం, లక్ష్మి నివసించాలని కోరుకుంటూ
మీ కుటుంబానికి ధనత్రయోదశి శుభాకాంక్షలు
6. ధన్వంతరి దేవుని దివ్య ఆశీస్సులు
మీకు దృఢమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని,
లక్ష్మిదేవి మీకు అపరిమితమైన శ్రేయస్సును
ప్రసాదించాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబానికి ధనత్రయోదశి శుభాకాంక్షలు
7. మీ ఇంటి ముందు వెలిగే దీపాల్లా
మీ జీవితం కూడా వెలుగులీనాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబానికి ధనత్రయోదశి శుభాకాంక్షలు
8. ధనత్రయోదశి రోజున కుబేరుడు, లక్ష్మీదేవి
మీ వ్యాపారంలో లాభాలు, సిరి సంపదలు తేవాలని కోరుకుంటూ
మీ అందరికీ ధంతేరాస్ శుభాకాంక్షలు
9. కుబేరుడు,లక్ష్మీదేవి కలిసి మీ ఇంట్లో...
ధనరాశులను కురిపించాలని కోరుకుంటూ
మీకు ధన త్రయోదశి శుభాకాంక్షలు
10. లక్ష్మీ మీ ఇంట నర్తించగా
సంతోషం పాలై పొంగగా
దీపకాంతులు వెలుగునీయగా
పండుగను ఆనందంగా నిర్వహించుకోండి
మీకు ధనత్రయోదశి శుభాకాంక్షలు
11. మీ ఇల్లు నవ్వు, ప్రేమ, సంపదతో నిండి ఉండాలని
కోరుకుంటూ ధంతేరాస్ శుభాకాంక్షలు
12. ధనత్రయోదశి మీ జీవితాన్ని కాంతిమయం చేయాలని
మీకు మంచి ఆరోగ్యం, సంపద దక్కాలని కోరుకుంటూ
హ్యాపీ ధనత్రయోదశి శుభాకాంక్షలు