Dasara Wishes in Telugu: మీ స్నేహితులకు బంధువులకు దసరా శుభాకాంక్షలు ఇలా అందంగా చెప్పేయండి-wish dussehra to your friends and relatives beautifully in telugu here are the dussehra wishes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dasara Wishes In Telugu: మీ స్నేహితులకు బంధువులకు దసరా శుభాకాంక్షలు ఇలా అందంగా చెప్పేయండి

Dasara Wishes in Telugu: మీ స్నేహితులకు బంధువులకు దసరా శుభాకాంక్షలు ఇలా అందంగా చెప్పేయండి

Haritha Chappa HT Telugu

Dasara 2024 Wishes in Telugu: దసరా శుభాకాంక్షలు, కోట్స్, మెసేజుల కోసం వెతుకుతున్నారా? ఇక్కడ మేము కొన్ని అందమైన, అర్దవంతమైన దసరా శుభాకాంక్షలు అందించాము. వీటిని మీ స్నేహితులు, బంధువులతో షేర్ చేసుకోండి.

దసరా శుభాకాంక్షలు (Pixabay)

దసరా నాడు దుర్గాదేవిని మనసారా వేడుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మీ కోరికలే కాదు, మీ స్నేహితులు, బంధువుల కోరికలు కూడా నెరవేరాలని కోరుకుంటూ వారికి దసరా శుభాకాంక్షలు తెలియజేయండి. చక్కటి దసరా విషెస్ ను ఇక్కడ మేము తెలుగులోనే అందించాము. వీటిని వారికి షేర్ చేసి దసరా ఆనందాన్ని పంచుకోండి.

దసరా శుభాకాంక్షలు

1. మీలోని మంచితనం చెడుపై

విజయం సాధించాలని కోరుకుంటూ

విజయదశమి శుభాకాంక్షలు

2. మీ జీవితం ప్రేమ, ఆనందం, విజయంతో

నిండి ఉండాలని ఆ దుర్గామాతను ప్రార్థిస్తున్నాను

హ్యాపీ విజయదశమి

3. రావణుడి దిష్టిబొమ్మతో పాటు

ఆ మంటల్లో మీ బాధలు, కష్టాలు కూడా

దహనం అయిపోవాలని కోరుకుంటూ

దసరా శుభాకాంక్షలు

4. చెడు ఎంత శక్తివంతంగా కనిపిస్తున్నప్పటికీ

మంచితనమే చివరికి విజయం సాధిస్తుంది

ఇదే దసరా మనకి గుర్తుచేస్తుంది

హ్యాపీ దసరా

5. అడ్డంకులను అధిగమించే శక్తి

ధర్మ మార్గాన్ని అనుసరించే ధైర్యం

మీకు ఆ దుర్గాదేవి ఇవ్వాలని కోరుకుంటూ

దసరా శుభాకాంక్షలు

6. అసత్యం పై సత్యం సాధించిన విజయాన్ని

వేడుక చేసుకునే సమయమే ఈ దసరా

మీ జీవితం సత్యం ధర్మంతో నిండి ఉండాలని కోరుకుంటూ

అందరికీ దసరా శుభాకాంక్షలు

7. ప్రేమ, విధేయత, నిజాయితీ, విలువలను

గుర్తుంచుకోవడానికి దసరా పండుగను వేడుకగా చేసుకుందాం.

ఈరోజు నుంచి మీకు అంతా శుభమే జరగాలని కోరుకుంటూ

హ్యాపీ దసరా

8. జీవితంలో సరైన మార్గాన్ని అనుసరించడానికి

మీకు బలం, సంకల్పం లభించాలని కోరుకుంటూ

హ్యాపీ దసరా

9. మీరు చేసే ప్రతి పనిలోనూ దుర్గాదేవి

బలాన్ని, శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నా

మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

10. మీరు వెళ్లే ప్రతి మార్గంలోనూ మీకు విజయం దక్కాలని

ఆ అమ్మవారు తోడుగా నిలవాలని కోరుకుంటూ

విజయదశమి శుభాకాంక్షలు

11. మీ ఇంటిల్లిపాదికి దుర్గమ్మ తల్లి

ఆరోగ్యాన్ని, శ్రేయస్సును అందించాలని

మనస్పూర్తిగా కోరుకుంటూ

విజయదశమి శుభాకాంక్షలు

12. మీపైనా మీ కుటుంబంపైనా

అమ్మవారి కరుణ ఎల్లకాలం ఉండాలనీ

ఆమె ఆశీర్వాదాలు మీకు అందాలని కోరుకుంటూ

దసరా శుభాకాంక్షలు

13. ఈ దసరా మీ జీవితంలో

పూర్తి ఆనందాన్ని, విజయాన్ని అందించాలని కోరుకుంటూ

మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ దసరా

14. రావణుడి దిష్టిబొమ్మలాగే దసరా రోజు

మీ కోపాన్ని, చెడును కూడా దహనం చేసేయండి

ఈరోజు నుంచి మీరు అద్భుతమైన వ్యక్తిగా

మారాలని కోరుకుంటూ

మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ దసరా

15. రాముడు నడిచినట్టు

మీరు ఎల్లప్పుడూ సన్మార్గంలో నడవాలని

దుర్గాదేవిలా ధైర్యవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటూ

మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

16. ఆ దుర్గమ్మ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ

మీ ఇంటిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

17. ఈ దసరా నుంచి మీరు విజయానికి

చిరునామాగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు