Winter Home Tips: చలికాలం వచ్చేస్తోంది.. ఇంట్లో వెచ్చగా ఉండేందుకు కిటికీలు, తలుపులను ఇలా సీల్ చేయండి!
Winter Home Tips: శీతాకాలంలో చల్లగాలి కిటికీలు, తలుపుల ద్వారా ఇంట్లో ఎక్కువగా వస్తుంది. తలుపులు, కిటికీల సందులను సీల్ చేయడం ద్వారా చల్లగాలిని ఇంట్లోకి రాకుండా నిరోధించవచ్చు. అలా సీల్ చేసేందుకు మార్గాలు ఏవో ఇక్కడ చూడండి.
చలికాలం అడుగుపెట్టేందుకు మరికొన్ని రోజులే ఉంది. ఇప్పటికే చలిగాలులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవి క్రమం ఎక్కువవుతాయి. శీతాకాలంలో తీవ్రమైన చలి గాలులు ఇబ్బంది కలిగిస్తాయి. అనారోగ్యానికి కారణమయ్యే రిస్క్ ఉంటుంది. అందుకే ఈ చల్లగాలుల నుంచి ఇంటిని సంరక్షించుకోవాలి. సాధారణంగా కిటికీలు, తలుపులు మూసేస్తే ఇంట్లోకి చల్లగారి రాదని అనుకుంటారు. అయితే, వాటి సందుల్లో నుంచి చల్లగాలి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. వాటిని సీల్ చేస్తే గాలులు రాకుండా ఇల్లు వెచ్చగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. తలుపులు, కిటికీలకు ఎలా సీల్ చేయాలో ఇక్కడ చూడండి.
డోర్ సీల్ టేప్
డోర్ సీల్ టేప్‍లను వాడడం ద్వారా ఇంట్లోకి చల్లగాలి రాకుండా జాగ్రత్త పడొచ్చు. ఇది సులభం కూడా. కిటికీలు, తలుపుల అంచుల చుట్టూ ఈ టేప్ అతికించాలి. గాలిలోపలికి వచ్చే అవకాశం లేకుండా జాగ్రత్తగా సీల్ చేయాలి. కిటికీలు, తలుపుల అంచుల వెంట జాగ్రత్తగా ఫిక్స్ చేయాలి. సీల్ చేసేందుకు వాడే ఈ డోర్ టేప్.. మార్కెట్‍లో, ఆన్‍లైన్‍లో సులువుగా దొరుకుతుంది.
కిటికీలకు ఇన్సులేటింగ్ ఫిల్మ్
ఇంట్లోకి ఎక్కువగా కిటికీల నుంచే చల్లటి, వేడి గాలులు ప్రవేశిస్తుంటాయి. అందుకే చలికాలం కిటికీలను ఇన్సులేటింగ్ ఫిల్మ్‌తో కవర్ చేయాలి. ఫర్నిచర్ షాప్‍ల్లో, ఆన్‍లైన్‍లో ఇది సులువుగానే లభిస్తుంది. ఈ ఫిల్మ్‌తో కిటికీలను సరిగా కవర్ చేసేయాలి. దీంతో గాలి బయటికి నుంచి ఇంట్లోకి రాకుండా ఇది నిరోధిస్తుంది.
ఫోమ్ టేప్
ఫోమ్ టేప్ కూడా తలుపులు, కిటికీలు సీల్ చేసేందుకు మంచి ఆప్షన్‍గా ఉంటుంది. వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది. ఈ ఫోమ్ టేప్‍ను కట్ చేసి తలుపులు, కిటీకీల అంచులకు అతికించాలి. దీంతో సందుల నుంచి గాలి రావడాన్ని ఇది నిరోధిస్తుంది.
వెదర్ స్ట్రిప్స్
తలుపుల మధ్యలో ఉన్న సందుల నుంచి చల్లగాలి లోపలికి వస్తుంది. ఒకవేళ ఇంట్లో రూమ్ హీటర్ వాడితే సందుల వెంట గాలి వస్తుండటంతో గదిలో వెచ్చదనం సరిగా ఉండదు. అలాంటి సందర్భాల్లోనూ తలుపుల సందులను సీల్ చేయడం ముఖ్యం. అందుకు వెదర్ స్ట్రిప్‍లను కూడా వినియోగించవచ్చు. ముందుగా తలుపు కొలతలను సరిగా తీసుకున్న తర్వాత.. ఈ స్టిప్‍ను తెచ్చుకోవాలి. దాన్ని తలుపు అంచుల వెంట ఫిక్స్ చేయాలి. వీటిలో ఏదో ఒక పద్ధతి ద్వారా తలుపులు, కిటికీలను సీల్ చేసుకోవచ్చు.