ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మార్చి 29న ఏర్పడనుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాదు, పాక్షిక గ్రహణం. అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి ఖచ్చితమైన అమరికలో అంటే ఒకే సమాంతర రేఖలో ఉండవు. దీని వల్ల సూర్యుని కొంత భాగం మాత్రమే కనిపించదు. ఈ ఖగోళ సంఘటన చూసేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతోంది. సూర్యగ్రహణం భారతేదేశంలో కనిపిస్తుందా? కనిపించదా? అనే సందేహం ఎక్కువమందికి ఉంది. తగిన కంటి రక్షణతో ఈ ఖగోళ అద్భుతాన్ని చూసేందుకు ఎంతో మంది సిద్ధమవుతున్నారు.
ఈ సూర్యగ్రహణాన్ని భారతదేశంలో ఉన్న ప్రజలు చూడలేరు. అందుకే మనదేశానికి సూర్యగ్రహణం లేనట్టే. దీన్ని చూసేందుకు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం ఉండదు. ఇది పాక్షిక సూర్యగ్రహణం కాబట్టి … మనకు సూర్యకాంతి సాధారణంగానే పడుతుంది.
ఈ సూర్యగ్రహణం తూర్పు, ఉత్తర కెనడాలో గ్రహణం ఎక్కువగా కనిపిస్తుంది.
* ఈశాన్య యునైటెడ్ స్టేట్స్ లో నివసించే ప్రజలకు ఈ గ్రహణం ఉంటుంది. ఇది సూర్యుడిలో 85% పైగా కవర్ చేస్తుంది.
* ఆఫ్రికా, సైబీరియా, కరేబియన్, యూరప్లోని కొన్ని ప్రాంతాలు పాక్షిక గ్రహణాన్ని చూడగలవు.
* ఐస్లాండ్లోని రేక్జావిక్‌లో సుమారు 66% సూర్యుడు కనిపించడు. ఇది అతి తక్కువ కవరేజ్ స్థాయిలు ఉన్న ప్రదేశాలలో ఒకటిగా ఉంటుంది.
* ఉత్తర, దక్షిణ అమెరికాలో తెల్లవారుజాము నుంచే గ్రహణం ఏర్పడనుంది.
* తూర్పు ఐరోపా, ఉత్తర ఆసియాలో, ఇది మధ్యాహ్నం లేదా తెల్లవారుజామున జరుగుతుంది. కానీ పశ్చిమ ఐరోపా, వాయువ్య ఆఫ్రికాలో ఇది మధ్యాహ్నం నుంచి తెల్లవారుజాము వరకు ఉంటుంది.
2025 మార్చి 29 శనివారం నాడు మొదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రారంభమయ్యే గ్రహణం సాయంత్రం 4:17 గంటలకు పతాక స్థాయికి చేరుకుంటుంది. అయితే, సమయ వ్యత్యాసం, ఈవెంట్ అలైన్మెంట్ కారణంగా భారత్ గ్రహణాన్ని చూడలేకపోతుంది.
తగిన కంటి రక్షణ: గ్రహణాన్ని వీక్షించేటప్పుడు, ఎల్లప్పుడూ గ్రహణాన్ని చూసేందుకు వీలైన కళ్లద్ధాలు లేదా సురక్షితమైన హ్యాండ్హెల్డ్ సోలార్ వ్యూయర్ ధరించండి. సాధారణ సన్ గ్లాసెస్ వాడడం మాత్రం సురక్షితం కాదు.
ఆప్టికల్ పరికరాల ద్వారా చూడటం మానుకోండి: గ్రహణ అద్దాలు ధరించేటప్పుడు, బైనాక్యులర్లు, టెలిస్కోప్లు లేదా కెమెరా లెన్స్ తో సహా ఏదైనా ఆప్టికల్ పరికరాల ద్వారా సూర్యుడిని చూడటం మంచిది కాదు. ఫిల్టర్ ద్వారా ఫోకస్డ్ ఫోటాన్లు మండడం వల్ల తీవ్రమైన కంటి గాయాలు సంభవించవచ్చు. సూర్యుడిని సురక్షితంగా వీక్షించడానికి, ప్రత్యేకమైన సన్ ఫిల్టర్ ఉపయోగించండి.
పరోక్ష వీక్షణ పద్ధతులను ఉపయోగించండి: గ్రహణ అద్దాలు లేకుండా సూర్యుడిని వీక్షించడానికి, పిన్హోల్ ప్రొజెక్టర్ ను ఉపయోగించి దాని చిత్రాన్ని ఉపరితలంపై ప్రొజెక్ట్ చేయండి. పిన్హోల్ గుండా నేరుగా చూడటం మానుకోండి.
భూమి, సూర్యుడి మధ్యకు చంద్రుడు వచ్చి సూర్యుడిని కొంతమేరకు కప్పివేస్తాడు. దీని వల్ల భూమిలోని కొంత భాగంపై సూర్యకాంతి పడదు. దీనిని పాక్షిక సూర్య గ్రహణం అంటారు. ఈ రకమైన గ్రహణ సమయంలో సూర్యుడు, చంద్రుడు, భూమి సమాంతర రేఖలో లేనందున, చంద్రుడు భూమి ఉపరితలాన్ని పాక్షికంగా మాత్రమే కాంతి పడకుండా అడ్డుకోగలడు.
సంబంధిత కథనం
టాపిక్