ప్రెగ్నెన్సీ సమయంలో క్యూట్ బేబీల ఫోటోలు చూస్తే మీ బిడ్డ కూడా అందంగా పుడుతుందా! ఇలా చూడాలని ఎందుకంటారు?
looking at cute baby pictures during pregnancy: కడుపుతో ఉన్నప్పుడు అందమైన పిల్లల ఫొటోలు చూస్తే కడుపులోని బిడ్డ అందంగా పుడుతుంది అనే మాటలు మీరు వినే ఉంటారు. నిజంగానే ఇలా జరుగుతుందా? గర్భిణిలు క్యూట్ బేబీ ఫోటోస్ చూడాలని ఎందుకంటారు? తెలుసుకుందాం రండి.

తల్లిదండ్రులు కాబోతున్నాం అని తెలియగానే కలిగే ఆ ఫీలింగే వేరు. ఈ సమయంలో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోతాయి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అందరూ బిడ్డ రాక కోసం ఎదురుచూస్తారు. తల్లీ బిడ్డ క్షేమం కోసం తహతహలాడతారు. ముఖ్యంగా ఈ సమయంలో గర్భిణీ స్త్రీ తినే ఆహారం, తాగే పానీయాలు నుంచి ఆమె ఇష్టాలు, అభిరుచులు అన్నింటిపై పూర్తిగా శ్రద్ధ వహిస్తారు. అంతేకాదు.. చాలా మంది గర్భిణి ఉండే గది మొత్తాన్ని అందమైన చిన్న పిల్లల ఫొటోలు, పోస్టర్లతో నింపేస్తారు. కడుపుతో ఉన్నప్పుడు ఇలా క్యూట్ బేబీల ఫొటొలను చూడటం వల్ల కడుపు పెరుగుతున్న బిడ్డ కూడా అందంగా తయారవుతుంది, క్యూట్‌గా పుడుతుందని నమ్ముతారు. నిజంగానే ఇలా జరుగుతుందా? ఈ విషయంలో వాస్తవం ఏంటి అపోహలేంటి అనే విషయాలను తెలుసుకుందాం రండి.
రిపోర్ట్లు ఏం చెబుతున్నాయి..
వినడానికి చాలా బాగా అనిపించినప్పటికీ గర్భధారణ సమయంలో అందమైన పిల్లల చిత్రాలను చూడటం వల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డ రూపంలో ఎలాంటి మార్పును తీసుకురాలేరు. ఒక బిడ్డ రంగు, ఆకారం రూపం, జుట్టు వంటివన్నీ ప్రధానంగా జన్యువులపై ఆధారపడి ఉంటాయి.
అంటే తల్లిదండ్రులిద్దరి నుండి సంక్రమించిన జన్యువుల నిర్దిష్ట కలయికనే బిడ్డ జన్యువులు, చర్మం రంగు, జుట్టు, ముక్కు నుండి ఎత్తును నిర్ణయిస్తాయి. డామినెంట్, రీసెసివ్ జన్యుల కలయికతో బిడ్డ రూపుచెందుతుంది. అంటే తల్లి,తండ్రి ఇద్దరిలో ఎవరి జన్యు లక్షణాలు ఎక్కువ డామినేట్ వారి రూపం, కండరాల నిర్మాణం, ఎత్తు, పొడవు వంటి లక్షణాలు వస్తాయి.
గర్భిణి స్త్రీలు అందమైన పిల్లల ఫొటోలు చూడటం వల్ల కలిగే లాభాలేంటి?
గర్భవతులు క్యూట్ బేబీ ఫోటోలు చూసినప్పుడు వాటి ద్వారా ప్రత్యక్షంగా బేబీ రూపం మారదు, కానీ మాతృక భావోద్వేగాలు ,మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు
ఉల్లాసమైన మనోభావాలు:
క్యూట్ బేబీ ఫోటోలు చూసినప్పుడు తెలియని ఆనందం, ప్రేమ , ఆత్మీయతల అనుభూతులు కలుగుతాయి.ఇవి గర్భవతికి సంతోషాన్ని ఇస్తాయి. ఆమెలో సానుకూల భావాలను పెంచుతాయి.
ఒత్తిడి తగ్గించడం:
గర్భధారణ సమయంలో సాధారణంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇది తల్లీబిడ్డా ఆరోగ్యానికి హానికరమవుతుంది. అందమైన పిల్లల ఫొటోలను చూడటం వల్ల ఆందోళనను తగ్గించుకోవచ్చు. ఫలితంగా ప్రశాంతమైన భావోద్వేగ వాతావరణం ఏర్పడుతుంది, ఇది బేబీకి కూడా మంచిది.
భావోద్వేగ అనుబంధం:
బేబీ ఫోటోలు చూడటం వల్ల తల్లి, బిడ్డ మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది. గర్భవతిగా ఉన్నప్పటికీ తల్లి తన బేబీతో ఉన్నట్లుగా ఫీలయి మంచి అనుబంధాన్ని ఏర్పరుస్తుంది.తన భవిష్యత్తు జీవితాన్ని, తన బేబీతో కలిసి గడిపే సమయాన్ని ఆలోచించి, ఇది మరింత మమకారాన్ని పెంచుకునేందుకు ఇది సహాయపడుతుంది..
ఆక్సిటొసిన్ అనే ప్రేమ హార్మోన్ విడుదల:
ప్రెగ్నెన్సీ సమయంలో క్యూట్ బేబీ ఫోటోలు చూడటం వల్ల తల్లికి ఆక్సిటొసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ ప్రేమ, అనుబంధం, సంతోషాన్ని కాపాడే భావాలను ప్రేరేపిస్తుంది. ఆక్సిటొసిన్ వలన తల్లి మరింత శ్రద్ధగా, స్నేహపూర్వకంగా మారుతుంది.
సానుకూల ఆలోచనలు పెంచడం:
గర్భధారణ సమయంలో కొంతమంది తల్లులు భవిష్యత్తు గురించి అనుమానాలు,ఆందోళనలను అనుభవిస్తారు. కానీ బేబీ ఫోటోలు చూడటం వల్ల వాటికి దూరంగా ఉంటూ మంచి అనుభూతులను నింపుకుంటారు. భవిష్యత్తు పట్ల సానుకూల ఆలోచన పెంచుకోగలుగుతారు.
ప్రశాంత వాతావరణం ఏర్పడడం:
క్యూట్ బేబీ ఫోటోలు చూస్తూ ఉండటం వల్ల తల్లి సంతోషంగా, రిలాక్స్‌గా ఉండగలుగుతుంది. ఇది తల్లికి, బిడ్డకీ చాలా మంచిది. బిడ్డ ఎదుగులకు చాలా బాగా సహాపడుతుంది. ఇద్దరిలోనూ ప్రశాంతత వాతావరణాన్ని పెంచి సంతోషంగా ఉంచుతుంది.
మాతృత్వ లక్షణాల అభివృద్ధి:
అందమైన చిన్న పిల్లల ఫొటొలను చూడటం వల్ల గర్భవతి తన బేబీకి మరింత జాగ్రత్తగా కాపాడుకునేలా, ప్రేమగా చొరవ చూపేలా తయారవుతుంది. మానసికంగా ముందే తల్లి లక్షణాలను అలవరచుకుంటుంది.
సంబంధిత కథనం