Intimacy Life : మహిళలు శృంగారంపై ఆసక్తి ఎందుకు కోల్పోతారు? కారణాలేంటి?-why women loose interest in intimacy life there are psychological reasons ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Intimacy Life : మహిళలు శృంగారంపై ఆసక్తి ఎందుకు కోల్పోతారు? కారణాలేంటి?

Intimacy Life : మహిళలు శృంగారంపై ఆసక్తి ఎందుకు కోల్పోతారు? కారణాలేంటి?

HT Telugu Desk HT Telugu
Nov 03, 2023 08:00 PM IST

Women Intimacy Life : పురుషులకు శారీరక అంగస్తంభన లోపం ఉన్నట్లే, స్త్రీలు కూడా కొన్ని లక్షణాలను అనుభవిస్తారు. మహిళలు సెక్స్ చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Freepik)

పురుషులకు అంగస్తంభన లోపం ఉన్నట్లే, స్త్రీలకు కూడా అలాగే ఉంటుంది. అలాంటి స్త్రీలను కొన్ని సంకేతాల ద్వారా సులభంగా గుర్తించవచ్చు. మ‌హిళ‌లు సెక్స్‌పై ఎందుకు ఆస‌క్తి కోల్పోతారో ఇప్పుడు తెలుసుకుందాం.

లైంగిక కోరిక తగ్గడం అనేది స్త్రీ లైంగిక బలహీనత సాధారణ లక్షణాలలో ఒకటి. ఎంత ప్రేరేపించబడినా, వారు సెక్స్ చేయాలనే కోరికను అనుభవించరు. లైంగికంగా ప్రేరేపించబడటంలో వారికి సమస్య ఉంటుుంది. లైంగిక కార్యకలాపాల సమయంలో ఉత్సాహం ఉండదు.

తగినంత ఉద్దీపన, లైంగిక కార్యకలాపాల తర్వాత కూడా మహిళలు క్లైమాక్స్‌కు చేరుకోవడం కష్టంగా అనిపిస్తే, వారికి ఈ సమస్య ఉందని చెప్పవచ్చు. అంటే వారు లైంగిక కార్యకలాపాలను తగ్గించుకున్నారని అర్థం.

డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక కారకాలు లేదా లైంగిక, భావోద్వేగ లేదా శారీరక లైంగిక హింస వంటి కొన్ని గత చెడు అనుభవాలు కూడా మహిళల్లో లైంగిక బలహీనతకు కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. అలాగే చాలా సార్లు స్త్రీలు తమ శరీరాలపై విశ్వాసం లేకపోవడం లేదా మానసిక లైంగిక నపుంసకత్వానికి గురవుతారు. భాగస్వామితో సాన్నిహిత్యం లేకపోయినా స్త్రీలలో లైంగిక కోరికలు రావు. దీంతో మహిళలు ఒత్తిడికి గురవుతున్నారు.

గుండె జబ్బులు, మధుమేహం, కిడ్నీ రుగ్మతలు, థైరాయిడ్ వంటి వైద్య సమస్యలతో బాధపడేవారికి కూడా సెక్స్ పట్ల కోరిక ఉండదు. అలాగే గర్భధారణ సమయంలో, ప్రసవానంతర సమయంలో యోని విపరీతంగా సాగడం, కోతలు, కుట్లు ఒక కారణం. దీనివల్ల మహిళలు సెక్స్ పట్ల ఆసక్తిని కోల్పోతారు. పాలిచ్చే సమయంలో జననాంగాలు పొడిబారిపోతాయి. ఇది సెక్స్ హార్మోన్ల అసమతుల్యత, లిబిడో లేకపోవడం వంటి సమస్యలను కలిగిస్తుంది.

నిరాశ భావాలు, గతంలో జరిగిన చేదు ఘటనలు అన్ని డిప్రెషన్ సంకేతాలు. ఈ పరిస్థితులన్నీ మీకు లిబిడో లోపానికి కారణమవుతాయి. డిప్రెషన్ లిబిడోను నియంత్రించడంలో సహాయపడే నరాలలో అసమతుల్యతను కలిగిస్తుంది. లిబిడో లేకపోవడంతో పాటు డిప్రెషన్ లక్షణాలు కూడా ఉంటే.. మీకు దేనిపైనా ఆసక్తి ఉండదు.

ఒత్తిడి కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను పెంచుతుంది. అధిక స్థాయి కార్టిసాల్ సెక్స్ హార్మోన్లను అణిచివేస్తుంది, ఇది మీ సెక్స్ డ్రైవ్‌ను ప్రభావితం చేస్తుంది. లైంగిక వేధింపులు లేదా అత్యాచారం వంటి ఘటనలు మీ లైంగిక కోరికను ప్రభావితం చేయవచ్చు. ఈ స్థితిలో లిబిడో లేకపోవడం సాధారణంగా జరుగుతుంది. మితిమీరిన ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్ వాడటం వల్ల సెక్స్ డ్రైవ్ తగ్గుతుంది. ధూమపానం మీ టెస్టోస్టెరాన్ స్థాయిలను అణిచివేస్తుంది, ఇది లిబిడో లేకపోవటానికి దారితీస్తుంది. ఇలా చాలా రకాల కారణాలు మహిళల్లో సెక్స్ ఆసక్తిని తగ్గేలా చేస్తాయి.

Whats_app_banner