Fake orgasm in women: సగం మంది మహిళలు ఆ అనుభూతి పొందినట్లు నటిస్తారట.. ఎందుకో తెలుసా?
Fake orgasm in women: మహిళలు భావప్రాప్తి పొందినట్లు నటించడానికి అనేక కారణాలున్నాయి. అసలు అలా ఎందుకు చేస్తారు? దానికి కారణాలేంటో వివరంగా తెల్సుకోండి.
శృంగారం అనేది పురుషులు, స్త్రీలలో చాలా భిన్నంగా ప్రభావం చూపే ప్రక్రియ. భావప్రాప్తి పొందని శృంగారానికి అర్థం లేదు. కొన్ని కారణాల వల్ల సగం కన్నా ఎక్కువ శాతం అమ్మాయిలు భావప్రాప్తి పొందినట్లు కేవలం నటిస్తారట. దానికి అనేక కారణాలున్నాయి. ఈరోజు ఇంటర్నేషనల్ ఫీమేల్ ఆర్గాస్మ్ డే. ఈ సందర్భంగా అసలు మహిళలు అలా నటించడానికి కారణాలేంటో తెల్సుకుందాం.
ముగించేయాలని:
శృంగారం మీద ఆసక్తి తగ్గడం వల్ల లేదంటే తొందరగా ముగించేయాలనే ఉద్దేశంతోనే చాలా మంది మహిళలు భావప్రాప్తి పొందినట్లు నటిస్తారట. దీన్నే ఫేక్ ఆర్గాస్మ్ అంటారు. లేదంటే భాగస్వామికి భావప్రాప్తి భావన వచ్చినట్లు అనిపించినా వెంటనే వాళ్లూ ఆ అనుభూతి పొందినట్లు నటించి ముగించేస్తారు.
భాగస్వామి సంతృప్తి కోసం:
తమకు శృంగారంలో మంచి అనుభూతి ఇవ్వలేకపోతున్నామనే భావన వాళ్ల భాగస్వామికి రావొద్దనీ, వాళ్లు దాని గురించి ఆందోళన పడటం ఇష్టం లేక చాలా మంది మహిళలు భావప్రాప్తి పొందినట్లు ఊరికే నటిస్తారు. భాగస్వామికి వచ్చే సంతృప్తి వల్ల వాళ్ల బంధం బలపడుతుందని నమ్ముతారు.
భాగస్వామి పట్టించుకోరు:
చాలా మంది సెక్స్ అంటే పురుషుల్లో వచ్చే అనుభూతిని మాత్రమే పరిగణిస్తారు. మహిళల భావోద్వేగాలను పట్టించుకోరు. అలాంటి భాగస్వామి ఉంటే వాళ్ల ఇబ్బంది చెప్పుకోలేరు. వాళ్లకు ఎలాగో విలువ లేదని కేవలం వాళ్లూ శృంగారాన్ని ఆస్వాదిస్తున్నట్లు నటిస్తారు.
వాస్తవ అనుభూతి కోసం:
ఇది ఒకరకంగా మంచికోసమే అనుకోవచ్చేమో. కొంతమంది మహిళలు నిజమైన భావప్రాప్తి పొందడానికి ముందు ఆ అనుభూతి పొందినట్లు నటించడం మొదలు పెడతారు. దాంతో నిజమైన అనుభూతిని శృంగారంలో క్రమంగా పొందగలుగుతారట.
లోలోపల భయాలు:
భావప్రాప్తి ఇద్దరిలోనూ వస్తేనే శృంగారంలో సంపూర్ణ అనుభూతి ఇద్దరూ పొందగలుగుతారు. ఒకవేళ మహిళలకు ఆ అనుభూతి రాకపోతే వాళ్లలో ఏదో లోపం ఉందని అనుకుంటారని భయపడతారు. భాగస్వామికి శృంగారం అసంపూర్తిగా అనిపిస్తుంది. అందుకే భావప్రాప్తి పొందినట్లు నటిస్తారు. లేదంటే వాళ్ల మీద ఆసక్తి తగ్గుతుందని భయపడతారు.
అసలు భావప్రాప్తి గురించి తేలీక:
మహిళలకు వాళ్ల శరీరం గురించి అవగాహన లేకపోవడం కూడా భావప్రాప్తి పొందినట్లు నటించడానికి కారణమే. అసలు వాళ్లను ఆనందపరిచే విషయాలేంటో వాళ్లకు తెలీదు. తెలిసినా వాటి గురించి భాగస్వామితో మాట్లాడటానికి ఇబ్బంది పడతారు. వాళ్ల అవసరాలను చర్చించరు. ఈ భయాల వల్ల మంచి అనుభూతి పొందలేరు.
అసలు భావప్రాప్తి ఎందుకు పొందాలి?
శృంగారంలో పాల్గొంటే సరిపోతుంది కదా అంటే.. భావప్రాప్తి వల్ల అనేక లాభాలుంటాయి. ఈ అనుభూతి పొందకపోతే క్రమంగా శృంగారం మీద అనాసక్తి పెరుగుతుంది. దీర్ఘకాలికంగా బంధాల మీద ప్రభావం ఉంటుంది. భావప్రాప్తి పొందినప్పుడు శరీరంలో ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. మీకు ఆనందాన్నిచ్చే డోపమైన్, ఆక్సిటోసిన్ హార్మోన్లు విడుదలవుతాయి. కండరాలు సాంత్వనగా అనిపిస్తాయి. దాంతో చక్కగా నిద్ర పడుతుంది.
సమస్య ఉన్నట్లే:
ఫేక్ ఆర్గాస్మ్ వల్ల ఎలాంటి లాభాలు ఉండకపోగా.. అనారోగ్యానికి ఇదొక సూచనగా అనుకోవచ్చు. భావప్రాప్తి పొందలేకపోవడం నిజంగానే పరిగణించాల్సిన సమస్య. ఆందోళన, డిప్రెషన్, నిరాశలు కూడా శృంగార సామర్థ్యం తగ్గించేస్తాయి. యోని పొడి బారడం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, యీస్ట్ ఇన్ఫెక్షన్లు కూడా శృంగార సామర్థ్యం మీద ప్రభావం చూపుతాయి. దాంతో సెక్స్ అంటేనే అసౌకర్యం పెరిగి దాన్ని ఆనందించలేరు. కాబట్టి ఇలాంటి సమస్యలేమైనా ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలి.
టాపిక్