Good Friday | గుడ్ ఫ్రైడే అంటే ఏమిటి? దానిని ఎందుకు జరుపుతారో మీకు తెలుసా?-why we celebrate good friday and the histroy of this day is here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Good Friday | గుడ్ ఫ్రైడే అంటే ఏమిటి? దానిని ఎందుకు జరుపుతారో మీకు తెలుసా?

Good Friday | గుడ్ ఫ్రైడే అంటే ఏమిటి? దానిని ఎందుకు జరుపుతారో మీకు తెలుసా?

HT Telugu Desk HT Telugu
Apr 07, 2023 08:51 AM IST

ఏసుక్రీస్తును శిలువ వేసిన జ్ఞాపకార్థంగా క్రైస్తవులు గుడ్​ఫ్రైడేను జరుపుకుంటారు. కాబట్టి వారంతా ఈ రోజును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అసలు గుడ్​ఫ్రైడ్​ చరిత్ర, ప్రాముఖ్యత, ఈరోజు క్రైస్తవులు ఏమి చేస్తారనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

<p>గుడ్ ఫ్రైడే</p>
<p>గుడ్ ఫ్రైడే</p>

Good Friday : గుడ్ ఫ్రైడేను చాలా మంది పవిత్రమైన దినంగా పరిగణిస్తారు. ఏసుక్రీస్తును శిలువ వేసినందుకు గానూ, జ్ఞాపకార్థంగా గుడ్​ఫ్రైడేను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 15న వచ్చింది. ఏసుక్రీస్తును శిలువ వేసిన జ్ఞాపకార్థం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు జరిపే.. మతపరమైన సెలవుదినం. ఈ రోజున ప్రజలు క్రీస్తు మరణం నిమిత్తం చర్చికి వెళ్లి సంతాపం వ్యక్తం చేస్తారు. అందుకే దీనిని హోలీ ఫ్రైడే లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు.

లెంట్ డేస్

యేసుక్రీస్తు పునరుత్థానం లేదా.. ఆయన తిరిగి లేచారని నమ్ముతూ.. క్రైస్తవులు నిర్వహించే ఈస్టర్ ఆదివారానికి కేవలం రెండు రోజుల ముందు గుడ్​ ఫ్రైడే వస్తుంది. మాండీ గురువారం తర్వాత ఈ ఫ్రైడే వస్తుంది. ఇది ఈస్టర్​కు ముందు వచ్చే గురువారం, ఏసుక్రీస్తు చివరిసారిగా చేసిన విందును గుర్తుచేస్తుంది. ఇవి సంతాప దినాలు(లెంట్ డేస్​) కావడంతో.. క్రైస్తవులు వేడుకలు, ప్రత్యేక విందులు చేసుకోరు. చాలా మంది కఠినమైన ఉపవాసాలు చేస్తారు. మాంసాన్ని ముట్టరు.

శిలువ కథ..

ఈ పవిత్రమైన రోజున క్రీస్తును స్మరించుకోవడానికి అందరూ చర్చికి వెళ్తారు. పాస్టర్ సందేశం అందిస్తారు. ఏసుక్రీస్తును శిలువ వేసిన కారణాలను స్మరించుకుంటారు. 30 వెండి నాణేల కోసం జుడాస్.. ఏసును ఎలా మోసం చేశాడు. ఏసుక్రీస్తును క్రూరంగా ఎలా శిలువ వేశారు అనే కథను వివరిస్తారు. అనంతరం దేవుడిని తలచుకుంటూ వివిధ కీర్తనలు పాడతారు.

ఒక్కొక్కరు ఒక్కోలా..

క్రైస్తవ మతంలోని కొన్ని తెగలు గుడ్ ఫ్రైడేను సంతోషకరమైన రోజుగా కూడా చూస్తారు. ఎందుకంటే ఏసు శిలువలో తన రక్తంతో.. తమను పాపలనుంచి రక్షించాడని వారు నమ్ముతారు. కొందరు తమ పూర్వీకుల సమాధుల వద్దకు వెళ్లి క్యాండిల్స్ వెలిగించి సంతాపం వ్యక్తంచేస్తారు. గుడ్ ఫ్రైడే రోజున.. చాలా మంది క్రైస్తవులు ఏసుక్రీస్తు మరణానికి ప్రతీకగా శిలువలు, ఛాయాచిత్రాలు, విగ్రహాలపై నల్లని వస్త్రాన్ని కప్పుతారు.

ఈ గుడ్​ ఫ్రైడేను భారతదేశం, కెనడా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, బెర్ముడా, బ్రెజిల్, ఫిన్‌లాండ్, మాల్టా, మెక్సికో, న్యూజిలాండ్, సింగపూర్, స్వీడన్ వంటి అనేక ఇతర దేశాలలో దీనిని పాటిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వ సెలవు దినం ఇస్తుంది.

సంబంధిత కథనం

టాపిక్