Sleeping Tablets : నిద్రమాత్రలు ఎంత హానికరమో తెలుసా?-why sleeping tablets are dangerous to health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleeping Tablets : నిద్రమాత్రలు ఎంత హానికరమో తెలుసా?

Sleeping Tablets : నిద్రమాత్రలు ఎంత హానికరమో తెలుసా?

Anand Sai HT Telugu
Sep 24, 2023 07:45 PM IST

Sleeping Tablets : కొంతమందికి ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు. దీంతో నిద్రమాత్రలు వేసుకోవడం మెుదలుపెడతారు. క్రమక్రమంగా ఇది అలవాటుగా మారుతుంది. దీంతో ప్రమాదాలు ఉన్నాయి.

నిద్ర మాత్రలు
నిద్ర మాత్రలు (unsplash)

నిద్ర మన జీవితంలో చాలా ముఖ్యమైనది. చాలామంది ఎక్కువ నిద్రపోవడానికి ఇష్టపడతారు, చాలా మంది చిన్న గాఢ నిద్రతో సంతృప్తి చెందుతారు. ఇలా రకరకాలుగా వారి స్వభావాన్ని బట్టి నిద్ర ఉంటుంది. నిద్ర అనేది సహజ నియమం, అందరికీ సమానంగా అవసరం.

మంచి ఆరోగ్యానికి రోజుకు 7-8 గంటల నిద్ర అవసరం. నిద్ర లేకుంటే.. శరీరంపై ప్రభావం పడుతుంది. కానీ అందరికీ సులభంగా నిద్ర అనేది రాదు. నిద్ర అనగానే కొందరికి అనేక సమస్యలు వస్తాయి. కొందరు నిద్రించడానికి మెడిసిన్ తీసుకుంటారు. స్లీపింగ్ పిల్స్ ప్రాథమికంగా మెదడుపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా నెమ్మదిగా నిద్రపోవడానికి మీకు సహాయపడతాయి. ఈ రకమైన మెడిసిన్ డాక్టర్ సలహాపై తీసుకోవచ్చు. కానీ రోజూ నిద్రమాత్రలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.

నిద్రమాత్రలు తప్పు సమయంలో తీసుకుంటే, అది మీ శరీరంపై ప్రభావం చూపుతుంది. ముందు రోజు రాత్రి నిద్ర మాత్రలు వేసుకుని సరిగ్గా నిద్రపోకపోతే, ఆ ప్రభావం మరుసటి రోజు వరకు ఉంటుంది. మందు తాగిన తర్వాత మరుసటి రోజు ఉదయం మగతగా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇలా అయితే ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, రోడ్డు దాటుతున్నప్పుడు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

కొన్నిసార్లు నిద్రమాత్రలు క్రమం తప్పకుండా వాడటం వల్ల వ్యక్తుల ప్రవర్తనలో మార్పు వస్తుంది. మూడ్ స్వింగ్స్, చికాకు కలిగించే మానసిక స్థితి మొదలైనవి వివిధ లక్షణాలను కలిగిస్తాయి.

నిద్ర మాత్రలు క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా, శరీరం ఆ రకమైన మందులకు అలవాటుపడుతుంది. కొంతకాలం తర్వాత ఔషధం శరీరంలో పనిచేయడం మానేస్తుంది. అప్పుడు మెడిసిన్ డోస్ పెంచాలి. ఇది చాలా కాలం పాటు కొనసాగితే, ఇది శరీరానికి నిజంగా భయంకరంగా మారుతుంది. ప్రాణాలకే ప్రమాదం.

చాలా కాలం పాటు నిద్ర మాత్రలు క్రమం తప్పకుండా తీసుకుంటే, అది శరీరంలోని ఇతర అవయవాలపై ప్రభావం పడుతుంది. శరీర వ్యర్థాలు కూడా శరీరాన్ని విడిచిపెట్టవు. ఫలితంగా ఇది దీర్ఘకాలంలో శరీరాన్ని అనారోగ్యానికి గురి చేస్తుంది.

నిద్ర మాత్రలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మత్తుపదార్థాలకు వ్యసనం ఏర్పడుతుంది. మెడిసిన్ లేకుండా నిద్ర రాకుండా అయిపోతుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నిద్రమాత్రలు తీసుకోవడం మంచిది కాదు. అధిక నిద్ర మాత్రలు మరణానికి కారణమవుతాయి. కొన్నిసార్లు నిద్రమాత్రలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పక్షవాతం, కోమా, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. నిద్రమాత్రల వల్ల కొన్ని సందర్భాల్లో మానసిక రుగ్మతలు కూడా వస్తాయి. కోపం, డిప్రెషన్ వంటి సమస్యలు పెరుగుతాయి.

Whats_app_banner