Bath After Eating : భోజనం చేసిన తర్వాత స్నానం ఎందుకు చేయోద్దు? ఏమవుతుంది?-why shouldn t take a bath after eating here are reasons ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Why Shouldn't Take A Bath After Eating Here Are Reasons

Bath After Eating : భోజనం చేసిన తర్వాత స్నానం ఎందుకు చేయోద్దు? ఏమవుతుంది?

HT Telugu Desk HT Telugu
Apr 16, 2023 01:00 PM IST

Bath After Eating : కొంతమంది తిన్న తర్వాత.. స్నానం చేసేందుకు వెళ్తారు. ఇది చూసిన పెద్దలు.. వద్దు.. వద్దు అలా చేయోద్దు అని చెబుతారు. ఇది మీకూ ఎప్పుడో ఓసారి ఎదురయ్యే ఉంటుంది. అలా భోజనం తర్వాత.. స్నానం ఎందుకు చేయోద్దు?

తిన్నాక స్నానం చేయోద్దు
తిన్నాక స్నానం చేయోద్దు

స్నానం గురించి.. చాలా సామెతలు ప్రచారంలో ఉన్నాయి. స్నానం చేసి వచ్చాక.. ఎవరైనా తుమ్మితే.. మళ్లీ వెళ్లి తల మీద నీళ్లు పోసుకోవాలని చెబుతారు పెద్దలు. తిన్న వెంటనే.. స్నానం(Bath) చేసేందుకు వెళ్లొద్దని అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలానే ఉంటాయి. అయితే వీటిని మూఢనమ్మకం అనుకుంటాం. అయితే దీని వెనుక శాస్త్రీయ కారణాలున్నాయి. మీరు తిన్న వెంటనే ఎందుకు స్నానం చేయకూడదు? ఈ విధంగా స్నానం చేయడం వల్ల శరీరం(Body)పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

రాత్రి భోజనం చేసిన తర్వాత స్నానం చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. రాత్రి 7 లేదా 8 గంటలకు భోజనం(Food)చేసి, ఆపై స్నానం చేసి రాత్రి 10 గంటలకు నిద్రించడం మంచిది. అయితే 9.30కి భోజనం చేసి 10కి స్నానం చేసే అలవాటు ఉంటే ఈరోజే ఆ అలవాటును వదిలేయండి.

రాత్రిపూట మాత్రమే కాదు ఏ సమయంలోనైనా భోజనం చేసిన వెంటనే స్నానం(Bath After Eating) చేయకూడదు. మనం ఉదయం జిమ్ లేదా వర్కౌట్ చేసినప్పుడు, మనకు ఆకలి వేస్తుంది. కాబట్టి మనం ప్రోటీన్ షేక్ తాగుతాం.. డ్రై ఫ్రూట్స్ తింటాం.., ఆపై షవర్‌కి పరిగెత్తుతాం. ఈ అభ్యాసం మీ ఆరోగ్యానికి(health) మంచిది కాదు. మీరు హార్డ్ వర్కౌట్ లేదా జిమ్ చేసినా ఈ అలవాటు వల్ల శరీరానికి పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఈ రకమైన అభ్యాసం మన జీర్ణక్రియపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది.

తిన్న ఆహారం జీర్ణం(digestion) కావడానికి శక్తి అవసరం. మన జీర్ణవ్యవస్థ శరీరంలోని ఆహారాన్ని గ్రహించి జీర్ణం చేస్తుంది. కానీ తిన్న వెంటనే స్నానం చేస్తే శరీరం చల్లబడుతుంది. దీని వల్ల జీర్ణక్రియ సరిగా జరగదు. దీనివల్ల అజీర్తి, ఎసిడిటీ(Acidity) సమస్య వస్తుంది. శరీరంలో జీర్ణక్రియ సరిగా జరగకపోతే అది మన శరీరం మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

తిన్న తర్వాత వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరం చల్లగా ఉండదా కదా? అని మీరు అడగవచ్చు. అయితే ఈ తప్పు చేయవద్దు. వేడి నీటి(Hot Water)లో స్నానం చేయడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటు పెరుగుతుంది. తిన్న తర్వాత కనీసం ఒక గంట తర్వాత స్నానం చేయండి. తిన్న వెంటనే తలస్నానం చేయడమే కాకుండా ఈ పనులు కూడా చేయకూడదు.

తిన్న వెంటనే పళ్లు తోమకూడదు.

ఆహారం తిన్న తర్వాత వ్యాయామం చేయవద్దు.

ఆహారం తిన్న రెండు గంటల తర్వాత మాత్రమే వ్యాయామం చేయాలి.

ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం ఉత్తమం.

మీరు కొన్ని డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. కానీ ఎక్కువ తిన్న తర్వాత వ్యాయామం చేయకూడదు.

తిన్న వెంటనే నడవకండి. ఈ అలవాటు చాలా మందిలో సాధారణం. కానీ ఈ పద్ధతి మంచిది కాదు.

తిన్న తర్వాత 30 నుండి 45 నిమిషాల తర్వాత మాత్రమే నడవండి.

తిన్న వెంటనే నిద్రపోకండి. ఇది ఎసిడిటీ సమస్యను పెంచుతుంది. జీర్ణక్రియకు మంచిది కాదు.

WhatsApp channel