Rice Wash Reasons : బియ్యం కడిగి వండడానికి కారణాలు ఇవే.. తెలుసుకోండి
Rice Wash Reasons : సాధారణంగా బియ్యం కడిగి వండుకుని తింటాం. దీనికి గల కారణాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా?
దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇంట్లో అయినా బియ్యం ఒకటికి రెండుసార్లు కడిగిన తర్వాతే వండుతారు. కొందరైతే చాలాసార్లు కడుగుతారు. ఇలా కడగడం మంచి పద్ధతి కాదు. తక్కువ సార్లు కడిగితే సమస్యలు ఉండవు. కానీ ఎక్కువసార్లు కడిగితేనే తిన్నా కూడా ఉపయోగం ఉండదు. ఇలా బియ్యం కడిగి వండటానికి కారణాలు ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా?
బరువు పెరగకుండా
బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడమే కాకుండా అనేక సమస్యలను కలిగిస్తాయి. అందుకే బియ్యాన్ని కడిగి వండటం వల్ల అదనపు కార్బోహైడ్రేట్లు విడుదలవుతాయి. బియ్యాన్ని పాలిష్ చేసినప్పుడు లేదా ప్రాసెస్ చేసినప్పుడు దానిపై స్టార్చ్ పొర ఏర్పడుతుంది. దీంతో అన్నం అతుక్కుపోతుంది. బియ్యం అతుక్కుపోకపోతే బియ్యాన్ని కడిగి వండాలని నిపుణులు చెబుతున్నారు.
కార్బోహైడ్రైట్స్ తొలగిపోతాయి
బియ్యాన్ని శుభ్రంగా కడగడం వల్ల అదనపు కార్బోహైడ్రేట్లు తొలగిపోవడమే కాకుండా, బియ్యంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి లేదా ఇతర కలుషితాలు కూడా తొలగిపోతాయి. బియ్యాన్ని చల్లటి నీటితో కడగడం వల్ల ఈ మురికి, ధూళి అన్నీ తొలగిపోయి అన్నం శుభ్రంగా మారుతుంది.
బియ్యం అతుక్కోకుండా
బియ్యం సరిగ్గా కడగకపోతే అది ఒకదానికొకటి అతుక్కొని మెత్తగా మారుతుంది. బియ్యాన్ని బాగా కడిగి వండితే అతుక్కోదు. ఎందుకంటే బియ్యం పై పొరలో ఉండే అదనపు పిండి పదార్థం కలిసి ఉండేలా చేస్తుంది. బియ్యం వండే ముందు బాగా కడగాలి.
ఎక్కువగా కడగొద్దు
బియ్యాన్ని కడగడం, వండడం బియ్యం నాణ్యతను మెరుగుపరుస్తుంది. చాలా మంది నాన్-స్టిక్కీ రైస్‌ను ఇష్టపడతారు. అయితే బియ్యాన్ని బాగా కడిగితే అన్నం బాగానే ఉంటుంది. కార్బోహైడ్రేట్లు కూడా పోతాయి. కానీ బియ్యాన్ని ఎక్కువగా మాత్రం కడికి తినకండి. అందులో ఉన్న పోషకాలు మీకు అందవు. ఒకటిరెండు సార్లు సాధారణంగా కడిగి వండితే సరిపోతుంది.
గంజి నీటి ప్రయోజనాలు
బియ్యం కడిగిన తర్వాత వండే సమయంలో గంజి నీటిని వంపుకోవచ్చు. దీనితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గంజి నీరు చర్మం, జుట్టు కోసం అద్భుతమైన పోషణ కూడా అందిస్తుంది. చర్మాన్ని ప్రకాశంగా చేయడంలో జుట్టు ఆరోగ్యంగా పెరగటంలో ఉపయోగపడుతుంది.
గంజి నీటిని తాగటమే కాదు, దీనితో మీ ముఖం, జుట్టు శుభ్రం చేసుకోవచ్చు. ఇందులోని యాంటీఆక్సిడెంట్, మాయిశ్చరైజింగ్, UV నుంచి రక్షించే గుణాలను కలిగి ఉంది. చర్మంపై రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. పిగ్మెంటేషన్, వయస్సు ప్రభావ మచ్చలను నివారించేందుకు గంజి నీరు ప్రభావవంతంగా ఉపయోగపడుతుంది.
గంజి నీరు మూత్రవిసర్జనలో మంట, విరేచనాలు, అధిక రక్తస్రావం, నెలసరి సమస్యలలో కూడా సహాయపడుతుంది. ఈ గంజి తాగితే అరచేతులు, అరికాళ్ళలో మంటను కూడా తగ్గుతుంది. గంజి నీటిలో అనేక ఖనిజాలు, విటమిన్లు దొరుకుతాయి. గంజి నీరు సహజమైన ఎనర్జీ డ్రింక్ లాగా పని చేస్తుంది. బలహీనంగా, నీరసంగా ఉన్నప్పుడు, అలసటగా అనిపిస్తున్నపుడు గంజి నీరు తాగితే తక్షణ శక్తి దొరుకుతుంది. గంజి నీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ తాగినా ఏం కాదు.