జాగ్రత్త.. పోరపాటున కూడా వీటిని మీ ముఖంపై అప్లై చేయకండి!-why natural ingredients are best for skincare ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  జాగ్రత్త.. పోరపాటున కూడా వీటిని మీ ముఖంపై అప్లై చేయకండి!

జాగ్రత్త.. పోరపాటున కూడా వీటిని మీ ముఖంపై అప్లై చేయకండి!

HT Telugu Desk HT Telugu
Aug 20, 2022 10:56 PM IST

ముఖ సౌందర్యం కోసం మార్కెట్లో దొరికే అనేక ఉత్పత్తులను వాడుతుంటారు. అయితే వీటి వాడకం వల్ల చర్మం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

<p>skin care</p>
skin care

అందంగా ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందంగా కనిపించడం కోసం రకారకాల ప్రయాత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా మహిళలు అందంగా కనిపించడం కోసం రకరకాల ఇంటి చిట్కాలను అవసరమైతే లేజర్ చికిత్సల వంటివి తీసుకుంటారు. అయితే వీటి విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ముఖంపై ఎలాంటి వాటిని అప్లై చేయకూడదో ముందుగా తెలుసుకోవాలి. అవగాహన లేకపోవడం వల్ల కొన్ని రెమిడీస్ ని చర్మంపై అప్లై చేస్తే, అది అనేక చర్మ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, కాబట్టి ఈ విషయాలపై గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖంపై మీరు ఏయే వస్తువులను అప్లై చేయకూడదు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

yearly horoscope entry point

ఈ విషయాలు పెట్టడం మర్చిపోవద్దు

చర్మంపై నిమ్మకాయను ఎల్లాప్పుడూ డైరక్ట్‌గా అప్లై చేయకూడదు. నిమ్మకాయ ఒక రకమైన బ్లీచింగ్ ఏజెంట్. మరో ద్రవానికి కలిపిన తర్వాతే మాత్రమే చర్మానికి నిమ్మకాయను ఉపయోగించాలి. నిమ్మకాయను నేరుగా చర్మంపై పూయడం మానుకోండి.

అలాగే బేకింగ్ సోడాను నేరుగా అప్లై చేయకూడదు. దీని కారణంగా, చికాకు సమస్య మాత్రమే కాకుండా, బేకింగ్ సోడాను నేరుగా ముఖంపై అప్లై చేస్తే, ముదురు నల్ల మచ్చలు కూడా ఏర్పడతాయి.

చర్మంపై వేడి నీటిని ఉపయోగించకూడదు. దీని వల్ల చర్మ కణాలు దెబ్బతింటాయి. అలాగే ముఖంపై నల్ల మచ్చలు ఏర్పడతాయి.

చర్మంపై టూత్‌పేస్ట్‌ను పూయకూడదు. టూత్‌పేస్ట్ చికాకు కలిగించడమే కాకుండా సమస్య కూడా కలిగిస్తుంది.

చర్మంపై ఉప్పు, చక్కెరను ఉపయోగించకూడదు. ఈ రెండింటినీ కలిపి అప్లై చేయడం వల్ల చర్మంపై పొట్టు రాలిపోతుంది. ఈ విధంగా ఉంచడం మానుకోండి.

Whats_app_banner

సంబంధిత కథనం