Men Masturbation : స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా హస్తప్రయోగం ఎందుకు చేసుకుంటారు?-why men masturbate more than women know in details ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Why Men Masturbate More Than Women Know In Details

Men Masturbation : స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా హస్తప్రయోగం ఎందుకు చేసుకుంటారు?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

Men Masturbation : స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా హస్తప్రయోగం చేసుకుంటారు. ఇదే నిజం. పురుషుల హస్తప్రయోగానికి సంబంధించిన కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఎందుకు ఇలా పురుషులు ఎక్కువ హస్తప్రయోగం చేస్తారు?

హస్తప్రయోగం చేయడం అనేది నేరం కాదు. కానీ అతిగా చేయడం మాత్రం మీకు అస్సలు మంచిది కాదు. హస్తప్రయోగం వలన లాభాలు ఉన్నాయి. అయితే ఎక్కువగా చేస్తే మాత్రం ప్రమాదాలు కూడా ఉన్నాయి. రోజుకు నాలుగైదు సార్లు హస్తప్రయోగం చేసేవాళ్లూ ఉన్నారు. కానీ తర్వాత వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అయితే ఏది ఏమైనా స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా హస్త ప్రయోగం చేస్తారు.. ఎందుకు?

ట్రెండింగ్ వార్తలు

ప్రతి 7 సెకన్లకు ఒక పురుషుడు సెక్స్ గురించి ఆలోచిస్తాడని మీకు తెలుసా? స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా హస్తప్రయోగం చేసుకోవడానికి బహుశా ఇది కూడా కారణం కావచ్చు. అబ్బాయిలు దీని గురించి ఇంతగా ఎలా ఆలోచిస్తారు అని చాలా సార్లు అమ్మాయిలు ఆశ్చర్యపోతారు. ఇలా పురుషులు ఎక్కువగా హస్త ప్రయోగం చేసేందుకు చాలా కారణాలు ఉన్నాయి.

చాలా మంది పురుషులు ఒత్తిడిలో ఉన్నప్పుడు, దాని నుండి బయటపడాలని కోరుకుంటే, వారు సెక్స్ లో పాల్గొంటారు. అది వారికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఒకవేళ భాగస్వామి లేకపోతే మాత్రం హస్తప్రయోగం చేసుకుంటరు.

పురుషులు విసుగు చెందినప్పుడు, తరచుగా హస్తప్రయోగం చేసుకుంటారు. ఇలా చేయడం ద్వారా వారు సంతోషంగా ఉంటారు. వారి మనస్సును వేరే పనిపై కేంద్రీకరిస్తారు లేదా నిద్రపోతారు.

ముఖ్యంగా పురుషులు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు హస్తప్రయోగం చేసుకుంటారు. కచ్చితంగా ఆ ఆలోచన వస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు చాలా మంది పురుషులు అవే ఆలోచనలు చేస్తారు. ఎందుకంటే వారికి అలాంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది. ఈ సమయంలో వారు చాలా సార్లు పోర్న్ చూడటంలో బిజీగా ఉంటారు. ఎవరూ లేకుంటే.. ముందుగా అవే సైట్లు ఓపెన్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారు.

చాలా మంది పురుషులు టెన్షన్ ఫీలవుతుంటారు. ఆందోళన చెందుతారు. అటువంటి పరిస్థితిలో వారు పూర్తిగా టెన్షన్ ఫ్రీగా, హాయిగా ఉండేందుకు హస్తప్రయోగం చేస్తూ తమను తాము సంతృప్తి పరుచుకుంటారు.

చాలా మంది పురుషులు లైంగిక బలహీనతను నివారించడానికి కూడా హస్తప్రయోగం చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల నిద్రపోయే ముందు తమను తాము సంతృప్తి పరుచుకుంటారు.

చాలా మంది పురుషులు హ్యాంగోవర్‌ను వదిలించుకోవడానికి హస్తప్రయోగం కూడా చేస్తారు. ఇది వారి మెదడుకు అదనపు శక్తిని ఇస్తుంది. మత్తు ప్రభావాల నుండి విముక్తి చేస్తుంది. లైంగిక జీవితం లేని లేదా సంతృప్తి చెందని పురుషులు కూడా హస్తప్రయోగం ద్వారా సంతృప్తిని పొందుతారు.

WhatsApp channel